/rtv/media/media_files/2026/05/23/fotojet-25-2026-05-23-12-47-54.jpg)
S*X Racket Busted in Kerala
కేరళలోని కొచ్చి కేంద్రంగా సాగుతున్న ఓ భారీ అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా, సెక్స్ రాకెట్ ముఠాను అక్కడి సిటీ పోలీసులు ఛేదించారు. మోడలింగ్ రంగం ముసుగులో విదేశాల్లో గ్లామరస్ ఛాన్స్‌లు, బ్యూటీ పార్లర్లలో జాబ్స్ ఇప్పిస్తామని నమ్మించి కేరళకు చెందిన అమాయక యువతులను ఈ ముఠా నమ్మించేది. వీళ్ల మాటలు నమ్మి గల్ఫ్ దేశాలకు వెళ్లిన యువతులను అక్కడ నిర్బంధించి, బలవంతంగా వ్యభిచార నరకంలోకి నెడుతున్నారు. విదేశాలకు తీసుకెళ్లిన అనంతరం బాధితులకు ఆహారంలో మత్తుమందు ఇచ్చి, స్పృహ లేని సమయంలో వాళ్లపై లైంగిక దాడులు చేసి దృశ్యాలను రికార్డు చేసేవారు. ఆ తర్వాత పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకుని, ఆ వీడియోలను చూపించి బ్లాక్‌మెయిల్ చేస్తూ లొంగదీసుకునేవాళ్లని విచారణలో బయటపడింది.
ఈ ఇటర్నేషనల్ నెట్‌వర్క్ దారుణాల నుంచి తప్పించుకున్న ఇద్దరు బాధిత యువతులు కొచ్చి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న కొచ్చి పోలీస్ కమిషనర్, దీనిపై సమగ్ర విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని బరిలోకి దింపారు. ఈ నేపథ్యంలోనే దేశం విడిచి పారిపోయేందుకు యత్నిస్తున్న ఈ రాకెట్ ప్రధాన సూత్రధారి, స్టోయ్ సీ సింధు అనే మహిళను లుకౌట్ నోటీసుల ఆధారంగా ముంబై ఎయిర్‌పోర్టులో పోలీసులు అరెస్టు చేశారు. ఈమెతో పాటు ఈ ముఠాకు సహకరించిన మరో ముగ్గురు నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు.
Also Read: పాక్ పక్కా టెర్రరిస్ట్ కంట్రీ.. ఇదిగో ప్రూఫ్.. షాకింగ్ వీడియోలు!
అయితే ఈ అక్రమ రవాణా వెనుక పెద్ద ఎత్తున నగదు చేతులు మారాయని పోలీసుల విచారణలో తేలింది. బాధితులను పరిచయం చేసిన లోకల్ బ్రోకర్లు, ఏజెంట్లకు నిందితులు ఒక్కో అమ్మాయికి రూ.50,000 నుంచి రూ.1 లక్ష వరకు భారీగా కమీషన్లు ఇచ్చినట్లు గుర్తించారు. ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్న ఈ ముఠాలోని మరో ఇద్దరు కీలక నిందితులను పట్టుకొచ్చేందుకు పోలీసులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ గ్యాంగ్ మూలాలను పూర్తిగా బయటకు తీసేందుకు అవసరమైతే ఇంటర్‌పోల్ సాయం కూడా తీసుకోవాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
Follow Us