/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/google-jpg.webp)
Google Photograph: (Google )
ప్రపంచవ్యాప్తంగా టెక్ ఉద్యోగాల కోత కొనసాగుతోంది. అనేక కంపెనీలు తమపై ఆర్థిక భారాన్ని దించుకోవడానికి ఒకేసారి వందలాది మందిని ఉద్యోగాల్లోంచి తొలగిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ కంపెనీ.. వందలాది మందిపై వేటు వేసింది. ముఖ్యంగా ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్, పిక్సెల్ ఫోన్స్, క్రోమ్ బ్రౌజర్ విభాగాల్లో పని చేస్తున్న వందల మందిని గురువారం ఒకేసారి ఉద్యోగాల్లోంచి తొలగించినట్లు సమాచారం. ఇప్పటి వరకు కరెక్టుగా ఎంత మందిపై లేఆఫ్స్ ప్రభావం పడిందనే వివరాలు మాత్రం ఇంకా తెలియలేదు. అయితే గూగుల్ ఇంత పెద్ద మొత్తం లేఆఫ్స్ ఎందుకు విధించిందో అనే విషయాలు గురించి తెలుసుకుందాం.
Also Read: Ap Govt: నేడు వారికి సెలవు రద్దూ..ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు!
ఏప్రిల్ 10న గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ ఒకేసారి వందలాది మందికి లేఆఫ్స్ ఇచ్చినట్లు సమాచారం. ఈ వార్త తాజాగా వెలుగులోకి రాగా.. కరెక్టుగా ఎంత మంది ఉద్యోగాలు పోయాయనే విషయాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు. అయితే ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్, పిక్సెల్ ఫోన్స్, క్రోమ్ బ్రౌజర్ విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగులపై మాత్రం ఈ లే ఆఫ్‌ల ప్రభావం పడినట్లు తెలుస్తుంది. జనవరి లో గూగుల్ తన ఉద్యోగులకు ఆఫర్లు ప్రకటించి.. వెంటనే రెండు నెలలకే కోతలు విధించడంతో అంతా షాక్ అవుతున్నారు.
Also Read: Fire Accident: భారీ అగ్ని ప్రమాదం.. బాల్కనీ నుంచి నుంచి దూకిన పిల్లలు, మహిళలు
ముఖ్యంగా 2024 డిసెంబర్ నెలలో కూడా గూగుల్ సంస్థ 10 శాతం మంది ఉద్యోగులపై వేటు వేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు 2023 జనవరి నెలలో మొత్తంగా 12 వేల మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించింది. అయితే ఇందుకు కారణాలు చాలానే ఉన్నట్లు అనేక వార్తలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఆర్థిక అస్థిరత్వం వల్ల గ్లోబల్ మార్కెట్లలో ఒత్తిడి, అమెరికా ప్రతీకార సుంకాల యుద్ధం, మాంద్యం భయాలు, లాభాలు పూర్తిగా క్షీణించిపోవడం, ఏఐ వినియోగం విపరీతంగా పెరగడం వల్ల.. కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవడానికి ఉద్యోగులపై వేటు విధిస్తున్నట్లు తెలుస్తుంది.
ఒక్క గూగుల్ సంస్థనే కాకుండా అనేక కంపెనీలు పలు కారణాలు చెబుతూ.. వేలాది మందిని ఉద్యోగాల్లోంచి తొలగిస్తున్నాయి. 2025వ సంవత్సరంలోనే సాంకేతిక రంగంలో 100 కంపెనీలు 27 వేల 762 మంది ఉద్యోగులను తొలగించినట్లు లేఆఫ్స్.ఎఫ్‌వై వెబ్‌సైట్ వెల్లడించింది. 2024లో సుమారు 549 కంపెనీలు లక్షా 52 వేల 472 మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది.. అలాగే అంతకు ముందు 2023లో వెయ్యి 193 కంపెనీలు.. 2 లక్షల 64 వేల 220 మంది ఉద్యోగాలకు కోత విధించినట్లు స్పష్టం చేసింది.
Also Read: Tahawwur Rana: తహవ్వుర్ రాణాపై కీలక అప్‌డేట్.. ఎక్కడ ఉంచారంటే..?
Also Read: Afghanistan: ఆఫ్ఘనిస్థాన్ లో మితిమీరుతున్న ఆంక్షలు..మోడ్రన్ హెయిర్ కట్ చేసినా..
google | layoffs | google-layoffs | it-layoffs | layoffs-2024 | tech-layoffs | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates