/rtv/media/media_files/2025/02/21/6AEaY0KWzNXIYcCz4l7t.jpg)
Gujarat fire breaks out in Vapi area 15 scrap warehouses gutted in blaze
గుజరాత్‌లోని వల్సాద్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శనివారం తెల్లవారుజామున వాపి ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో 15కి పైగా స్క్రాప్ గోదాంలు కాలి బూడిదయినట్లు సమాచారం. వెంటనే ఈ ప్రమాదం గురించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా.. వారు రంగంలోకి దిగారు.
Also Read: అమెరికా కోర్టులో రాణాకు ఎదురు దెబ్బ.. ముంబై ఉగ్రదాడి కేసులో ఇండియా రావాల్సిందే
భారీ మంటలను ఆర్పడానికి దాదాపు 10 మంది అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగతో కప్పబడి ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడికానున్నాయి.
#WATCH | Gujarat | A fire broke out in the Vapi area of the Valsad district during the early hours. More than 15 scrap warehouses got burnt in the fire. Ten fire tenders are present at the spot. More details awaited. pic.twitter.com/dHYm77diGm
— ANI (@ANI) March 8, 2025
గోద్రా రైల్వే స్టేషన్‌లో అగ్నిప్రమాదం
ఇటీవల మార్చి 4న గోద్రా రైల్వే స్టేషన్ సమీపంలోని పాత భవనంలో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక వాహనాలు 5 నుండి 6 గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పాయి. గోద్రా అగ్నిమాపక అధికారి ముఖేష్ భాయ్ చవారా మాట్లాడుతూ ‘‘రాత్రి 1 గంట ప్రాంతంలో రైల్వే స్టేషన్ సమీపంలో మంటలు చెలరేగాయని మాకు ఫోన్ వచ్చింది. మేము సంఘటనా స్థలానికి వెళ్లినప్పుడు, మంటలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ముందు వైపున ఉన్న నాలుగు దుకాణాలు, వెనుక వైపున ఉన్న 5 నుండి 6 ఇళ్లకు మంటలు వ్యాపించాయి. మధ్యాహ్నం 1 గంటకు మంటలు చెలరేగాయని.. ఉదయం 5 గంటలకు అదుపు చేశాము’’ అని ఆయన అన్నారు.