/rtv/media/media_files/2025/03/24/SJrX1pUhTlfWpvnhnx3U.jpg)
పార్లమెంటు సభ్యులు, మాజీ సభ్యులకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. సభ్యుల జీతం, రోజువారీ భత్యం, పెన్షన్ లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ ఉన్న జీతాలను రూ. లక్ష నుంచి రూ.1.24లక్షలకు పెంచింది. అలాగే డెలీ అలవెన్స్ లను రూ. 2 వేల నుంచి రూ. 2 వేల 500 కు పెంచింది. ఇక పెన్షన్ లను రూ. 25వేల నుంచి రూ. 31 వేల వరకు పెంచింది. అలాగే మాజీ సభ్యులకు ప్రతి సంవత్సరం సర్వీస్‌కు అదనపు పెన్షన్ ను రూ. 2500 చేసింది. ఈ పెరిగిన జీతాలు 2023 ఏప్రిల్ నుంచి అమల్లోకి రానున్నాయి. ద్రవ్యోల్బణ రేటు (వ్యయ ద్రవ్యోల్బణ సూచిక)ను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈ పెరుగుదలను చేసింది.
Also Read : కేబినెట్ విస్తరణ !.. ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు
The salary increase for Members of Parliament (MPs) in India, effective April 1, 2023, reflects a 24% rise in monthly salary and pension, and a 25% rise in daily allowance and additional pension per year of service beyond five years. In contrast, the average annual salary…
— Ask Perplexity (@AskPerplexity) March 24, 2025
Also Read : విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్.. ట్విస్ట్ ఏంటంటే!
పన్ను కట్టాల్సిన అవసరం లేదు
ఇక్కడో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. వారి జీతంపై ఎటువంటి పన్ను కట్టాల్సిన అవసరం లేదు. ఒక ఎంపీకి 50 వేల యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. లక్ష 70 వేల ఉచిత కాల్స్, 40 లక్షల లీటర్ల నీరు, నివసించడానికి ప్రభుత్వ బంగ్లా (ఇందులో అన్ని ఫర్నిచర్, ఎయిర్ కండిషనింగ్) ఉన్నాయి. 1954 ఎంపీ జీతం, పెన్షన్ చట్టం ప్రకారం ఈ మార్పు చేయబడింది. 2018 తర్వాత ఎంపీల జీతం, పెన్షన్‌ను సవరించడం ఇదే మొదటిసారి. 1961 ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 48 వివరణలోని క్లాజు (v) కింద నిర్ణయించబడిన వ్యయ ద్రవ్యోల్బణ సూచిక ఆధారంగా ఈ సవరణ చేయబడింది. దీనిని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేసింది.
Also Read : Ac Offers: వేసవిలో కూలర్లపై బ్లాక్ బస్టర్ డిస్కౌంట్స్.. కిక్కిచ్చే ఆఫర్ అంటే ఇదే భయ్యా!
Also Read : అదృష్టం అంటే ఈ అమ్మాయిదే.. కొత్తగా కొన్న ప్యాంట్ జేబులో డబ్బే డబ్బు!
central-government | latest-telugu-news | today-news-in-telugu | national news in Telugu