కేంద్రం సంచలన నిర్ణయం.. డీజిల్‌పై భారీగా సుంకాలు పెంపు

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా ఇంధన కొరత ఏర్పడకుండా, అలాగే ధరలను అదుపులో ఉంచేందుకు డీజిల్, విమాన ఇంధనం ఎగుమతులపై 'విండ్‌ఫాల్ ట్యాక్స్'ను పెంచింది.

New Update
Govt announces major hikes in export duties on diesel

Govt announces major hikes in export duties on diesel

పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల  అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. దీంతో తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా ఇంధన కొరత ఏర్పడకుండా, అలాగే ధరలను అదుపులో ఉంచేందుకు డీజిల్, విమాన ఇంధనం ఎగుమతులపై 'విండ్‌ఫాల్ ట్యాక్స్'ను పెంచింది. శనివారం నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. వీటి ప్రకారం.. విదేశాలకు ఎగుమతి చేసే డీజిల్‌పై లీటరుకు సుంకాన్ని రూ. 21.5 నుంచి ఏకంగా రూ.55.5 కి పెంచారు. మరోవైపు విమాన ఇంధనంపై రూ. 29.5 నుంచి రూ.42 కి పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read: నేటి నుంచి టోల్ ప్లాజాల్లో కొత్త రూల్స్.. తేడా చేస్తే ఇక అంతే...

అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు భారీగా పెరిగినప్పుడు, చమురు కంపెనీలు తమ లాభాల కోసం విదేశాలకు ఇంధనాన్ని ఎగుమతి చేయాలని భావిస్తాయి. అందుకే దేశంలో పెట్రోల్ బంకుల్లో ఇంధన కొరత లేకుండా చూసేందుకే కేంద్రం ఈ ఈ అదనపు పన్ను విధించింది. ఓవైపు ఎగుమతిదారుల అదనపు లాభాలపై పన్ను విధిస్తూనే.. మరోవైపు దేశీయ అవసరాలకు మొదటి ప్రాధాన్యమిచ్చేలా కేంద్రం చర్యలు తీసుకుంది. కానీ పెట్రోల్ ఎగుమతులపై మాత్రం ఎలాంటి అదనపు సుంకం విధించలేదు.

Also read: ప్రభుత్వ ఉద్యోగులకు అలెర్ట్.. సోషల్‌ మీడియాలో రూల్స్‌

ఇదిలాఉండగా సామాన్యులపై ఇంధన ధరల భారం పడకుండా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు వీటి ధరలను స్థిరంగా ఉంచే యత్నం చేస్తున్నాయి. "లాభాల కన్నా దేశీయ సరఫరా ముఖ్యం" అనే నినాదంతో ముందుకెళ్తున్నాయి. అయితే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఇంధన భద్రత పరంగా కీలకమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ చర్యల వల్ల అంతర్జాతీయ ఒడిదుడుకులు ఉన్నాకూడా.. దేశీయ మార్కెట్‌లో పెట్రోల్, డీజిల్ కొరతపై ఎలాంటి ప్రభావం ఉండదు. 

Advertisment
తాజా కథనాలు