/rtv/media/media_files/2025/02/20/IhKRJXxmhn9W5OPv9Uas.jpg)
India sees over 30 Percent decline in suicide death rates from 1990 to 2021
Suicide Rate In India: భారత్‌లో మరణాలు రేటు 30 శాతానికి తగ్గినట్లు ది లాన్సెట్ పబ్లిక్ హెల్త్(The Lancet Public Health) అధ్యయనం తెలిపింది. దేశంలో ఆత్మహత్య మరణాల రేటు 1990లో లక్ష జనాభాకు 18.9 శాతంగా ఉండేదని చెప్పింది. 2019లో లక్ష జనాభాకు 13.1 శాతానికి పడిపోయినట్లు తెలిపింది. అలాగే 2021లో లక్ష జనాభాకు 13 శాతానికి పడిపోయినట్లు వెల్లడించింది. 1990 నుంచి 2021 వరకు మొత్తంగా భారత్‌లో ఆత్మహత్యల మరణాల రేటు 31.5 శాతం తగ్గినట్లు స్పష్టం చేసింది.
ఇక వివరాల్లోకి వెళ్తే..
లాన్సెట్ అధ్యయనం ప్రకారం ఆత్మహత్యల మరణాల రేటు తగ్గడం మగవారి కంటే ఆడవారిలో ఎక్కువగా ఉంది. 1990లో స్త్రీలలో సూసైట్ రేటు లక్ష జనాభాకు 16.8 శాతంగా ఉంది. 2021లో అది 10.3 శాతానికికి తగ్గింది. పురుషుల ఆత్మహత్యల రేటు 1990లో లక్ష జనాభాకు 20.9 శాతంగా ఉండగా.. 2021కి 15.7 శాతానికి పడిపోయింది. అయితే 2020లో చూసుకుంటే భారత్‌లో అత్యధిక సూసైడ్ మరణాల రేటు విద్యావంతులైన మహిళల్లోనే కనిపించినట్లు ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ (IHME) పరిశోధకులు తెలిపారు. కుటుంబ సమస్యలే ఇందుకు కారణమని పేర్కొన్నారు.
Also Read: కుంభమేళాలో జాగ్రత్త.. మల కోలిఫాం బ్యాక్టీరియా ఎంత డేంజరస్ అంటే..!
మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ప్రతీ సంవత్సరం దాదాపు 7,40,000 ఆత్మహత్యలు జరుగుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే సగటున ప్రతీ 43 సెకండ్లకు ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. గత మూడు దశాబ్దాల్లో వయస్సు-ప్రామాణిక మరణాల రేటు దాదాపు 40 శాతం తగ్గిపోయింది. లక్ష జనాభాకు 15 మరణాల నుంచి లక్ష జనాభాకు 9 మరణాలకు పడిపోయింది. ఆడవారి మరణాల రేటు 50 శాతం తగ్గిపోగా.. పురుషుల్లో 34 శాతమే తగ్గింది. దీంతో ఆత్మహత్యల మరణాల రేటులో మగవారిలో లక్ష జనాభాకు 12.8 శాతం ఉండగా.. స్త్రీలలో లక్ష జనాభాకు 5.4 శాతంగా ఉన్నట్లు లాన్సెట్ తెలిపింది.
Also Read: బీజేపీ పెద్ద స్కెచ్.. ఏపీలో రఘురామ.. ఢిల్లీలో విజేందర్ గుప్తా!
Also Read: ఇంత పిరికోడివి ఏంట్రా.. ప్రేమ, పెళ్లన్నాడు.. నుదుటిపై బొట్టు పెట్టి పారిపోయాడు!