నక్సల్ ఫ్రీ రాష్ట్రంగా మారిన కర్ణాటక

కర్ణాటక నక్సల్స్ రహిత రాష్ట్రంగా మారిందని పోలీస్ అధికారులు తెలిపారు. మావోయిస్ట్ నేత లక్ష్మీ ఆదివారం పోలీసులకు లొంగిపోయింది. ఉడిపి జిల్లాలో ఆమెపై 3 కేసులు ఉన్నాయి. వాటిని కొట్టివేయాలని ఆమె కోరింది. రూ.7 లక్షల సరెండర్ ప్యాకేజీ ప్రభుత్వం లక్ష్మీకి ఇచ్చింది.

New Update
maoist in karnataka

maoist in karnataka Photograph: (maoist in karnataka)

కర్ణాటక రాష్ట్రంలోని మావోయిస్ట్ నేత లక్ష్మీ ఆదివారం పోలీసులకు లొంగిపోయింది. కర్ణాటక చివరి నక్సలైట్ బేషరతుగా సరెండర్ అయ్యారని ఉడిపి డిప్యూటీ కమిషనర్ విద్యా కుమారి, ఎస్పీ అరుణ్ కె మీడియాకు తెలిపారు. దీంతో కర్ణాటక రాష్ట్రం నక్సలైట్ లేని ప్రాంతమని వారు ప్రకటించారు. ఉడిపి జిల్లా కుందాపూర్ తాలూకాలోని అమాసెబైల్, శంకరనారాయణ పోలీస్ స్టేషన్లలో లక్ష్మిపై మూడు కేసులు ఉన్నాయి. సరెండర్ అయిన తర్వాత ఆమెపై ఉన్న కేసులను కొట్టివేయాలని పోలీస్ ఆఫీసర్లను కోరింది.

Read also : Ap -Prakasam: పింఛన్ డబ్బులతో సచివాలయ ఉద్యోగి మిస్సింగ్.. తీరా చూస్తే ట్విస్ట్‌ అదిరిందిగా..!g

రాష్ట్ర సరెండర్ కమిటీ శ్రీపాల్ హాజరైన విలేకరులతో అన్నారు. కమిటీ కృషి వల్ల 2025లో ఇప్పటి వరకు 22 మంది నక్సల్ కార్యకర్తలు లొంగిపోయారని, రాష్ట్రంలో లొంగిపోయిన చివరి వ్యక్తి లక్ష్మీ అని అన్నారు. కర్ణాటక ఇప్పుడు నక్సల్ రహిత రాష్ట్రంగా అవతరించింది. లక్ష్మీ భర్త సలీం 2020లోనే ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులకు ముందు సరెండర్ అయ్యారు. 

Read also: ఢిల్లీలో భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ

లొంగిపోయినందుకు లక్ష్మీకి రూ.7 లక్షల సరెండర్ ప్యాకేజీ గవర్నమెంట్ ఇచ్చింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన నక్సల్స్‌కు 'ఎ' కేటగిరీ డినామినేట్ చేయబడింది. సరెండర్ అయిన మావోయిస్టులకు వారి సామర్థ్యాన్ని బట్టి విద్య, పునరావాసం, ఉపాధి వంటి సౌకర్యాలు అందించబడతాయని డిసి కుమారి చెప్పారు. లొంగిపోయిన నక్సలైట్లపై నమోదైన కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, సమాజంలో సాధారణ జీవనం సాగించేందుకు కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసిందని రాష్ట్ర సరెండర్ కమిటీ శ్రీపాల్ అన్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Supreme Court: గవర్నర్ చర్య చట్ట విరుద్ధమే.. సుప్రీంలో స్టాలిన్ ప్రభుత్వానికి ఊరట!

సుప్రీం కోర్టులో తమిళనాడు స్టాలిన్ ప్రభుత్వానికి ఊరట లభించింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్లు శాశ్వతంగా తమ వద్ద ఉంచుకోలేరని న్యాయస్థానం తెలిపింది. కీలక బిల్లులకు సమ్మతి తెలపకుండా పెండింగ్‌లో పెట్టడం చట్టవిరుద్ధమని తీర్పు వెల్లడించింది.

New Update
stalin tm

stalin tm Photograph: (stalin tm)

Supreme Court: సుప్రీం కోర్టులో తమిళనాడు స్టాలిన్ ప్రభుత్వానికి ఊరట లభించింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్లు శాశ్వతంగా తమ వద్ద ఉంచుకోలేరని న్యాయస్థానం తెలిపింది. కీలక బిల్లులకు సమ్మతి తెలపకుండా పెండింగ్‌లో పెట్టడం చట్టవిరుద్ధమని తీర్పు వెల్లడించింది. ఈ మేరకు అసెంబ్లీ తీర్మానించిన బిల్లులను ఆమోదించడంలో ఆలస్యం చేసిన గవర్నర్ ఆర్‌ఎన్‌ రవికి, తమిళనాడు ప్రభుత్వానికి మధ్య వివాదం మొదలైన విషయం తెలిసిందే. కాగా దీనిపై తమిళనాడుతో పాటు రాష్ట్రాలన్నింటికి ఇది భారీ విజయమని సీఎం ఎంకే స్టాలిన్ హర్షం వ్యక్తం చేశారు.

గవర్నర్ చర్య చట్టవిరుద్ధం..

ఈ సందర్భగా తమిళనాడు ప్రభుత్వం వేసి పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.10 బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపాలనేది గవర్నర్ చర్య చట్టవిరుద్ధమని పేర్కొంది. ఇది ఏకపక్షమే అవుతుంది. గవర్నర్‌ బిల్లును పునఃపరిశీలనకు వెనక్కి పంపిన తర్వాత అసెంబ్లీ తిరిగి ఆమోదించిన తర్వాత 2వసారి ఆ బిల్లులను గవర్నర్‌ రాష్ట్రపతికి సిఫార్సు చేయకూడదు. అలా చేయడం చట్ట చట్టవిరుద్ధం. అసెంబ్లీలో రెండోసారి ఆమోదించిన బిల్లులు గవర్నర్ ఆమోదం పొందినట్లే పరిగణించాలి. రాష్ట్రపతికి నివేదించాలనుకుంటే నెలరోజుల్లోపే నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్రపతికి సిఫార్సు అవసరం లేదనకుంటే 3 నెలల్లోపు బిల్లులపై నిర్ణయం వెల్లడించాలి. అంతేతప్పా శాశ్వతంగా వాటిని తమ వద్ద ఉంచుకోలేరు’ అంటూ స్పష్టం చేసింది. 

ఇది కూడా చూడండి: Today Gold Rate: కిక్కిచ్చిన బంగారం ధరలు.. ఇవాళ భారీగా తగ్గాయ్.. తులం ఎంతంటే?

అసలేం జరిగిందంటే..
శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్‌ రవికి పంపగా ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వకుండా వాటిని తనవద్దే పెట్టుకున్నాడని తమిళనాడు ప్రభుత్వం ఆరోపిస్తూ 2023లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బిల్లులను సమ్మతించకపోవడం, పునఃపరిశీలించాలని సూచిస్తూ వెనక్కి కూడా పంపడం లేదని చెప్పింది. రెండోసారి ఆమోదించిన బిల్లుల విషయంలో ఆయన తీరు మారట్లేదని పేర్కొంది. ఈ వ్యవహారంపై తాజాగా సుప్రీం తీర్పు వెలువరించింది. 


ఇది కూడా చూడండి: Ap Aqua -Trump Effect: ఏపీ రైతులపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. చంద్రబాబు కీలక నిర్ణయాలు

 tamilnadu | cm-stalin | supreme-court | governer | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment