Kaman Bridge: 6 సంవత్సరాల తరువాత తెరుచుకున్న పాక్‌-ఇండియా మధ్య వంతెన!

భారతదేశం, పాకిస్తాన్ మధ్య 6 ఏళ్ల తర్వాత కమాన్ వంతెన తిరిగి మరోసారి తెరుచుకుంది. జీలం నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న జంట మృతదేహాలను తిరిగి ఇచ్చేందుకు ఈ వంతెనను తెరిచినట్లు సమాచారం.

New Update
kaman

kaman

భారతదేశం, పాకిస్తాన్ మధ్య 6 ఏళ్ల తర్వాత కమాన్ వంతెన తిరిగి మరోసారి తెరుచుకుంది. భారత్-పాక్ విభజన, ఈ రెండు దేశాల మధ్య సంబంధాలకు కేంద్రంగా జీలం నదిపై ఉన్న కమాన్ వంతెన నిలిచింది. చాలా ఏళ్ల తర్వాత  ఈ వంతెనను తిరిగి మరోసారి తెరిచారు. జీలం నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న జంట మృతదేహాలను తిరిగి ఇచ్చేందుకు ఈ వంతెనను తెరిచినట్లు సమాచారం. ఇది రాజకీయ ప్రాముఖ్యతతో పాటు మానవతా చర్యగా చెప్పుకుంటున్నారు.

Also Read: BIG BREAKING: నెల్లూరులో దారుణం.. ఆస్తి కోసం తండ్రిపై కొడుకు కాల్పులు!

మార్చి 5న, జమ్మూ కాశ్మీర్ బారాముల్లా జిల్లాలోని బాస్గ్రాన్, కమల్ కోట్ గ్రామాలకు చెందిన యువకుడు, మహిళ జీలం నదిలో విషాదకరంగా మునిగి చనిపోయారు అని ఇండియన్ ఆర్మీ తెలిపింది. 22 ఏళ్ల యువకుడు, 19 ఏళ్ల యువతి మృతదేహాలు నది ప్రవాహం దాటికి సరిహద్దు దాటి పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లాయని అధికారులు తెలిపారు. డెడ్‌బాడీలను వెలికి తీసేందుకు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. యువకుడి మృతదేహం భారత్ వైపు మొదటగా కనిపించింది. 

Also Read: IMD -Ap: మరో నాలుగు రోజులు వడగళ్ల వానలు..జాగ్రత్త..వాతావరణ శాఖ హెచ్చరికలు!

మృతదేహాన్ని వెలికితీసే లోపే ప్రవాహంలో ‘‘నియంత్రణ రేఖ’’ అవతలకు కొట్టుకుపోయింది. ఇది చివరకు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని చినారి సమీపంలో పాక్ వైపు కనిపించింది. అక్కడి అధికారులు డెడ్‌బాడీని స్వాధీనం చేసుకుంది. యువతి మృతదేహం కూడా పీఓకేలో స్వాధీనం చేసుకున్నారు. వీరి మృతదేహాలను తిరిగి తీసుకురావడానికి ‘‘శాంతి వంతెన’’గా పిలిచే కమాన్ వంతెనను మానవతా దృక్పథంతో శనివారం తెరిచారు. ఇద్దరి మృతదేహాలను సజావుగా తీసుకువచ్చేందుకు భారత్-పాక్ సైనిక అధికారులు సహకరించుకున్నారు.

 ఈ వంతెనను 2005లో ప్రారంభించారు. అయితే, 2019 ఫిబ్రవరిలో పుల్వామా దాడుల తర్వాత ఈ వంతెనను మూసి వేశారు. గతంలో ఈ వంతెన జమ్మూ కాశ్మీర్, పీఓకే మధ్య ప్రజల రవాణాకు ఉపయోగించేవారు. ఇరు వైపుల ఉన్న బంధువులు ఒకరినొకరు కలుసుకునేందుకు ఉపయోగపడింది. మూసేసిన 6 ఏళ్ల తర్వాత విషాద ఘటన కారణంగా మళ్లీ తెరిచారు.

Also Read: Tech Mahindra: ఖతార్ లో గుజరాత్‌ కి చెందిన టెక్ మహీంద్రా ఉద్యోగి అరెస్ట్

Also Read: Bangladesh: ఢాకాలో భారీగా సైన్యం.. తిరుగుబాటు పరిస్థితులు..!

 latest-news | bharat | loc | pak | kaman bridge | latest-telugu-news | latest telugu news updates | telugu-news 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴Live Breakings: ఐశ్వర్యరాయ్‌ కారుకు ప్రమాదం..వెనుకనుంచి ఢీ కొట్టిన బస్సు...

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

  • Mar 26, 2025 21:50 IST

    Aishwarya Rai Bachchan: ఐశ్వర్యరాయ్‌ కారుకు ప్రమాదం..వెనుకనుంచి ఢీ కొట్టిన బస్సు...

    బాలీవుడ్ అగ్ర నటి, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కోడలు ఐశ్వర్యరాయ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైందన్న వార్తలతో భారతీయ చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. ముంబైలోని ఐష్ ప్రయాణిస్తున్న కారును ఓ బస్సు ఢీకొట్టినట్లుగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

    Aishwarya Rai Bachchan
    Aishwarya Rai Bachchan

     



  • Mar 26, 2025 21:49 IST

    NATO: మా జోలికొస్తే వినాశనమే.. తప్పించుకోలేవ్: పుతిన్‌కు నాటో వార్నింగ్!

    రష్యాకు NATO స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. కూటమిలోని పోలాండ్‌ లేదా ఏ దేశం జోలికొచ్చినా వినాశకర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నాటో సెక్రటరీ జనరల్‌ మార్క్‌ రుట్టే హెచ్చరించారు. పుతిన్‌ లేదా మరెవరైనా తమపై ఆధిపత్యం సాధించాలనుకుంటే అది పొరపాటే అన్నారు.

    nato
    nato Photograph: (nato)

     



  • Mar 26, 2025 21:48 IST

    BIG BREAKING: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి జగన్ శుభవార్త.. కీలక పదవి!

    బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి వైసీపీ అధినేత జగన్ శుభవార్త చెప్పారు. వైయస్ఆర్ సీపీ రాష్ట్ర యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని నియమించినట్లు అధికారికంగా ప్రకటించారు. 

    baireddy
    baireddy Photograph: (baireddy)

     



  • Mar 26, 2025 10:05 IST

    మాజీ మంత్రి కొడాలి నానికి గుండెపోటు.. సీరియస్?

    మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్ లోని AIG హాస్పిటల్ లో చేర్పించారు. ఆయనకు గుండెపోటు వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.

    kodali-nani aig
    kodali-nani aig

     



  • Mar 26, 2025 07:55 IST

    రషీద్ ఖాన్ అరుదైన రికార్డు.. మలింగ, బుమ్రాలతో కలిసి



  • Mar 26, 2025 07:55 IST

    యాదగిరిగుట్టలో ఘోర ప్రమాదం.. 13 మంది స్పాట్

    తెలంగాణలోని యాదగిరి గుట్టలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. హైవేపై వెళ్తున్న కంటైనర్‌ను వెనుక నుంచి రెండు బస్సులు ఢీకొన్నాయి. చౌటుప్పల్ మండలంలో ఈ ప్రమాదం జరగ్గా.. 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

    BREAKING NEWS
    breaking news

     



  • Mar 26, 2025 07:54 IST

    కేటీఆర్ పై కేసు నమోదు!

    కేటీఆర్ పై కేసు నమోదైంది. నల్గొండ జిల్లా నకిరేకల్ పోలీస్ స్టేషన్ లో కేసు బుక్ అయింది.  పదో తరగతి పేపర్ లీకేజీ ఘటనలో తమపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ మున్సిపల్ ఛైర్ పర్సన్ రజిత కేటీఆర్ పై ఫిర్యాదు చేశారు.



  • Mar 26, 2025 07:54 IST

    గుజరాత్ను ఓడించి..పంజాబ్ను గెలిపించిన రూ. 5 కోట్ల ఆటగాడు!



  • Mar 26, 2025 07:54 IST

    బయటపడిన భార్య అక్రమ సంబంధం.. సజీవంగా పాతిపెట్టిన భర్త

    హర్యానాలో ఓ భార్య ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం బయపడటంతో భర్త ఆ వ్యక్తిని సజీవంగా పాతిపెట్టాడు. పోలీసులకు మిస్సింగ్ కేసు రావడంతో దర్యాప్తు చేపట్టారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల అదుపులో నిందితుడు ఉన్నాడు.

    Haryana Crime
    Haryana Crime Photograph: (Haryana Crime)

     



  • Mar 26, 2025 07:53 IST

    1+1..వైన్ షాప్స్ బంపరాఫర్.. ఎగబడ్డ మందుబాబులు!

    ఉత్తర్ ప్రదేశ్ లో మద్యం దుకాణాల వద్ద నిన్న భారీ క్యూలైన్లు కనిపించాయి. 2025 మార్చి 31తో ఆయా షాపుల లైసెన్స్ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో తమ వద్ద ఉన్న స్టాకు గడువులోగా విక్రయించేందుకు వ్యాపారులు బంపరాఫర్లు ప్రకటించారు



  • Mar 26, 2025 07:53 IST

    ఇక ఏటీఎం నుంచి పీఎఫ్‌ నగదు తీసుకోవచ్చు...



Advertisment
Advertisment
Advertisment