/rtv/media/media_files/2026/02/27/aravind-2026-02-27-18-04-50.jpg)
ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్(aravind-kejriwal) సంచలన ప్రకటన చేశారు. మోదీ(narendra-modi) నిజంగా నిజాయితీ పరుడే అయితే ఢిల్లీలో మళ్లీ ఎలక్షన్ పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మోడీని సవాలు చేశారు. మళ్లీ ఎన్నికలు పెడితే అందులో బీజేపీ10 స్థానాలకు పైగా గెలిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటానని అన్నారు. ఈ రోజు కోర్టు చారిత్రక తీర్పు ఇచ్చిందన్నారు. తమపై ప్రధాని మోదీ, అమిత్‌షా కుట్ర చేశారని కేజ్రీవాల్ ఆరోపించారు. తమకు మద్దతుగా నిలిచిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపారాయన.
#WATCH | Delhi | AAP national convener Arvind Kejriwal says," I challenge Modi ji to hold elections in Delhi again. I can say with confidence that if they get more than 10 seats, I will leave politics." pic.twitter.com/p4JeQtmSaw
— ANI (@ANI) February 27, 2026
Also Read : స్కూల్ పిల్లలకు ఇస్రో బంపరాఫర్.. గోల్డెన్ ఛాన్స్ అస్సలు మిస్ అవ్వొద్దు!
నిజాయితీ, గౌరవం తప్ప
ఇక "ఢిల్లీలో మమ్మల్ని ఓడించలేమని మోదీ, షా భావించారు. ఢిల్లీ ప్రజలు మా పని పట్ల సంతోషంగా ఉన్నారని వారికి తెలుసు. కాబట్టి వారు మాపై ఒక కుట్ర పన్నారు. కేజ్రీవాల్ నిజాయితీపరుడని ప్రజలకు తెలుసు, కాబట్టి వారు నా నిజాయితీపై దాడి చేశారు. అందుకే నాపై మద్యం కుంభకోణం(delhi-liquor-case), రూ. 100 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. నేను నా జీవితంలో నిజాయితీ, గౌరవం తప్ప మరేమీ సంపాదించలేదు. నేను ఒక్క అక్రమ పైసా కూడా సంపాదించలేదు. వారు దానిని నాశనం చేయాలనుకున్నారు. అందుకే ఈ కుట్ర పన్నారు " అని కేజ్రీవాల్ అన్నారు.
ఈడీ, సీబీఐలను ఆయుధాలుగా ఉపయోగించుకున్నారని, తమ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని అంతం చేయడానికి కుట్ర పన్నినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. మోడీ,అమిత్ షా చేసిన ఈ కుట్రకు నిజమైన మూల్యం ఢిల్లీలోని మూడు కోట్ల మంది ప్రజలు భరిస్తున్నారని అన్నారు. దానికి ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు.
Also Read : కోల్‌కతాలో భూకంపం.. పరుగులు తీసిన జనం... వీడియోలు వైరల్!
Follow Us