Rains: మండుతున్న ఎండల్లో వాతావరణశాఖ చల్లటి వార్త.. 3 రోజులపాటు వానలే..వానలు!

ప్రస్తుతం మండిపోతున్న ఎండల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఒక చల్లటి వార్త చెప్పంది. రానున్న 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని శుభవార్త చెప్పింది. పలు ప్రాంతాల్లో బారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

New Update
Rains

ఈసారి ఎండలు ఫిబ్రవరి నెల నుంచే మండిపోతున్నాయి. ప్రతి ఏటా మార్చిలో ప్రారంభం అయ్యే ఎండలు ఈసారి ఫిబ్రవరిలోనే మొదలయ్యాయి. దీంతో మార్చి నెల వచ్చేసరికే సూరీడు మండుతున్నాడు. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే హడలిపోతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో ఏ స్థాయిలో ఎండలు ఉంటాయోనన్న భయం నెలకొంది. అయితే ప్రస్తుతం భానుడి ప్రతాపం నుంచి కాస్తా ఉపశమనం లభించనుంది. రానున్న 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది.

Also Read: Niharika Konidela: నిన్ను అత్యంత ప్రేమిస్తున్నాను.. నిహారిక ఎమోష‌న‌ల్ పోస్ట్ ఎవ‌రి గురించో తెలుసా!

రాబోయే 3 రోజుల పాటు పుదుచ్చేరి, తమిళనాడు, కారైకల్‌లో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం ఉంటుందని వెల్లడించింది. దీంతో ఆ ప్రాంతాల్లో భారీ ఎండలు, ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్నవారికి కొంత ఊరట కలగనుంది. మార్చి 10, 11, 12వ తేదీల్లో ఈ మూడు ప్రాంతాల్లో వర్షాలు, ఉరుములు, మెరుపులు ఉంటాయని తమిళనాడులోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. మార్చి 10వ తేదీన తమిళనాడు తీరప్రాంతంలోని కొన్ని ప్రదేశాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

Also Read: Horoscope Today: నేడు ఈ రాశివారికి అసలు బాలేదు..కాస్త జాగ్రత్తగా ఉండండి!

ఇక మార్చి 11వ తేదీన తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌లోని చాలా ప్రాంతాల్లో వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. మరోవైపు.. మార్చి 12వ తేదీ నాటికి దక్షిణ తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌లో కొన్ని చోట్ల వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

మార్చి 11వ తేదీన తెల్లవారుజామున దక్షిణ తమిళనాడులో.. ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ ఎక్స్ వేదికగా తెలిపింది. వర్ష ప్రభావిత జిల్లాల్లో కన్యాకుమారి, తిరునల్వేలి, తెన్‌కాసి, తూత్తుకుడి, విరుదునగర్, రామనాథపురం ఉన్నాయని వెల్లడించింది. ఇదిలా ఉంటే ఈరోజు నుంచి  12, 13వ తేదీల్లో కేరళ, మహే, కోస్తా, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణశాఖ పేర్కొంది.

Also Read: Elan Musk: ఎక్స్‌ సేవల్లో అంతరాయం..ఇది భారీ సైబర్‌ దాడే అంటున్న మస్క్‌!

Also Read: Cyber Crimes: సైబర్‌ నేరగాళ్ల వలలో భారతీయులు.. ఎట్టకేలకు 500 మంది స్వదేశానికి

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

భారీ వర్షం.. పిడుగులు పడి 13 మంది మృతి

బీహార్‌లో పలు జిల్లాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. బుధవారం ఉదయం నాలుగు జిల్లాల పరిధిలో పిడుగులు పడి 13 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. మృతుల కుటుంబాలకు సీఎం నితిశ్ కుమార్ రూ.4 లక్షల పరిహారం ప్రకటించారు.

New Update
13 killed in lightning strikes in four districts of Bihar

13 killed in lightning strikes in four districts of Bihar

బీహార్‌లో పలు జిల్లాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. బలమైన ఈదురు గాలులు వీచాయి. బుధవారం ఉదయం నాలుగు జిల్లాల పరిధిలో పిడుగులు పడి 13 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. దర్‌బంగా, బెగూసరాయ్ జిల్లాల్లో తొమ్మిది మంది పిడుగుపాటుకు గురై మృతి చెందారు. మధుబనీ జిల్లాలో ముగ్గురు చనిపోయారు. వీళ్లలో ఇద్దరూ ఒకే ఫ్యామిలీకి చెందిన తండ్రి, కూతురు. ఇక సమస్తిపుర్‌లో ఒక వ్యక్తి పిడుగుపాటు వల్ల మృతి చెందాడు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం అధికారికంగా వెల్లడించింది.    

Also Read: ముగ్గురు పిల్లల తల్లికి ఇంటర్ స్టూడెంట్‌తో మూడో పెళ్లి

ఈ ఘటనపై సీఎం నితీశ్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. విపత్తు నిర్వహణ అధికారులు జారీ చేసే సూచనలను పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే బిహార్ ఆర్థిక సర్వే ప్రకారం చూసుకుంటే 2023లో పిడుగుపాటు వల్ల 275 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 Also read: పెళ్లికి ముందు కాబోయే అల్లుడితో అత్త జంప్‌..

ఇదిలాఉండగా భారత వాతావరణ శాఖ (IMD) కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 9 నుంచి 12వ తేదీ దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు చెప్పింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలుల విస్తాయని.. పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా సంభవించే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.  

Also read: బీహార్ లో దారుణం కేంద్రమంత్రి మనమరాలి దారుణ హత్య

 

 

Advertisment
Advertisment
Advertisment