Saif Ali Khan: సైఫ్‌ను పొడిచి కోటి డిమాండ్.. సీన్ టూ సీన్ వివరించిన నానీ

నటుడు సైఫ్ అలీఖాన్‌కు ప్రాణాపాయం లేదని...గాయాల నుంచి కోలుకుంటున్నారని చెప్పారు ముంబైలోని లీలావతి ఆసుత్రి వైద్యులు . దాదాపు 30 ని. సైఫ్‌పై దుండగుడు దాడి చేశాడని పోలీసులు తెలిపారు. అతను కోటి రూపాయలు డిమాండ్ చేశాడని...ఇవ్వకపోవడంతో అటాక్ చేశాడని చెప్పారు. 

New Update
actor

Saif Ali Khan

ఆరు చోట్ల తీవ్ర గాయాలతో బాలీవుడ్ (Bollywood) నటుడు సైఫ్ అలీఖాన్ నిన్న ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఆయన ఇంట్లోకి దూరిన ఒక దొంగ...దాడి చేయడంతో సైఫ్‌కు వెన్నెముక, మెడ, చేతులపై గాయాలయ్యాయి. వెన్నెముక మీద పొడవడంతో అందులో ఉండే ద్రవం బయటకు వచ్చింది. అందులో ఉన్న కత్తిని బయటకు తీసి  గాయాన్ని సరి చేశామని లీలావతి ఆసుపత్రి వైద్యులు తెలిపారు. అలాగే అతని మెడ, చేతులపై ప్లాస్టిక్ సర్జరీలను నిర్వహించామని తెలిపారు. సైఫ్ ప్రాణాలకు ప్రమాదం లేదని...ఆపరేషన్ల తర్వాత  కోలుకుంటున్నారని డాక్టర్లు అనౌన్స్ చేశారు. 

కరీనా కపూర్ పోస్ట్..

మరోవైపు సైఫ్ భార్య, నటి కరీనా కపూర్ (Kareena Kapoor) తన భర్త మీద జరిగిన దాడిపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇది తాము ఓపికగా ఉండాల్సిన సమయం అని చెప్పారు. అందరికీ ఆందోళనగా, భయంగా ఉందని కానీ అంతా మంచే జరుగుతుందన్న నమ్మకంతో ఉన్నామని చెప్పుకొచ్చారు. దయచేసి ఈ సంఘటన గురించి ఎవరూ అవాస్తవాలు ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు కరీనా. తమ కుటుంబానికి జరిగిన దాని నుంచి కోలుకోవడానికి సమయం పడుతుందని...అంత వరకూ అందరూ సహకరించాలని ఆమె ప్రార్ధించారు. 

సీన్ టూ సీన్ వివరణ..

సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) పై దాడిని ఆయన ఇంట్లో పనిచేసే, చిన్న కొడుకు జెహ్ను చూసుకునే ఆమె సీన్ టూ సీన్ వివరించారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం సైఫ్ అలీ ఖాన్ పై దుండగుడు దాదాపు 30 నిమిషాల పాటూ దాడి చేశాడు. దొంగతనం చేయడానికి వచ్చిన అతను మొదట సైఫ్, కరీనాల చిన్న కొడుకు జేహ్ గదిలోకి దూరాడు. ఆ గదిలో జెహ్‌తో పాటూ అతని నానీ ఎలియామా ఫిలిప్ కూడా ఉన్నారు. మొదట బాత్‌రూంలో లైట్ వెలిగి ఉండడం ఆమె గమనించారు. కరీనా తన కొడుకును చెక్ చేయడానికి వచ్చారేమో అనుకుని ఫిలప్ పెద్దగా పట్టించుకోలేదు. ఆమె నిద్ర పోయారు. అయితే కొంతసేపటి తర్వాత కూడా ఆ లైట్ వెలుగుతుండడంతో ఆమెకు అనుమానం వచ్చింది. దీంతో లేచి వెళ్ళి చూశారు. అప్పుడే అక్కడ ఒక వ్యక్తి ఉండడం గమనించాను అని చెప్పారు ఫిలిప్. అప్పుడు ఆమె వెంటనే రియాక్ట్ అయి జెహ్ ను వాళ్ల అయిన తైమూర్ గదిలోకి పంపించేసి..దొంగను అడ్డుకోవడానికి ప్రయత్నించారు.  ఈక్రమంలో ఆమెకు కూడా బాగా గాయాలయ్యాయి. 

Also Read:  8th Pay: కేంద్ర ఉద్యోగులకు భారీగా పెరగనున్న జీతాలు, పెన్షన్లు

ఇంతలో తైమూర్ గదిలో ఉన్న రెండవ నానీ సైఫ్ అలీ ఖాన్‌ను లేడానికి వెళ్ళారు. దాంతో సైఫ్ అక్కడకు వచ్చారు. దొంగను ఎదుర్కోవడానికి ప్రయత్నించారు. తనకు కోటి రూపాయలను ఇవ్వాలని దొంగ ఆ సమయంలోనే డిమాండ్ చేశాడని నానీ ఫిలిప్ చెప్పారు. ఆ తర్వాత అతను రెండు చేతుల్లో రెండు ఆయుధాలను పట్టుకుని అటాక్‌ కు దిగడని తెలిపారు. ఒక చేతిలో పొడవాటి కర్ర, మరొక చేతిలో కత్తిలాంటి ఆయుధం ఉందని చెప్పారు. సైఫ్ సర్ కేవలం ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు అని మాత్రమే అడిగారు. ఇంతలోనే ఆ వ్యక్తి దాడికి పాల్పడ్డాడని 56 ఫిలిప్ వివరించారు. సైఫ్, కరీనాలతో పాటూ గదిలోకి వచ్చిన మరో నర్స్ మీద కూడా దొంగ దాడి చేశాడు. 

ఇది జరిగిన తర్వాత తాము అక్కడి నుచి బయటకు వచ్చేశాము. ఆగది తలుపులు బయట నుంచి మూసి తామందరం మేడమీదనున్న గదిలోకి వెళ్ళిపోయాము అని నానీ వివరించారు. తర్వాత కొంతసేపటికి గదిలో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వచ్చాయి. దీంతో అందరం వెళ్ళి గది తలుపు తెరిచి చూశాము. దొంగ అక్కడ నుంచి పారిపోయాడు. ఆ వ్యక్తి సుమారు 35-40 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి, ముదురు రంగు, స్లిమ్ బిల్డ్, 5 అడుగుల 5 అంగుళాల పొడవు, తలపై ముదురు ప్యాంటు, షర్టు ధరించి ఉంటాడని సిబ్బంది వివరించారు.

20 పోలీస్ బృందాలు..

సైఫ్ మీద అటాక్ చేసిన దొంగను పట్టుకోవడానికి ముంబై పోలీసులు 20 బృందాలను ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం రాత్రి 11 తర్వాత ఇంట్లోకి ఎవరూ ప్రవేశించలేదని పోలీసులు చెబుతున్నారు. అయితే దొంగ అంతకు ముందే ఇంట్లోకి వచ్చి దాక్కుని ఉండవచ్చని..లేదా ఇంట్లోని పనివారే ఎవరైనా చేసి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సైఫ్ ఇంటి టెర్రస్ మీద ఫ్లోరింగ్ పని చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు విచారిస్తున్నారు. అనుమానితుడు చివరిసారిగా భవనంలోని ఆరవ అంతస్తులో పారిపోతున్నట్లు కనిపించాడని, లాబీలోని సీసీటీవీ కెమెరాల్లో లోపలికి వెళ్లేటప్పుడుగానీ, బయటకు వెళ్లేటప్పుడుగానీ కనిపించలేదని అంటున్నారు. దీంతో ఇంటి ప్రధాన ద్వారం గుండా అతను రాలేదని సందేహం వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: Space X: అంతరిక్షంలో పేలిన స్పేస్‌ఎక్స్ రాకెట్..వీడియో వైరల్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు