/rtv/media/media_files/2025/02/09/ilXu588GOjOrKF6yjLrX.jpg)
Jharkhand CM Hemant Soren, AAP Chief Kejriwal
జైలుకెళ్ళొచ్చిన నేతల మీద సింపతీ ఉంటుంది. వాళ్ళు అధికారం పోగొట్టుకున్నా మళ్ళీ దాన్ని సంపాదించుకుంటారు. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, జగన్ ,జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అందరూ ఇలాంటి వారే. కానీ జైలుకెళ్ళొచ్చిన ఆప్ అధినేత కేజ్రీవాల్ మాత్రం జీరోగా మిగిలిపోయారు. ఆప్ పార్టీ పుట్టడానికి, ఢిల్లీలో ఆ పార్టీ పదేళ్లు అధికారం చెలాయించడానికి ముఖ్య కరణం అయిన కేజ్రీవాల్ ఎందుకింతలా చతికిలపడిపోయారు. ఎమ్మెల్యేగా కూడా గెలవలేక పోవడానికి కారణాలేంటి?
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్..
పైన చెప్పిన వారందరిలో దాదాపుగా అందరూ ప్రతిపక్షంలో ఉండగా అరెస్ట్ అయి జైలుకెళ్ళారు. వచ్చాక ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రులు అయ్యారు. అయితే జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ మాత్రం ఇందుకు అతీతం. ఆయన పదవిలో ఉండగానే అవినీతి ఆరోపణలతో జైలుకు వెళ్ళారు. తిరిగి వచ్చిన వెంటనే మళ్ళీ అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు.మనీ లాండరింగ్ కేసులో 2024 జనవరి 31న అరెస్టయ్యారు. దీనికి ముందే హేమంత్ తన పదవికి రాజీనామా చేయగా.. చంపై సోరెన్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. సుమారు 6 నెలల తర్వాత.. 2024 జూన్ 28న బెయిల్ మీద బయటకొచ్చిన హేమంత్ సోరెన్ తిరిగి సీఎం అయ్యారు. తరువాత జరిిన ఎన్నికల్లో కూడా మరోసారి గెలిచారు హేమంత్ సోరెన్.
కానీ కేజ్రీవాల్ విషయంలో మాత్రం ఇలా జరగలేదు. దానికి కారణాలు విశ్లేషించుకుంటే...జార్ఖండ్ లో హేమంత్ సోరెన్ ఒంటరిగా బరిలోకి దిగలేదు. కాంగ్రెస్, ఆర్జేడీ, మహాఘట్ బంధన్ గా పోటీ చేశారు. జార్ఖండ్ అసెంబ్లీలో 81 సీట్లు ఉండగా.. మహాఘట్ బంధన్‌కు 56 సీట్లు వచ్చాయి. అందులో హేమంత్ సోరెన్ సొంత పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా 34 సీట్లు గెలుపొందింది. దాంతో అధికారం ఆటోమేటిక్ గా ముక్తిమోర్చా అధినేత హేమంత్ సోరెన్కు వచ్చేసింది. దాంతో పాటూగా జార్ఖండ్ లో ఎక్కువగా ఉన్న ఆదీవాసీలకు హేమంత్ అండా నిలిచారు. సంక్షేమ పథకాలతో మహిళా ఓటర్లు సైతం హేమంత్ సోరెన్‌కు మద్దతు పలికారు. బీజేపీ ప్రచారాన్ని ఆ పార్టీకే వ్యతిరేకమయ్యేలా తిప్పికొట్టడంలో హేమంత్ సక్సెస్ అయ్యారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమవలల విషయంలో జార్ఖండ్ ప్రజలు హేమంత్ తో ఏకీభవించారు. ఇలా అన్ని అంశాలు కలిసి రావడంతో హేమంత్ సోరెన్ కు గెలుపు నల్లేరు మీద నడకలా అయిపోయింది.
ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్..
ఢిల్లీ ఎన్నికల ముందే కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయ్యారు. ఈయనతో పాటూ మాజీ డిప్యూటీ సీఎం మీశ్ సిసోడియా కూడా జైలుకెళ్ళారు. అయితే హేమంత్ సోరెన్ జైలకు వెళ్ళగానే తన దవికి రాజీనామా చేారు. కానీ కేజ్రీవాల్ అలా కాకుండా అక్కడ నుంచే పరిపాలన కొనసాగించారు. జైలు నుంచి బయటకొచ్చాక మాత్రం ఆయన సీఎం పదవికి రాజీనామా చేసి ఆతిశీకి ఆ బాధ్యతలు అప్పగించారు.
ఇక ఎన్నికల విషయానికి వస్తే...జార్ఖండ్ లో అందరూ గ్రామీణ ఓటర్లు. వాళ్ళను నమ్మించడం చాలా సులువు. కానీ ఢిల్లీలో అందరూ చదువుకున్న ఓటర్లే ఎక్కువ. ఇక్కడ మధ్య తరగతి ఉద్యోగుల ఓట్లే ఎన్నికల్లో ప్రభావం చూపిస్తాయి. అలాంటి చోట సీఎం స్థాయి వ్యక్తి జైలుకు వెళ్ళాడంటే...ఎవరూ సానుభూతి చూపించరు. దాని వెనుక ఉన్న లెక్కలు ఆరా తీస్తారు. అంతే కాకుండా సంక్షేమ పథకాలు, ఉచితాల విషయంలో చూపిన శ్రద్ధను ఆప్ సర్కారు అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన విషయంలో చూపెట్టలేకపోయింది. దీంతో ఢిల్లీలో పొల్యూషన్ పెద్ద సమస్యగా మారింది. ట్రాఫిక్ చిక్కులు, తాగునీటి కష్టాలు కూడా పెరిగాయి. ఇవన్నీ ఢిల్లీ ప్రజలను ఆప్‌కు దూరం చేశాయి.
ఇదంతా ఒక ఎత్తు అయితే మితిమీరిన ఆత్మ విశ్వాసం ఆప్ ను బాగా దెబ్బ తీసింది. ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఆ పార్టీ ఎవరితోనూ పొత్తులు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీకి దిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ తో కలిసి వెళ్ళకపోవడం బాగా దెబ్బ తీసింది. మజర్ సీట్లలో కాంగ్రెస్ ఓట్లు చీలి..ఆప్ ఓటమికి కారణమయ్యింది. అదే కాంగ్రెస్ తో వెళ్ళి ఉంటే కనీసం హంగ్ అయినా వచ్చేది. మరోవైపు ఈసారి ఎలాగైనా గెలవాలనే కసితో ఉన్న బీజేపీ సామ దాన బేధ దండోపాయాలను ప్రయోగించింది. బడ్జెట్ నుంచి అన్ని రకాలుగా ఢిల్లీ ప్రజలను ఆకట్టుకునేలా చేసుకుంది. పైగా జార్ఖండ్ లో హేమంత్ సోరెన్ ఐదేళ్ళే పరిపాలించారు. ఇది ఆయనకు రెండో టర్మ్. కానీ ఢిల్లీలో కేజ్రీవాల్ పదేళ్ళు సీఎంగా ఉన్నారు. దీంతో అక్కడి ప్రజలు ఇక చాల్లే అని కూడా అనుకున్నారు.
Also Read: Delhi Elections: కాంగ్రెస్ వల్లనే ఆప్ ఓడిపోయింది..నిజమని నిరూపిస్తున్న లెక్కలు..