/rtv/media/media_files/2025/03/16/4s1cEDkU9VmFEgOMlsf4.jpg)
PM Modi Podcost
లెక్స్ ఫ్రిడ్ మన్ తో ప్రధాని మోదీ చేసిన పాడ్ కాస్ట్ ఈరోజే రిలీజ్ అయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది సంచలనం సృష్టిస్తోంది. ఈ పాడ్ కాస్ట్ లో ప్రధాని మాట్లాడిన మాటలు, చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఆయన పొరుగు దేశాలు అయిన చైనా, పాకిస్తాన్ ల గురించి మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌తో శాంతి కోసం ప్రయత్నాలు చేసినప్పుడల్లా శతృత్వం, నమ్మక ద్రోహమే ఎదురయ్యాయని ప్రధాని మోదీ అన్నారు. ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకోవడం ఇస్లామాబాద్ నాయకత్వంపైనే ఆధారపడి ఉంటుందని చెప్పారు.
తాను చాలాసార్లు పాకిస్తాన్ తో స్నేహబంధం పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేశానని...కానీ అటువైపు నుంచి మాత్రం ఎటువంటి స్పందనా రాలేదని...పైగా మోసమే ఎదురైందని ప్రధాని మోదీ అన్నారు. 2014లో తాను మొట్టమొదట ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను ఆహ్వానించానని..కానీ రాలేదని చెప్పారు. ఇప్పటికీ తాను స్నేహం కోసం ప్రయత్నం చేస్తున్నానని...నిర్ణయం మాత్రం వారి చేతుల్లోనే ఉందని మోదీ చెప్పారు. శాంతి మార్గానని ఎంచుకుంటారని ఆశిస్తున్నానని తెలిపారు. ఇరుదేశాల ప్రజలూ ఎంతో కాలంగా శాంతి కోసం ఎదురు చూస్తున్నారు. గొడవలు, యుద్ధాలతో అందరూ అలిసిపోయారు. ఉగ్రవాద దాడుల్లో ఎంతో మంది అమాయకులు, చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో జీవితాలు నాశనమయ్యాయని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు.
చైనాతో పోటీయే ఉంటుంది..
చైనాతో మాత్రం ఎప్పటికీ తమ దేశానికి పోటీయే ఉంటుందని చెప్పారు ప్రధాని మోదీ. కానీ ఇరు దేశాలు ఆరోగ్యకరమైన పోటీతత్వంతోనే ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నానని అన్నారు. తాను ఎప్పుడూ విభేదాలు రాకుండా చూడాలనే అనుకుంటానని...చర్చలకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. పోటీ తత్వం ఉండాలి కానీ...అది ఘర్షణలకు దారి తీయకూడదని మోదీ అన్నారు. ప్రపంచ శ్రేయస్సు కోసం ఇరు దేశాల సహకారం ఎంతో అవసరమని ప్రధాని మోదీ అన్నారు.
Also Read: గ్రూప్ 1 ఫలితాలపై అనుమానాలు.. ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు
Also Read: బోట్‌వాలాకు IT షాక్.. రూ.30 సరే ఇప్పుడు రూ.12.8 కోట్ల ట్యాక్స్ కట్టేదెలా..?