CM MK Stalin: స్టాలిన్ ఉగాది పోస్టు వివాదం.. మేము ద్రవిడులం కాదంటున్న కన్నడ వాసులు..

ఉగాది పండుగ సందర్భంగా తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఎక్స్‌లో శుభాకాంక్షలు తెలియజేస్తూ చేసిన పోస్ట్ వివాదానికి దారి తీసింది. తెలుగు, కన్నడ ప్రజలను ద్రవిడులుగా పేర్కొంటూ ఉగాది శుభాంకాంక్షలు చెప్పారు. తాము ద్రవిడులం కాదని కన్నడవాసులు విమర్శలు చేస్తున్నారు.

New Update
CM Stalin

CM Stalin

CM MK Stalin: ఉగాది పండుగ సందర్భంగా తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఎక్స్‌లో శుభాకాంక్షలు తెలియజేస్తూ చేసిన పోస్ట్ వివాదానికి దారి తీసింది. తెలుగు, కన్నడ ప్రజలను ద్రవిడులుగా పేర్కొంటూ ఆయన ఉగాది శుభాంకాంక్షలు చెప్పారు. అయితే ఆయన చేసిన పోస్ట్‌పై పలువురు కన్నడవాసులు విమర్శలు చేస్తున్నారు. తాము ద్రవిడులం కాదని అంటున్నారు. '' కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న తెలుగు, కన్నడ మాట్లాడే ద్రవిడ సోదర, సోదరీమణులకు ఉగాది శుభాకాంక్షలు. హిందీ బలవంతపు అమలు, డీలిమిటేషన్ లాంటి రాజకీయ ముప్పు ఉన్న నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలు ఐకమత్యంగా ఉండటం అవసరం. 

Also Read: ఆ విషయంలో అమ్మకు దొరికిపొయా.. వివాదంలో ఇరుకున్న మరో స్టాండప్ కమెడియన్

కన్నడిగులు ఆగ్రహం

మన హక్కులు, గుర్తింపును అణగదొక్కేందుకు చేసే ప్రతీ ప్రయత్నాలను మనమందరం కలిసి ఓడించాలి. ఈ ఉగాది మనలోని ఐక్యతకు సూర్పిగా ఉండాలని కోరుకుంటున్నట్లు'' స్టాలిన్ రాసుకొచ్చారు. అలాగే ఉగాది శుభాకాంక్షలని తెలుగు, కన్నడలో రాసుకొచ్చారు. ఈ పోస్ట్ వైరలవ్వడంతో సోషల్ మీడియాలో వివాదానికి దారి తీసింది. కన్నడ ప్రజలను ద్రవిడులుగా పేర్కొనడంపై పలువురు కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Also Read: ''నెక్ట్స్‌ చంపేది నిన్నే''.. ఆ పార్టీ నేతకు ఫోన్‌ చేసి బెదిరించిన బిష్ణోయ్‌ గ్యాంగ్

హిందీ బలవంతపు అమలు, డీలిమిటేషన్‌పై  మీతో కలిసి పోరాడేందుకు కన్నడ ప్రజలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని.. కానీ మేము ద్రవిడులం కాదని అంటున్నారు. కన్నడ ద్రవిడ భాష కాదని చెబుతున్నారు. మరోవైపు టీవీకే పార్టీ అధినేత, నటుడు విజయ్ కూడా దీనిపై స్పందించారు. స్టాలిన్‌పై విమర్శలు చేశారు. డీఎంకే పార్టీ ద్రవిడ మోడల్ ముసుగులో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Also Read: అమెరికా అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు..మూడోసారి కూడా నేనే..!

cm-stalin | telugu-news | rtv-news 

Also Read:  Betting App: బెట్టింగ్ యాప్స్‌పై సిట్‌ ఏర్పాటు.. డీజీపీ కీలక ఆదేశం

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pinaray Vijayan: పినరయ్ విజయన్‌కు షాక్.. కూతురికి జైలు శిక్ష ?

కేరళ సీఎం పినరయ్‌ విజయన్‌కు కేంద్రం షాకిచ్చింది. ఆయన కుమార్తె టి.వీణా విజయన్‌పై నమోదైన ఆర్థిక నేరం కేసులో ఆమెను విచారణ చేసేందుకు కేంద్రం పర్మిషన్ ఇచ్చింది. ఈ కేసులో ఆమె దోషిగా తేలితే 6 నెలల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష పడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

New Update
Pinaray Vijayan and veena vijayan

Pinaray Vijayan and veena vijayan

కేరళ సీఎం పినరయ్‌ విజయన్‌కు కేంద్రం షాకిచ్చింది. ఆయన కుమార్తె టి.వీణా విజయన్‌పై నమోదైన ఆర్థిక నేరం కేసులో ఆమెను విచారణ చేసేందుకు కేంద్రం పర్మిషన్ ఇచ్చింది. ఈ వ్యవహారంపై న్యాయ విచారణ చేపట్టేందుకు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ తాజాగా ఆదేశించింది. అయితే కొచ్చిన్ మినరల్స్ అండ్ రిటైల్ లిమిటెడ్ కంపెనీ నుంచి వీణా విజయన్‌కు చెందిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్‌ కంపెనీకి అక్రమంగా డబ్బు బదిలీ అయిందనే ఆరోపణలు ఉన్నాయి.   
 
దీనిపై కొచ్చిలోని ఆర్థిక నేరాలను పరిశీలించే ప్రత్యేక కోర్టులో  సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసు (SFIO)  కేసు దాఖలైంది. సీఎంఆర్‌ఎల్, ఎక్సాలాజిక్ సొల్యూషన్స్‌ మధ్య అక్రమంగా ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఆరోపించింది. 2017 నుంచి 2020 వరకు సీఎంఆర్‌ఎల్‌ సంస్థ నుంచి వీణా విజయన్‌కు చెందిన కంపెనీకి దాదాపు 1.72 కోట్లు బదిలీ అయినట్లు తెలిపింది.  సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసు (SFIO) తన ఛార్జ్‌షీట్‌లో వీణా విజయన్‌ను నిందితురాలిగా చేర్చింది.
అలాగే  సీఎంఆర్‌ఎల్ మేనేజింగ్ డైరెక్టర్‌ శశిథర్ కార్తా, మరో 25 పేర్లను నిందితులుగా చేర్చింది. అయితే ఈ కేసులో విచారణ చేపట్టాలని తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆదేశించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకవేళ ఈ కేసులో వీణా విజయన్‌ దోషిగా తేలితే ఆరు నెలల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 
rtv-news | pinarayi-vijayan | national-news
Advertisment
Advertisment
Advertisment