/rtv/media/media_files/2026/02/18/india-pushes-france-for-maximum-local-content-in-new-rafale-fighter-jets-2026-02-18-14-20-03.jpg)
India pushes France for maximum local content in new Rafale fighter jets
ఫ్రాన్స్(france) అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్లో భారత్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్ర రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. హామర్ క్షిపణులను సంయుక్తంగా కలిసి అభివృద్ధి చేసుకునేందుకు ఫ్రాన్స్‌తో ఒప్పందం కుదుర్చుకోనుంది. హామర్ క్షిపణులను ప్రస్తుతం రాఫేల్ ఫైటర్ జెట్లలో వినియోగిస్తారు. ఇప్పటివరకు వీటిని మనం ఫ్రాన్స్ నుంచే దిగుమతి చేసుకున్నాం. ఈ కొత్త ఒప్పందం ద్వారా ఇవి భారత్‌లో కూడా తయారుకానున్నాయి.
Also Read: కంపెనీ అంటే ఇదిరా మావా.. ఉద్యోగులకు రూ.20 కోట్ల ఖరీదైన కార్లు
హామర్ క్షిపణి అంటే ?
హామర్ అంటే Highly Agile Modular Munition Extended Range. ఇది ఒక గాలి నుండి భూమికి ప్రయోగించే మధ్య శ్రేణి క్షిపణిగా పిలుస్తారు. పర్వతాలను ముక్కలు చేయగల, బంకర్లు నాశనం చేయగల సామర్థ్యం ఈ హామర్ క్షిపణుకు ఉంది. 60 నుంచి 70 కిలోమీటర్ల దూరం వరకు శత్రు లక్ష్యాలను ధ్వంసం చేయగలదు. GPS, ఇన్ఫ్రారెడ్, లేజర్ గైడెన్స్ ద్వారా అత్యంత ఖచ్చితత్వంతో ఇది పనిచేస్తుంది. తక్కువ ఎత్తులో విమానం ప్రయాణిస్తున్న సమయంలో కూడా ఈ క్షిపణులను ప్రయోగించవచ్చు. రాత్రి,పగలు, పొగమంచు వర్షం అనే తేడా లేకుండా అన్ని వాతావరణ పరిస్థితుల్లో ఇది పనిచేస్తుంది .
ఈ ఒప్పందం ప్రకారం ఫ్రాన్స్‌కు చెందిన సఫ్రాన్, భారత్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) సంయుక్తంగా ఈ హామర్ క్షిపణులను అభివృద్ధి చేయనున్నాయి. మరోవైపు స్వదేశీ తేజస్ (LCA Tejas) యుద్ధ విమానాలకు కూడా ఈ క్షిపణులను అమర్చాలని భారత రక్షణ శాఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందం వల్ల భవిష్యత్తులో శత్రు దేశాల నుంచి ముఖ్యంగా పాక్, చైనాల నుంచి ఏదైన ముప్పు ఎదురైతే భారత్ ఆ దేశాలకు చుక్కలు చూపిస్తుందని పలువురు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు మోగనున్న నగారా.. షెడ్యూల్ ఎప్పుడంటే?
మరోవైఫు రఫేల్ ఫైటర్ జెట్‌లో 50 శాతం దేశీయ తయారీ పరికరాలు ఉండేలా చూడాలని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫ్రాన్స్‌ను కోరారు. బెంగళూరులో జరిగిన రక్షణ మంత్రుల స్థాయి వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు. అయితే రూ.3.25 లక్షల కోట్ల అంచనాతో 114 రఫేల్ యుద్ధవిమానాలను సరఫరా చేసేందుకు ఫ్రాన్స్‌తో ఒప్పందం కుదిరే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
Follow Us