BREAKING: ఢిల్లీ, హర్యానాలో మళ్లీ ఉగ్రదాడులకు ప్లాన్.. వెలుగులోకి సంచలన నిజాలు

దేశ రాజధాని ఢిల్లీ, హర్యానాలో భారీ ఉగ్రదాడులకు పాల్పడేందుకు పాకిస్థాన్‌ గూఢచార సంస్థ ‘ఐఎస్‌ఐ’ (ISI) కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ISI టార్గెట్‌ చేసిన జాబితాలో హర్యానాలో ఓ మిలిటరీ క్యాంప్‌, ఢిల్లీలోని ఓ ఆలయం, దాబా ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.

New Update
ISI-linked module planned attacks on Delhi temple, dhaba, military camp

ISI-linked module planned attacks on Delhi temple, dhaba, military camp

దేశ రాజధాని ఢిల్లీ, హర్యానాలో భారీ ఉగ్రదాడులకు పాల్పడేందుకు పాకిస్థాన్‌ గూఢచార సంస్థ ‘ఐఎస్‌ఐ’ (ISI) కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ISI టార్గెట్‌ చేసిన జాబితాలో ఢిల్లీ-సోనిపట్‌ హైవేపై ఉన్న ఓ ప్రముఖ పాపులర్‌ దాబా, హర్యానాలో ఓ మిలిటరీ క్యాంప్‌, ఢిల్లీలోని ఓ ప్రసిద్ధ ఆలయం ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ భారీ ఉగ్రదాడి ప్లాన్‌ను అమలు చేసేందుకు 'షహజాద్‌ భట్‌ మాడ్యూల్‌'కు చెందిన ఉగ్రవాదులను, స్థానిక ఆపరేటివ్‌లను ISI రంగంలోకి దించింది. ఈ ముఠా కదలికలపై నిఘా ఉంచిన ఢిల్లీ పోలీసు విభాగంలోని స్పెషల్ సెల్‌ అధికారులు అలెర్ట్ అయ్యారు. ఇప్పటికే ఈ గ్యాంగ్‌కు చెందిన 9 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. 

Also Read: మంచే జరుగుతుంది .. విజయం నిశ్చయం : విజయ్ సంచలన ట్వీట్!

ఈ దర్యాప్తులో ఉగ్రవాదుల భయంకరమైన వ్యూహాలు బయటపడ్డాయి. పట్టుబడ్డ నిందితుల్లో ఒకరు ఢిల్లీలోని ఓ ప్రముఖ ఆలయం వద్ద సీక్రెట్‌గా రెక్కీ నిర్వహించినట్లు తేలింది. ఆలయ భద్రతా ఏర్పాట్లు, భక్తుల రద్దీని  పరిశీలించిన ఆ నిందితుడు, అక్కడి ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా ద్వారా పాక్‌లోని తన హ్యాండ్లర్లకు పంపించినట్లు గుర్తించారు. ఆలయ పరిసరాల్లోకి ప్రవేశించి, అక్కడున్న సిబ్బందితో పాటు సాధారణ భక్తులను టార్గెట్ చేసుకుని కాల్పులకు పాల్పడాలని వ్యూహం రచించినట్లు పోలీసులు తెలిపారు. 

ఈ ఉగ్ర మాడ్యూల్‌ వెనుక జమ్మూకశ్మీర్‌కు చెందిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ షహజాద్‌ భట్‌ హస్తం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇతడు అందిస్తున్న ఆదేశాలు, నిధుల ఆధారంగానే స్థానిక ముఠా సభ్యులు దాడులు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. వ్యూహాత్మకంగా మిలిటరీ క్యాంప్‌లు, రద్దీగా ఉండే దాబా ప్రదేశాలు, ఆధ్యాత్మిక కేంద్రాలను టార్గెట్‌ చేసుని శాంతిభద్రతలకు విఘాతం కలిగించడమే వీళ్ల ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది. ప్రస్తుతం అరెస్టయిన 9 మంది నిందితులను అదుపులోకి తీసుకుని లోతుగా విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కుట్ర వెనుక ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 

Advertisment
తాజా కథనాలు