కామాంధుల ఆగడాలు పెరిగిపోయాయి. చిన్నారులను సైతం వదలడం లేదు. తల్లిదండ్రుల కళ్లుగప్పి.. తీసుకువెళ్లి వారిపై అత్యాచారం చేస్తున్నారు. ఈ విషయం బయటకు తెలియకుండా ఉండాలని.. చిట్టి చిట్టి చిన్నారులను హతమారుస్తున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా కర్ణాటకలో చోటుచేసుకుంది. హుబ్లీలో ఆదివారం (ఏప్రిల్ 12) న ఉదయం.. ఇంటి బయట ఆడుకుంటున్న ఓ పాపను ఒక కామాంధుడు తనతో తీసుకెళ్లి రేప్ చేశాడు.
ఇది కూడా చూడండి: విశాఖలో దారుణం.. మరో 24 గంటల్లో డెలివరీ.. నిండు గర్భిణిని గొంతు పిసికి చంపిన భర్త!
ఆపై ఆ చిన్నారి అరవడంతో అక్కడే ఆమెను గొంతునులిమి చంపేశాడు. ఆ తర్వాత అక్కడ నుంచి పరారయ్యాడు. ఆ పాపను రేప్ చేసి చంపిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. నిందితుడ్ని వెంటనే శిక్షించాలని తల్లిదండ్రులతో పాటు స్థానికులు ఆందోళనకు దిగారు. ఈ కేసును వేగవంతం చేసిన పోలీసులు ఎట్టకేలకు ఆ నిందితుడ్ని పట్టుకున్నారు. ఆపై ఎన్ కౌంటర్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇది కూడా చూడండి: ఇంట్లో శివలింగం ఏ దిశలో ఉంచాలంటే?: శివభక్తులు తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలు!
ఏలా జరిగిందంటే?
ఆ చిన్నారికి 5 ఏళ్లు. ఆమె తండ్రి ఒక పెయింటర్. తల్లి వేరే ఇళ్లల్లో పనిచేస్తూ.. మరోపక్క బ్యూటీ పార్లర్‌లో వర్క్ చేస్తుంది. ఆదివారం (ఏప్రిల్ 12) పనికి వెళ్లినపుడు తన కూతురిని వెంట తీసుకెళ్లింది. ఆమె ఇంట్లో పని చేసుకుంటుండగా.. కూతురు బయట ఆడుకుంటుంది. అదే సమయంలో బీహార్‌కు చెందిన వలస కూలి నితేష్ కుమార్.. చిన్నారిని చూసి అక్కడకు వెళ్లాడు. అనంతరం ఆ 5 ఏళ్ల చిన్నారిని తన చెంకలో వేసుకుని తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆపై ఆమె అరవడంతో చిన్నారి గొంతునులిమి చంపేసి అక్కడ నుంచి పరారయ్యాడు.
అనంతరం పాప ఇంటి బయట లేకపోయే సరికి ఆమె తల్లి మొత్తం వెతికింది. సమీపంలో మొత్తం తిరిగింది. ఎక్కడా కనిపించలేదు. బోరున ఏడుస్తూ ఎండల్లో పరుగులు పెట్టింది. ఆమె రోధనలు విన్న స్థానికులు కూడా ఆ పాపను వెతకడం మొదలు పెట్టారు. అలా వెతుకుతుండగా.. ఆమె పని చేస్తున్న ఇంటి సమీపంలో నిరుపయోగంగా ఉన్న బాత్ రూమ్‌లో చిన్నారి విగతజీవిగా కింద పడి ఉంది. అది చూసిన ఆ తల్లి తల్లడిల్లింది. వెంటనే చిన్నారిని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. కానీ ఫలితం లేకపోయింది. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
ఇది కూడా చూడండి: ఆ నరుకుడు ఏంది సామి.. రక్తం ఏరులైపారిందిగా..! హిట్-3' ట్రైలర్ రిలీజ్..
దీంతో హుబ్బాలిలోని అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు చిన్నారి తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళనకు దిగారు. నిందితుడ్ని పట్టుకుని శిక్షించాలని.. ఆ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ఎత్తున ధర్నాకు దిగారు. ఈ కేసును మరింత వేగవంతం చేసిన పోలీసులు.. ఎట్టకేలకు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడి వివరాలు సేకరిస్తున్న సమయంలో నిందితుడు పోలీసులపై దాడికి దిగాడు. వారిపై రాళ్లతో దాడి చేశాడు. ఆ సమయంలో పోలీసుల వెహికల్స్ సైతం బాగా డ్యామేజ్ అయ్యాయి. అతడు పారిపోతున్న సమయంలో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు.
ఇది కూడా చూడండి: రాధీ నావల్ల కావట్లేదే.. ఫస్ట్ వైఫ్‌తో అఘోరీ రాసలీలల ఆడియో లీక్.. ఒక్కసారి విన్నారంటే?
అప్పటికీ అతడు ఆగకపోయే సరికి నిందితుడిపై రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. వెంటనే అతడ్ని హాస్పిటల్‌కు తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. నిందితుడు నితేష్ అప్పటికే మృతి చెందాడు. ఆత్మరక్షణ కోసం నిందితుడిపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఈ ఘటనలో పోలీసులకు సైతం బాగా దెబ్బలు తగిలాయి. వారికి ప్రస్తుతం ట్రీట్మెంట్ అందిస్తున్నారు.
(crime news | encounter | Minor Girl Rape | girl raped and murdered | latest-telugu-news | telugu-news)