/rtv/media/media_files/2026/02/15/indian-forex-reserves-2026-02-15-21-05-07.jpg)
Indian forex reserves fall by $6.7 billion after record high
భారత విదేశీ మారక నిల్వలు పడిపోయాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దీనికి సంబంధించి తాజాగా గణాంకాలు విడుదల చేసింది. ఫిబ్రవరి 6తో ముగిసిన వారానికి విదేశీ మారక నిల్వలు 6.711 బిలియన్ డాలర్లు తగ్గిపోయాయి. దీంతో ప్రస్తుతం 717.064 బిలియన్ డాలర్లు ఉన్నాయి. జనవరి 30తో ముగిసిన వారానికి నిల్వలు 723.774 బిలియన్ డాలర్లు ఉన్నాయి. కేవలం వారంలోనే 6.7 బిలియన్ డాలర్లు తగ్గిపోయాయి.
Also Read: అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై రాహుల్ గాంధీ కీలక ప్రశ్నలు
విదేశీ మారక నిల్వలు తగ్గడానికి బంగారం నిల్వల విలువ పడిపోవడమే ప్రధాన కారణమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. బంగారం నిల్వలు చూసుకుంటే 14.208 డాలర్లు తగ్గి.. ప్రస్తుతం 123.476 బిలియన్ డాలర్లకు చేరాయి. మరోవైపు అంతర్జాతీయ బంగారం ధరల్లో కూడా మార్పులు జరిగాయి. దీంతో నష్టం వాటిల్లింది.
Also Read: మార్కెట్‌లో AI వణుకు.. ఇన్వెస్టర్ల కొంపముంచిన సాఫ్ట్‌వేర్ స్టాక్స్!
ఇక ఫారెన్ కరెన్సీ అసెట్స్(FCA) 7.661 బిలియన్ డాలర్లు పెరిగింది. ప్రస్తుతం ఇవి 570.053 బిలియన్ డాలర్లకు చేరాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్, ఐఎంఎఫ్ రిజర్వ్ పొజిషన్ కూడా కొంతవరకు తగ్గిపోయాయి. మొత్తంగా చూసుకుంటే ఈ వారంలో విదేశీ మారక నిల్వలు 6.7 బిలియన్ డాలర్ల వరకు తగ్గిపోయాయి. అయినప్పటికీ వాటి నిల్వల స్థాయి ఇంకా బలంగానే ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
Follow Us