/rtv/media/media_files/2025/03/20/ILZyW2aNtPw7ByLaizBE.jpg)
JDS MLA MT Krishnappa
కర్ణాటక అసెంబ్లీలో ఓ వింత ప్రతిపాదన వచ్చింది. సీనియర్ జేడీఎస్ ఎమ్మెల్యే ఎంటీ కృష్ణప్ప మాట్లాడుతూ పురుషులకు వారానికి రెండు బాటిళ్లు ఉచిత మద్యం ఇవ్వాలని కోరారు. '' సీఎం సిద్దరామయ్య ఎక్సైజ్ శాఖ ఆదాయ లక్ష్యాన్ని రూ.36,500 కోట్ల నుంచి రూ.40 వేలకు పెంచారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరినాటికి దీన్ని వసూలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం మళ్లీ పన్నులు పెంచాల్సి వస్తోంది. ప్రజలను మందు తాగకుండా మనం ఆపలేం. వాళ్ల మద్యం ఖర్చులతో మహిళలకు నెలకు రూ.2 వేలు, ఉచిత విద్యుత్, ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు.
Also Read: వినియోగదారులకు అలర్ట్....నాలుగు రోజులు బ్యాంక్ లు బంద్
కాబట్టి మద్యం తాగేవాళ్లకి వారానికి రెండు వైన్ బాటిళ్లు ఫ్రీగా ఇవ్వండని'' ఎమ్మెల్యే ఎంటీ కృష్ణప్ప అసెంబ్లీ సాక్షిగా డిమాండ్ చేశారు. కానీ ఆయన ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. కాంగ్రెస్ మంత్రి కేజే జార్జ్ ఆయనకు గట్టిగా బదులిచ్చారు. '' మీరు ఎన్నికల్లో గెలిచి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అప్పుడు దీన్ని అమలు చేయండి. ప్రజలకు మద్యం తక్కువ తాగేలా చేసేందుకు మేము ప్రయత్నిస్తున్నామని'' తెలిపారు.
Also Read: త్వరలో టోల్ ట్యాక్స్‌లో కొత్త విధానం.. కేంద్రమంత్రి నితీన్ గడ్కరీ
మరో సీనియర్ కాంగ్రెస్ నేత బీఆర్ పాటిల్ మాట్లాడారు. ''మద్యాన్ని పూర్తిగా నిషేధించాలన్నారు. ఎక్సైజ్ రెవెన్సూ పాపిస్టి సొమ్ము. పేదవారి రక్తాన్ని పండి సంపాదిస్తున్న డబ్బు. దీంతో మనం జాతి నిర్మాణం చేయలేం. కేంద్ర ప్రభుత్వమే దేశవ్యాప్తంగా మద్యాన్ని నిషేధించే ఆలోచన చేయాలని'' బీఆర్ పాటిల్ అన్నారు. మొత్తానికి కర్ణాటక అసెంబ్లీలో వారానికి రెండు మద్యం బాటిళ్లు ఫ్రీగా ఇవ్వాలనే ప్రతిపాదన తీసుకురావడం చర్చనీయాంశమవుతోంది.
Also Read: ప్రజల్లోకి వెళ్లాలంటే....గన్ లెసెన్స్ ఇవ్వండి...పోలీసులకు ఆ ఎమ్మెల్యే లేటర్..