/rtv/media/media_files/2025/03/24/9KJhlLdE1r7jiDgTBoNN.jpg)
ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ తన నటనతోనే కాకుండా వ్యక్తిగత జీవితం పరంగా కూడా వార్తల్లో నిలిచింది. సైఫ్ అలీ ఖాన్‌ను వివాహం చేసుకున్న కరీనా పాత ఇంటర్వ్యూలో ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
Also Read : Dhoni Review: ధోనీ రివ్యూ దెబ్బకు మిచెల్ శాంట్నర్ ఔట్.. వైరల్ గా మారిన వీడియో!
ఇంతకు అదేంటంటే.. కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో డేటింగ్ చేయాలని అనుకున్నానని వెల్లడించింది. అతని ఫోటోలను తరుచూ చూస్తుండేదానని తెలిపింది. తాను సినిమా కుటుంబం నుండి వచ్చానని రాహుల్ల రాజకీయ నాయకుడి కుటుంబం నుండి వచ్చారు కాబట్టి బహుశా ఇది కాంట్రవర్సీకి దారి తీయవచ్చునని ఆమె అభిప్రాయపడింది. కరీనా వీడియో ఇప్పుడు వైరల్ కావడంతో ఆ సమయంలో రాహుల్ గాంధీ చాలా అందంగా ఉండేవారంటూ.. మీరు చెప్పిన దాంట్లో తప్పు లేదని కాంగ్రెస్ పార్టీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : Group-1: గ్రూప్-1 పేపర్లు రీవాల్యుయేషన్ చేయాలి.. అభ్యర్థుల పిటిషన్
షాహిద్ కపూర్‌తో డేటింగ్
కాగా కరీనా గతంలో చాలా ఏళ్లు నటుడు షాహిద్ కపూర్‌తో డేటింగ్ చేసింది. ఆ తర్వాత ఆమె తషాన్ సినిమా సెట్స్‌లో పరిచయమైన సైఫ్ అలీ ఖాన్‌తో ప్రేమలో పడింది. ఇద్దరూ 2012లో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వారికి తైమూర్ , జెహ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక రాహుల్ గాంధీ ఇప్పటివరకూ పెళ్లి చేసుకోలేదు.
Also Read : IPL 2025లో ముంబై చెత్త రికార్డు.. ఐపీఎల్ లోనే ఏ జట్టుకూ లేని!
Also read : GV Prakash: విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్.. ట్విస్ట్ ఏంటంటే!
kareena-kapoor | Kareena Kapoor news | latest-telugu-news | today-news-in-telugu | telugu-cinema-news | telugu-sports-news | national news in Telugu | rahul-gandhi