/rtv/media/media_files/2025/03/29/rOxHfzq0XVdBFydYs8BU.jpg)
Indian Railways
భారతీయ రైల్వేలో నిత్యం కోట్లాది మంది ప్రయాణిస్తుంటారు. అందుకే దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థగా భారతీయ రైల్వే గుర్తింపు తెచ్చుకుంది. దేశ ఆర్థిక వ్యవస్థను వేగవంతం చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తోంది. దూరపు ప్రయాణాల కోసం చాలామంది రైల్వే ప్రయాణాన్నే ఎంచుకుంటారు. అయితే భారతీయ రైల్వేకు ఒకరోజు ఎంత ఆదాయం వస్తుందో అనేది చాలామందికి తెలియదు. దీనికి సంబంధించి కీలక విషయం వెలుగులోకి వచ్చింది.
Also Read: జేఈఈ మెయిన్స్ రెండో విడత పరీక్షలు వాయిదా..! కారణం ఏంటంటే?
పలు మీడియా నివేదికల ప్రకారం.. భారతీయ రైల్వేలు ప్రతిరోజూ రూ.400కోట్లు వరకు సంపాదిస్తున్నాయి. ముఖ్యంగా గూడ్స్ రైళ్లతో భారీగా ఆదాయం వస్తోంది. మొత్తంగా భారతీయ రైల్వే నెలసరి ఆదాయం రూ.12 వేల కోట్లుగా ఉంది. దేశవ్యాప్తంగా భారతీయ రైల్వే వేల సంఖ్యలో సరకు రవాణా రైళ్లను నడుపుతున్నాయి. లక్షల టన్నుల వస్తువులను ఒకచోటు నుంచి మరోచోటుకు తీసుకెళ్తున్నాయి. గూడ్స్ రైళ్లతో పాటు ప్యాసింజర్ రైళ్లు సైతం భారీగా ఆదాయాన్ని తీసుకొస్తున్నాయి. అంతేకాదు రైల్వేలు జారీ చేసే స్క్రాప్ టెండర్ల నుంచి కూడా రైల్వేలు భారీగా ఆదాయన్ని తెచ్చిపెడుతున్నాయి.
Also Read: బెట్టింగ్ వలలో చిక్కడానికి మూలం అతడే.. నటి మాధవిలత సంచలన ఆరోపణ
ఇదిలాఉండగా.. భారతీయ రైల్వేల వల్ల లక్షలాది మంది జీవనోపాధి పొందుతున్నారు. ఇందులో రైల్వే ఉద్యోగులతో సహా తయారీ రంగం, ప్లాట్‌ఫామ్‌లు, రైల్వే స్టేషన్‌లలలో వ్యాపారాలు, మరికొందరు ఆహార పదార్థాలు, ఇతర వస్తువులు విక్రయిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు.
Also Read: మెట్రో ప్రయాణీకులకు బ్యాడ్ న్యూస్ ... ఛార్జీలు పెంపు..?
Also Read: మరో మయన్మార్ కానున్న భారత్.. త్వరలో ఇండియాలో విధ్వంసం!
indian-railways | telugu-news | rtv-news | trains | national-news