/rtv/media/media_files/2025/01/15/BkRKlRzxwL7pLbfed1y0.jpg)
robotic dogs Photograph: (robotic dogs)
మహారాష్ట్రలోని పూణెలో బుధవారం 77వ ఇండియన్ ఆర్మీ డే పరేడ్ నిర్వహించారు. అందులో రోబోటిక్స్ డాగ్స్ చేసిన మార్చ్‌పాస్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. పుణెలోని బాంబే ఇంజినీరింగ్ గ్రూప్‌కు చెందిన పరేడ్ మైదానంలో ఈ మార్చ్ ఫాస్ట్ జరిగింది. భారత సైన్యం టీమ్ రోబోటిక్స్ డాగ్స్‌ను రిమోట్‌తో ఆపరేట్ చేశారు. ఇండియన్ ఆర్మీలో సైనికుల్లా రోబోటిక్స్ డాగ్స్ కూడా మార్చ్ ఫాస్ట్ చేశాయి. రోబోల కవాత్తు క్రమశిక్షణ చూడచక్కగా ఉంది.
INDIA’S NEW ARMY RECRUITS: ROBOT WAR DOGS!👏👏👏
— Neha✨ (@NEHASINGH7861) January 15, 2025
At its 77th Army Parade, India unleashed robot war dogs that can haul up to 15 kg of supplies—no barking required!
Still need a lot to improve🙏pic.twitter.com/Tt5bAeVBEv
ఈ రోబోలను ఢిల్లీకి చెందిన ఏరోఆర్క్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తయారు చేసింది. అందువల్ల వీటికి ఆర్క్‌వీ మ్యూల్ అని పేరుపెట్టారు. ఇప్పటివరకు ఏరోఆర్క్ కంపెనీ నుంచి భారత సైన్యం దాదాపు 100 రోబోలను కొనుగోలు చేసింది. ఈ రోబోలకు పెట్టిన పేరులోని MULE అనే పదానికి మల్టీ యుటిలిటీ లెగ్డ్ ఎక్విప్‌మెంట్ మీనింగ్. ఈ రోబో డాగ్స్‌ను రిమోట్‌తో ఆపరేట్ చేయవచ్చు. ఇవి సెల్ఫ్‌గా పని చేయగలవు. పెరీమీటర్లు, సైనిక పహారా, రసాయన సంబంధిత ప్రమాదాలు, బయోలాజికల్ దాడులు, న్యూక్లియర్ పదార్థాల పేలుళ్లు సంభవించినప్పుడు ఆర్క్‌వీ మ్యూల్ రోబోలను మోహరిస్తారు. బాంబులను నిర్వీర్యం చేసేందుకు సైతం వీటిని వినియోగిస్తారు. ఆర్క్‌వీ మ్యూల్ రోబోలో ప్రధానంగా ఐదు భాగాలు ఉన్నాయి. సెకనుకు 3 మీటర్ల వేగంతో ఇవి నడవగలవు. ఈ రోబో బరువు 51 కేజీలు ఉంటుంది.
Also Read: ఫ్రెషర్లకు టీసీఎస్ బంపరాఫర్.. 40 వేల ఉద్యోగాలు!
https://x.com/TRUFAULT/status/1878141657868058997/photo/3
ఈ రోబోలోని కంప్యూట్ బాక్స్ అనే భాగం రోబోకు మెదడులా సాయం చేస్తుంది. ఈ రోబోలో ఒక బ్యాటరీ ఉంటుంది. దీన్ని ఒకసారి ఛార్జ్ చేస్తే రోబో 20 గంటలపాటు పనిచేస్తుంది. రోబో తల వెనుక భాగంలో సెన్సార్స్ ఉంటాయి. వీటి సాయంతో పరిసరాల్లో ఏమేం ఉన్నాయనేది రోబో చూస్తుంది. కాళ్ల సాయంతో రోబో నడకను సాగిస్తుంది. 12 కేజీల బరువును ఇవి మోయగలవు. ఈ రోబోలు మెట్లు ఎక్కగలవు. కొండ ప్రాంతాల్లో, బురదమయంగా ఉండే ప్రాంతాల్లో నడవగలవు. కనిష్ఠంగా మైనస్ 40 డిగ్రీల శీతల ఉష్ణోగ్రతలోనూ ఈ రోబోలు పనిచేయగలవు. గరిష్ఠంగా 55 డిగ్రీల మండుటెండల్లోనూ ఇవి యాక్టివిటీని చేయగలవు.
Also Read: జనవరి 16న ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌కు అంతరాయం.. !