పెళ్లిలో చెప్పుల గొడవ.. నా కొడకా అంటూ పెళ్లి కొడుకుని ఊతికారేశారు!

పెళ్లి టైమ్ లో వరుడి చెప్పులను దాచిపెట్టి రూ. 50 వేలు అడిగితే రూ. 5వేలు ఇచ్చాడంటూ వధువు బంధువులు పెళ్లి కుమారుడితో గొడవ పెట్టుకున్నారు. మాట మాట పెరగడంతో వరుడిని గదిలో బంధించి మరి కర్రలతో కొట్టారు వధువు తరుపు బంధువులు. 

New Update
Joota Chupai

Joota Chupai

ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. పెళ్లి టైమ్ లో వరుడి చెప్పులను దాచిపెట్టి రూ. 50 వేలు అడిగితే రూ. 5వేలు ఇచ్చాడంటూ వధువు బంధువులు పెళ్లి కుమారుడితో గొడవ పెట్టుకున్నారు. తక్కువ డబ్బు ఇచ్చినందుకు గానూ వధువు వైపు మహిళలు వరుడిని బిచ్చగాడు అని పిలిచారు.  దీంతో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ నెలకొంది. మాట మాట పెరగడంతో వరుడిని గదిలో బంధించి మరి కర్రలతో కొట్టారు వధువు తరుపు బంధువులు. 

ఉత్తరాఖండ్‌లోని చక్రతా నుండి వచ్చిన వరుడు ముహమ్మద్ షబీర్ శనివారం తన కుటుంబంతో కలిసి వివాహ ఊరేగింపులో బిజ్నోర్ చేరుకున్నాడు. అయితే అక్కడి వారి ఆచారంలో భాగంగా వరుడి బూట్లును దాచిపెట్టి పెళ్లి కుమారుడిని వధువు తరుపు మహిళలు రూ.50,000 డిమాండ్ చేశారు. పెళ్లి కొడుకు రూ.50,000 కు బదులుగా రూ.5,000 ఇవ్వడంతో వధువు వైపు మహిళలు వరుడిని బిచ్చగాడు అని సంభోధించారు.  

పెళ్లి వాయిదా

దీంతో ఇరు కుటుంబాల మధ్య గొడవ జరిగింది.  మాట మాట పెరగడంతో వరుడిని ఒక గదిలో బంధించి వధువు కుటుంబ సభ్యులు కర్రలతో కొట్టారు. ఈ సంఘటన గురించి పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి చేరుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు. అనంతరం వరుడు, వధువు కుటుంబ సభ్యులు బిజ్నోర్‌లోని నాజీబాబాద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు.  పెళ్లిని వాయిదా వేశారు.  

Also read :  Lemon: సమ్మర్ ఎఫెక్ట్.. వాచిపోతున్న నిమ్మకాయల ధరలు.. పిండితే రసం కూడా రావట్లే!

Advertisment
Advertisment
Advertisment