/rtv/media/media_files/2025/03/15/nyRlCfiSnwAX5Ge9qKbP.jpg)
Karnataka BJP Leader, Cop In A Midnight Slap Fight, Video Is Viral
కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ బీజేపీ నేత, పోలీస్ అధికారి మధ్య జరిగిన వాగ్వాదం చివరికి ఘర్షణకు దారితీసింది. ఇద్దరు పోట్లాడుకున్నారు. చెంపలపై కొట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం అర్ధరాత్రి ఓ హోటల్ వద్ద కొందరు వ్యక్తులు గుమికూడారు. దీంతో అటువైపు వెళ్తున్న పోలీసులు వాళ్ళని చూశారు.
Also read: శిశువును మంటలపై తలకిందులుగా వేలాడదీసిన భూతవైద్యుడు.. చివరికీ
అక్కడినుంచి వెళ్లిపోవాలని ఎస్‌ఐ గాడిలింగ గౌడర్ చెప్పారు. కానీ మధుగిరి బీజేపీ జిల్లా అధ్యక్షుడు హనుమంత గౌడ మాత్రం పోలీసుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ పోలీస్ అధికారిపై దుర్భాషలాడారు. చివరికి చేయి చేసుకునేందుకు యత్నించాడు.దీంతో ఆ బీజేపీ నేత చెంపపై పోలీస్ అధికారి కొట్టాడు. ఆ తర్వాత హనుమంత గౌడ తిరిగి కొట్టగా ఇద్దరి మధ్య ఘర్షణకు దారి తీసింది.
An incident of assault on PSI (Police Sub-Inspector) #Gadhilingappa, who questioned a group of people standing on the road late at night, has occurred near a private hotel in #Karnataka's #Chitradurga.
— Hate Detector 🔍 (@HateDetectors) March 15, 2025
Hanumantegowda, the #BJP District President of #Madhugiri, and his team were… pic.twitter.com/U7PEMzuJD3
Also Read: హోలీ రోజు ఆకతాయిలు చేసిన పనికి.. 8 మంది అమ్మాయిలు హాస్పిటల్ పాలైయ్యారు
దీంతో ఆ బీజేపీ నేతను, పోలీసు అధికారిని విడిపించేందుకు అక్కడున్న పోలీస్ సిబ్బంది, ఇతరులు యత్నించారు. చివరికి ఈ గొడవ తర్వాత ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. అయితే వాళ్లు పోట్లాడుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు వాళ్లపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.