IIT Baba: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న కుంభమేళా ఫేమ్ ఐఐటీ బాబా.. లవ్‌స్టోరీ ఇదే

కుంభమేళాలో ఐఐటీ బాబాగా పాపులర్ అయిన అభయ్ సింగ్, తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కర్ణాటకలోని మంగళూరుకు చెందిన బీటెక్ విద్యార్థిని ప్రతీకను ఆయన పెళ్లి చేసుకున్నారు.

New Update
IITian Baba Ties the Knot with Mangaluru BTech Student Prathika

IITian Baba Ties the Knot with Mangaluru BTech Student Prathika

కుంభమేళాలో ఐఐటీ బాబాగా పాపులర్ అయిన అభయ్ సింగ్ కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కర్ణాటకలోని మంగళూరుకు చెందిన ప్రతీక అనే బీటెక్ విద్యార్థిని ఆయన రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. సాధారణంగా ఐఐటీ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో చదివిన విద్యార్థులు కార్పొరేట్ రంగంలో స్థిరపడుతుంటారు. కానీ ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్న అభయ్ సింగ్ మాత్రం ఐఐటీ బాబాగా కుంభమేళా సమయంలో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. 

Also Read: వందేభారత్‌లో మరోసారి పురుగుల ఆహారం.. ఫుడ్‌ కంపెనీకి రూ.10 లక్షల ఫైన్

లవ్‌స్టోరీ ఎక్కడ మొదలైంది ?

వీరిద్దరి ప్రేమకథ కోయంబత్తూరులోని ఈశా ఫౌండేషన్‌కు చెందిన సద్గురు ఆదియోగి ఆశ్రమంలో ప్రారంభమైంది. సిద్ధార్థ్ సింగ్ ఐఐటీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, ఆధ్యాత్మికం వైపు వెళ్లారు. ఇదే సమయంలో మంగళూరుకు చెందిన ప్రతీక కూడా బీటెక్ చదువుతూ ఆధ్యాత్మికతపై ఆసక్తితో ఆదియోగి ఆశ్రమానికి వచ్చారు. అక్కడ ఏర్పడ్డ వీళ్లిద్దరి పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరి ఆలోచనలు, జీవితం పట్ల వారికున్న దృక్పథం ఒకేలా ఉండటంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.వీళ్ల ప్రేమకు పెద్దలు కూడా ఒప్పుకున్నారు. దీంతో మహాశివరాత్రి రోజున హిమాచల్‌ప్రదేశ్‌లో వీళ్లు రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. 

ఆధ్యాత్మిక బాటలోనే ప్రయాణం

సాధారణంగా ఐఐటీ విద్యార్థులు పెళ్లి తర్వాత కార్పొరేట్ ఉద్యోగాలు చేస్తుంటారు. కానీ ఈ జంట మాత్రం భిన్నమైన మార్గాన్ని ఎంచుకుంది. తమ బంధాన్ని కేవలం వ్యక్తిగత అవసరాల కోసమే కాక.. సనాతన ధర్మం కోసం పనిచేయాలనే నిర్ణయించుకున్నారు. సిద్ధార్థ్ సింగ్ కుంభమేళాలో ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. ఆయనకు తోడుగా ప్రతీక కూడా తన కెరీర్‌ను పక్కన పెట్టి ఆయన మార్గంలోనే నడవాలని నిశ్చయించుకున్నారు. అంతేకాదు భవిష్యత్తులో 'సనాతన్ యూనివర్సిటీ' అనే విద్యాసంస్థను స్థాపించడం తమ లక్ష్యమని ఈ దంపుతులు వెల్లడించారు. భారతీయ ప్రాచీన విజ్ఞానాన్ని, ఆధునిక సైన్స్‌తో జోడించి విద్యార్థులకు అందిస్తామని తెలిపారు.

Also Read: బిర్యానీ లవర్స్‌కు షాకింగ్ న్యూస్.. లక్కీ హోటల్‌లో కుళ్లిన బిర్యానీ..

ఇదిలాఉండగా ఇటీవల కుంభమేళలో ఫేమస్ అయిన మోనాలిసా కూడా ఇటీవల మతాంతర పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పడు తాజాగా ఐఐటీ బాబా కూడా పెళ్లి చేసుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చదువుకున్న యువత ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపిస్తూ.. కొత్త మార్పులకు శ్రీకారం చుడుతుండటంపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ఐఐటీలో చదువుకొని బాబాగా మారడం విశేషమని మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు