/rtv/media/media_files/2025/03/29/ZNhZT4ceQiEwpoxyRF0f.jpg)
earthquakes Photograph: (earthquakes)
భారత్‌కు భారీ ముప్పు పొంచి ఉందా.. ఓ పెద్ద భూకంపానికి ఇండియా బలైపోతుందా? అనే ప్రశ్నలు చాలామంది మదిలో మెదులుతున్నాయి. ఈ సందేహాలు ఇప్పుడే ఎందుకు వస్తున్నాయంటే దానికి సమాధానం లేకపోలేదు. 2025 మూడు నెలల్లోనే ఇండియాలో పదుల సంఖ్యలో భూకంపాలు సంభవించాయి. ఢిల్లీ, జమ్మూ కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయా, అస్సాం ప్రాంతాల్లో అనేకసార్లు భూమి కంపించింది. అసలు ఈ వరుస భూకంపాలకు కారణాలు తెలియాలన్నా.. ఇండియా డేంజర్ జోన్‌లో ఉందా అని తెలియాలన్నా ప్లేట్ టెక్టోనిక్స్, కాంటినెంటల్ థియరీ గురించి తెలుసుకోవాలి. అసలు ఈ ఎర్త్‌కేక్స్ సీక్రెట్ ఏంటో చూద్దాం.
ఈ భూమండలం అంతా ఓ చిక్కన ద్రవరూపంపై తేలి ఆడుతుంది. భూమి పలకలుగా విడిపోయి ఉంది. ఈ పలకలు నిరంతరం కదులుతూ ఉంటాయి. ఆ కదలికల వల్ల ఏర్పడిన గ్యాంప్‌లను ఫిల్ చేయడానికి అప్పుడప్పుడు భూమి కుదుపులకు గురవుతుంది. ఈ కుదుపులే మనం మాట్లాడుకునే భూకంపాలు. జర్మన్ వాతావరణ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ వెజెనర్ 1950లో భూమి నిర్మాణం గురించి ఓ సిద్ధాంతాన్ని వివరించాడు. అదే ఖండచల సిద్ధాంతం. ప్రపంచ ఖండాలు కింద ఉన్న భూ పలకలు (ప్లేట్స్) కదులుతూ ఉంటాయని ఆల్ఫ్రెడ్ వెజెనర్ వివరించాడు. ఈ కలదక చాలా నెమ్మదిగా జరుగుతుంది.
Many buildings were reportedly destroyed in the 7.7 magnitude earthquake in Myanmar.
— Sumit (@SumitHansd) March 28, 2025
Video showing people being rescued from the rubles of the collapsed buildings.
Pray for Myanmar 🇲🇲 🙏🏻#Myanmar #earthquake #แผ่นดินไหว pic.twitter.com/7yPoGXMBvK
వందల ఏళ్లకు ఒక సెంటీమీటర్, మిల్లీ మీటర్ దూరం కదులుతుంటాయి. ఆ థియరీ ప్రకారం భారత్ రెండు పలకల మధ్య ఉంది. యురేషియా పలక అంచున ఉంది. ఈ ప్లేట్ చివర్లో హిమాలయ పర్వత శ్రేణి ఉంది. దాని కింద ద్వీపకల్ప పీఠభూమి మరో పలక మీద ఉంది. ఈ రెండు పలకలు ఢీకొట్టి ఒకదాని కిందకి మరోకటి ముడుచుకుపోవడం వల్ల ముడతపర్వతాలైన హిమలయాలు ఏర్పడ్డాయి. ద్వీపకల్ప పీఠభూమి క్రమంగా యురేషియా పలకను ఉత్తరం వైపుకు నెట్టుతూ ఉంటుంది. ఈ యురేషియా పలకల అంచులకే చైనా, పాకిస్థాన్, అఫ్గనిస్థాన్, మయన్మార్, బంగ్లాదేశ్, థాయ్‌లాండ్, లావోస్ దేశాలు ఉంటాయి. యురేషియా పలక మరో పలకతో ఢీకొన్నప్పుడు ఏర్పడిన గ్యాంప్‌లు ఈ దేశాల కింద ఉంటాయి. దీంతో తరుచుగా ఈ ప్రాంతాల్లోనే భూకంపాలు వస్తుంటాయి.
Also read: Mallareddy: ఆ హీరోయిన్ కసికసిగా ఉంది.. మల్లారెడ్డి షాకింగ్ కామెంట్స్.. వీడియో వైరల్!
టెక్టోనిక్స్ వల్ల ప్లేట్ల అంచులు ఒకదానికొకటి ఢీకొన్నప్పుడు ఒత్తిడి పెరుగుతుంది. అది చాలా ఎత్తుకు పెరిగినప్పుడు, ప్లేట్లు అకస్మాత్తుగా విడిపోతాయి, దీనివల్ల భూకంపం రూపంలో భూమి ఉపరితలంపై ఒత్తిడి తరంగాలు వ్యాపిస్తాయి. సముద్రంలో భూకంపాలు సంభవించినప్పుడు సునామీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల భారీ అలలు అధిక వేగంతో వ్యాపిస్తాయి. అవి భూమిని తాకినప్పుడు వినాశకరమైన వరదలకు కారణమవుతాయి.
ఎక్కువ తీవ్రతతో భూకంపాలు సంభవించగానే మరో భూకంపం అదే ప్రాంతంలో వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకా కొన్నిసార్లు చిన్న భూకంప వచ్చి, తర్వాతనే భారీ భూకంపం సంభవించే అవకాశం కూడా ఉంటుందట. రిక్టర్ స్కేల్‌పై 8 కంటే ఎక్కవ నమోదైయే ఎర్త్‌కేక్స్ వినాశనాన్ని సృష్టిస్తాయి. అయితే రిక్టర్ స్కేల్ పై 8 లేదా అంతకంటే ఎక్కువ స్థాయిలో భూమి కంపించినప్పుడు రీడింగ్ చూపించదని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో భారత్‌లో 5, 6 పాయింట్లలో భూకంపాలు సంభవించాయి. దీంతో త్వరతో ఇండియాలో భారీ భూకంపం సంభవిస్తుందా అని శాస్తవేత్తలు అంచనాలు వేస్తున్నారు. గత రెండుమూడు నెలల నుంచి సంభవించిన ప్రకంపన వల్ల భూమి లోపల ఏర్పడిన పగుళ్లు సర్థమనగడానికి మరో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉంది.