/rtv/media/media_files/2026/04/23/tamilnadu-and-west-bengal-elections-2026-04-23-18-42-42.jpg)
Tamilnadu, West Bengal Elections
తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో గురువారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదయ్యింది. సాయంత్రం 5 గంటల సమయానికి తమిళనాడులో 82.4 శాతం, పశ్చిమ బెంగాల్‌లో 90 శాతం పోలింగ్ నమోదైంది. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు భారీగా తరలివచ్చారు. అయితే ముర్షిదాబాద్‌లో TMC, AJUP కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు రాళ్లు, ఇటుకలు, కర్రలతో దాడులు చేసుకున్నారు. దక్షిణ దినాజ్‌పూర్ జిల్లాలో ఓ బీజేపీ అభ్యర్థిపై దాడులు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.
Also Read: అంబులెన్స్‌లో రొమాన్స్.. ఓయో రూమ్‌లా వాడేసుకున్న యువతీ యువకులు..
తమిళనాడులో 234 నియోజకవర్గాలకు ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. ఇక్కడ అధికార డీఎంకే, AIDMK కూటమి మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇక పశ్చిమ బెంగాల్‌లో చూసుకుంటే టీఎంసీ, బీజేపీ మధ్య పోటీ ఉంది. నామినేషన్ల సమయలో లక్షలాది మంది ఓటర్లను తొలగించడంపై సీఎం మమతా బెనర్జీ.. ఎన్నికల కమిషన్, కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
Also Read: అయిదు రాష్ట్రాల్లో గెలుపు వారిదే.. సంచలన ప్రీ పోల్ సర్వే నివేదికలు
Follow Us