/rtv/media/media_files/2025/02/20/IhKRJXxmhn9W5OPv9Uas.jpg)
death
కేరళలో ఓ జీఎస్టీ అధికారి ఇంట్లో మరణాలు మిస్టరీగా మారడం సంచలనం రేపుతోంది. ఆయనతో పాటు తల్లి, సోదరి అనుమానస్పదంగా మృతి చెందారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. మనీశ్ విజయ్ అనే వ్యక్తి కొచ్చిలో సెంట్రల్ ఎక్సైజ్ అండ్ జీఎస్టీ విభాగంలో అడిషనల్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవలే ఆఫీసులు 4 రోజులు సెలవులు పెట్టారు. ఆ సెలవులు పూర్తయినా కూడా విధుల్లోకి రాలేదు. దీంతో స్నేహితులు ఎర్నాకుళం జిల్లాలో ఆయన ఉంటున్న క్వార్డర్స్‌కు వెళ్లి చూడగా దుర్వాసన వచ్చింది. దీంతో పోలీసులకు సమాధానం ఇచ్చారు.
Also Read: డబ్బులు బొక్కా.. విరిగిపోయిన సీటు ఇచ్చారు.. ఎయిర్ ఇండియాపై కేంద్రమంత్రి ఫైర్!
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు తీయగా మనీశ్ ఒక గదిలో, ఆయన సోదరి షాలిని మరో గదిలో ఉరికి వేలాడుతూ కనిపించారు. ఇక వాళ్ల తల్లి వేరే గదిలో మంచంపై నిర్జీవంగా కనిపించారు. ఆమె మృతదేహాన్ని తెల్లని వస్త్రంలో చుట్టి పూలు చల్లినట్లుగా ఉంది. పక్కనే ఈ ముగ్గురు దిగిన ఫొటో కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ ఘటనపై అనుమానాలు తలెత్తుతున్నాయి. వీళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారా ? లేదా ఎవరైనా హత్య చేశారా ? అనే దానిపై దర్యా్ప్తు జరుగుతోంది.
కొన్నిరోజుల క్రితమే వాళ్లు మృతి చెందినట్లు కొచ్చి పోలీసులు తెలిపారు. ఫొరెన్సి్క్ పరీక్ష తర్వాత వాళ్ల మరణాలకు గల కారణాలు తెలుస్తాయని చెప్పారు. అంతేకాదు ఓ గదిలో డైరీ కూడా పోలీసులకు కనిపించింది. విదేశాల్లో ఉన్న సోదరికి తమ మరణం గురించి చెప్పాలని.. ఇంట్లో ఉన్న పత్రాలన్ని ఆమెకు ఇవ్వాలని అందులో ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి మనీశ్ కుటుంబం స్వస్థలం ఝార్ఖండ్. గతంలో ఆయన కోళికోడ్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ విభాగంలో పనిచేశారు. ఆ తర్వాత సెంట్రల్ ఎక్సైజ్ అండ్ జీఎస్టీ విభాగానికి బదిలీ అయ్యారు.
Also Read: ఎంతకు తెగించార్రా.. ఒకడ్ని నమ్మి హోటల్ కు వెళ్తే.. నలుగురు కలిసి అత్యాచారం!
అయితే మనీశ్ సోదరి షాలిని ఝార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC) పరీక్షలో మొదటి ర్యాంకు సాధించారు. ఈ పరీక్షల్లో అవకతవకలు జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనికి సంబంధించిన కేసును సీబీఐ విచారిస్తోంది. ఈ కేసులో షాలిని కూడా నిందితురాలిగా ఉంది. దీంతో మనస్తాపానికి గురై ఈ కుటుంబం సూసైడ్ చేసుకోవచ్చని కూడా పోలీసులు అనుమామాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈ లీగల్ కేసు మీదే మనీశ్ ఇటీవల సెలవులు పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు.