జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జరగనున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడికి వచ్చే భక్తులు ఆ ప్రాంత వాతావరణం గురించి తెలుసుకునేందుకు వాతావరణ శాఖ వెబ్‌సైట్‌లో స్పెషల్ పేజీని రూపొందించామని ఐఎండీ డైరెక్టర్ మనీశ్ రణాల్కర్ వెల్లడించారు. ఈ వెబ్‌సైట్ నుంచి ప్రతీ 15 నిమిషాలకొకసారి అక్కడి వాతావరణంలో మార్పుల గురించి తెలుసుకోవచ్చని చెప్పారు. అలాగే రోజుకు రెండుసార్లు వాతావరణ సూచనలు అందులో పొందుపరుస్తామని చెప్పారు. అంతేకాదు కుంభమేళా నిర్వహించే ప్రాంతాన్ని తాత్కాలిక జిల్లాగా ప్రకటించామని తెలిపారు. Also Read: అభ్యర్థులకు అలెర్ట్.. CUET PG రిజిస్ట్రేషన్ స్టార్ట్.. ఇలా అప్లై చేసుకోండి! కుంభమేళా ఉత్సవానికి ప్రపంచవ్యా్ప్తంగా దాదాపు 40 కోట్ల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసున్నారు. మరోవైపు ఉత్తర భారత్‌లోని పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణగా పడిపోయాయి. ప్రస్తుతం దట్టంగా మంచు కురుస్తోంది. కుంభమేళా జరగనున్న యూపీలో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఇందుకోసం భక్తులను అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు నిమగ్నమయ్యారు. Also Read: వణుకుతున్న ఉత్తరాది..విమానాలు, రైల్వే సర్వీసుల పై ఎఫెక్ట్! మరోవైపు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా కుంభామేళా కోసం పెద్దఎత్తున భద్రతా ఏర్పాట్లు చేస్తోంది.ఈ ఉత్సవంలో పాల్గొనేవారి సంఖ్యను ఎప్పటికప్పుడు లెక్కపెట్టడంతో పాటు వాళ్లకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. ఇందుకోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగించనన్నామని చెప్పారు. భక్తులకు తాత్కాలిక వసతి కల్పించడం కోసం 1.6 లక్షల టెంట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే 1.5 మరుగుదోడ్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. భారీ భద్రత కోసం ఇప్పటికే పారామిలటరీ బలగాలతో సహా 50 వేల మంది సిబ్బంది ఆ ప్రాంతంలో మోహరించినట్లు పేర్కొన్నారు. Also Read: ఉచిత బస్ ఎఫెక్ట్..అక్కడ 15 శాతం పెరిగిన ఛార్జీలు..మరి మన సంగతేంటో!