BIG BREAKING: షాకింగ్ న్యూస్.. కిడ్నాప్ చేసి మూత్రం తాగించిన ఎమ్మెల్యే!

ఆర్జేడీ ఎమ్మెల్యే, అతడి సోదరులు తనను కిడ్నాప్ చేశారని జేడీయూ నేత ఆరోపించారు. అలాగే తనను కొట్టారని, బలవంతంగా మూత్రం తాగించారని పోలీసులను ఆశ్రయించారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
RJD MLA Syed Ruknuddin

RJD MLA Syed Ruknuddin

ఆర్జేడీ ఎమ్మెల్యే, అతడి సోదరులు తనను కిడ్నాప్ చేశారని జేడీయూ నేత ఆరోపించారు. అలాగే తనను కొట్టారని, బలవంతంగా మూత్రం తాగించారని పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు ఆర్జేడీ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. కానీ ఈ ఆరోపణలు ఆ ఎమ్మె్ల్యే ఖండించారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌లోని పూర్నియా జిల్లాలో అధికార జేడీయూకు చెందిన బైసీ బ్లాక్‌ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ రెహాన్ ఫజల్.. ఆర్జేడీకి చెందిన బైసి ఎమ్మెల్యే సయ్యద్ రుక్నద్దీన్‌ అహ్మద్‌పై పలు ఆరోపణలు చేశారు. 

Also Read: వామ్మో.. పెట్ డాగ్ ప్రియులు జాగ్రత్త సుమీ.. ఈ వీడియో చూస్తే వణుకు పుట్టాల్సిందే!

ఓ దళిత మహిళకు సంబంధించిన భూ వివాదంలో తనను కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బైక్‌పై ఎక్కించుకొని ఎమ్మెల్యే ఇంటికి తీసుకెళ్లారని.. రాడ్లు, కర్రలతో దారుణంగా కొట్టారని చెప్పారు. తాగేందుకు నీళ్లు అడిగితే బలవంతంగా మూత్రం తాగించారని పేర్కొన్నారు. తీవ్రంగా గాయాలపాలైన ఆ జేడీయూ నేత మొహమ్మద్ రెహాన్‌ ఫజల్ ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. 

Also Read: టోల్‌గేట్ వద్ద దారుణం.. ఓ వ్యక్తిని 50 మీటర్లు ఈడ్చుకెళ్లిన కారు

 మరోవైపు పోలీసులు ఆర్జేడీ ఎమ్మెల్యే సయ్యద్ రుక్నుద్దీన్, అతడి ఐదుగురు సోదరులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యేను అరెస్టు చేసేందుకు వారెంట్ జారీ చేస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. అయితే జేడీయూ నేత ఫజల్ చేసిన ఆరోపణలను ఎమ్మెల్యేకుర్నుద్ధీన్ ఖండించారు. ఈ ఆరోపణలు రాజకీయమని, నిరాధారమైనవని చెప్పారు. తాను కూడా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఇదిలాఉండగా.. సయ్యద్ రుక్నుద్దీన్ ఏఐఎంఐఎం పార్టీ నుంచి ఆర్జేడీలో 2022లో చేరారు.  

Also Read: అమెరికా నుంచి ఇజ్రాయిల్‌కు చేరుకున్న MK-84 బాంబులు.. ఏ క్షణమైనా యుద్ధం..!

Also Read: ఢిల్లీ రైల్వేస్టేషన్ తొక్కిసలాటకు కారణమిదే.. వెలుగులోకి సంచలన విషయాలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Maoist: మవోయిస్టులకు ఆర్ఎస్ ప్రవీణ్ మద్దతు.. దేశ పౌరులను చంపడం అత్యంత నేరం అంటూ!

చర్చలకు సిద్ధమంటూ మావోయిస్టు పార్టీ ప్రకటించిన లేఖపై ఆర్ఎస్ ప్రవీణ్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ప్రభుత్వం ఒక మెట్టు దిగి వారితో చర్చలు జరపాలని కోరారు. 2004లో లాగా కాకుండా ఈ చర్చలు ఒక ప్రణాళిక బద్ధంగా ఉండాలని RTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోరారు.

New Update
rsp maoist

rsp maoist Photograph: (rsp maoist)

Maoist: కేంద్ర ప్రభుత్వంతో తాము చర్చలకు సిద్ధమంటూ మావోయిస్టు పార్టీ ప్రకటించిన అంశంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ లేఖపై ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్‌గా తన మనసులో ఉన్నది వ్యక్తపరుస్తున్నట్లు తెలిపారు. ఆగస్టులో మావోయిస్టు పార్టీ చర్చలకు ఒప్పుకుంటుంది. కాబట్టి భారత ప్రభుత్వం కూడా ఒక మెట్టు దిగి చర్చలు జరపాలన్నారు. భారతదేశ పౌరులు దేశంలో ఉన్న పౌరులను చంపడం అత్యంత నేరమని సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌లో స్పష్టంగా ఉంది. కావున ఈసారి జరగబోయే చర్చలు 2004లో లాగా కాకుండా ఒక ప్రణాళిక బద్ధంగా ఉంటే బాగుంటుందని RTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోరారు.

Also Read: పసిబిడ్డల ఉసురు తీస్తున్న అక్రమ సంబంధాలు.. ఈ ఏడాది ఎంతమందిని చంపేశారంటే!

పేపర్ మిల్లు ఎన్నికల కోసం సిద్ధం..

అలాగే సిర్పూర్ పేపర్ మిల్లు ఎన్నికల కోసం సిద్ధమవుతున్నట్లు తెలిపారు. స్థానికులకే సిర్పూర్ పేపర్ మిల్లులో ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిర్పూర్ లో ఉన్న సమస్యల కోసం ఆగిపోయిన అభివృద్ధి కోసం ధర్నాలు రాస్తారోకోలు మేమే చేస్తున్నాం. రాష్ట్రంలో HCU భూములను దారాదత్తం చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పక్కా ప్రణాళిక బద్దంగా ముందుకు పోతుంది. దీన్ని మా బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు కలిసి భూముల అమ్ముకోవడానికి కొన్ని ఫైల్స్ మందు పెట్టుకుని కూర్చున్నారు. వాళ్ళ పని భూములమ్ముకోవడమే. 27 న వరంగల్ లో జరిగే టిఆర్ఎస్ సభకు విజయవంతం చేయాలని కోరారు. 

Also Read: అమెరికా ఆహారం బంద్‌..11 దేశాలకు కష్టం!

rs-praveen | amithsha | today telugu news 

Advertisment
Advertisment
Advertisment