/rtv/media/media_files/2025/12/07/indigo-2025-12-07-19-41-09.jpg)
IndiGo processed 610 crores refunds so far, delivered 3,000 baggages
ఇండిగో సంక్షోభం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రయాణికులకు టికెట్ల ధరలు రీఫండ్(refund) చేయాలని ఇప్పటికే కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా కీలక అప్డేట్ వచ్చింది. ఇప్పటివరకు ప్రయాణికులకు రూ.610 కోట్ల మేర రీఫండ్ జరిగినట్లు పౌర విమానయాన శాఖ ప్రకటన చేసింది. అంతేకాదు దేశవ్యాప్తంగా శనివారం నాటికి ప్రయాణికులకు చెందిన 3000 లగేజీలను డెలవరీ చేసినట్లు పేర్కొంది.
Also Read: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు సర్వం సిద్దం..
IndiGo Processed 610 Crores Refunds
మరోవైపు సంక్షోభం నుంచి బయటపడేందుకు, సర్వీసుల పునరుద్ధరణ కోసం CEO, బోర్డు సభ్యులు కలిసి క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూప్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఇక విమాన సర్వీసుల పునరుద్ధణ వేగంగా జరుగుతోందని.. 1650 విమానాలు నడుపుతున్నామని ఇండిగో CEO పీటర్ ఎల్బర్స్ తెలిపారు. విమానాల సర్వీసుల ఆన్ టైన్ పర్ఫార్మెన్స్ (OTP) ఆదివారం వాటికి 75 శాతంగా ఉండే ఛాన్స్ ఉందని చెప్పారు. మొత్తం 138 విమానాశ్రయాల్లో 137 చోట్లు తమ సేవలు అందిస్తున్నామని ఇండిగో వెల్లడించింది.
Also Read: ఆ దేశంలో పురుషుల కొరత.. భర్తలను రెంట్‌కు తెచ్చుకుంటున్న మహిళలు..
Follow Us