Global Tech Layoffs: ఐటీలో ఉద్యోగులకు బిగ్ షాక్.. 3 నెలల్లోనే 80 వేల మందికి లేఆఫ్స్‌

ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో సంక్షోభం కొనసాగుతోంది. అనేక కంపెనీల్లో లేఆఫ్స్‌ జరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లోనే ప్రపంచవ్యాప్తంగా 80 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు.

New Update
Global Tech Layoffs Surge In 2026 As 80,000 Layoffs So Far

Global Tech Layoffs Surge In 2026 As 80,000 Layoffs So Far

ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో సంక్షోభం కొనసాగుతోంది. అనేక కంపెనీల్లో లేఆఫ్స్‌(Global Tech Layoffs) జరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లోనే ప్రపంచవ్యాప్తంగా 80 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్ తాజా రిపోర్ట్ వెల్లడించింది. కరోనా సంక్షోభం తర్వాత పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు తొలగించడం ఇదేనని తెలిపింది. ఇక 2021 నుంచి 10 లక్షల మంది టెకీలు ఉద్యోగులు కోల్పోయినట్లు పేర్కొంది. 

Also Read: డీలిమిటేషన్ చిక్కుముడితో వీగిపోయిన మహిళా రిజర్వేషన్‌ బిల్లు.. బీజేపీ తొందరపడిందా ?

Global Tech Layoffs Surge In 2026

ఏటీ, ఆటోమేషన్ వైపు కంపెనీలు మొగ్గుచూపడం, తమ మౌలిక సదుపాయాలు, సామర్థ్య పెంపునకు అధికంగా ఖర్చు చేయడం వల్లే లేఆఫ్స్‌ పెరిగాయని నివేదిక వెల్లడించింది. క్లౌడ్ కంప్యూటింగ్, సాఫ్ట్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌-యాజ్‌-ఎ-సర్వీస్‌(SAS) కంపెనీల్లో ఉద్యోగాల కోతలు ఉద్యోగాల కోతలు ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం లేఫ్స్‌లో అమెరికాలోనే 77 శాతం మందిని తొలగించారు.  కంపెనీల పరంగా చూస్తే ఒరాకిల్‌ 26 వేలు, అమెజాన్‌ 16 వేలు, మెటా 2,400 ఉద్యోగాలకు లేఆఫ్స్‌ ప్రకటించాయి. 

Also Read: బీజేపీ నేత హత్య.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కు జీవిత ఖైదు

ముఖ్యంగా కార్మిక శక్తి నిర్ణయాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ప్రభావితం చేస్తోందని ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్ రిపోర్టు తెలిపింది. ఈ తొలగింపుల్లో ఎక్కువగా ఆటోమేషన్ వల్ల కాకుండా.. కంపెనీలు ముందు జాగ్రత్తగా తమ ఖర్చులు తగ్గించుకునేందుకే లేఆఫ్స్‌ ఇచ్చినట్లు పేర్కొంది. అంతేకాదు ఏఐ భవిష్యత్తు పెట్టుబడి మాత్రమే కాదని.. కంపెనీల పునర్నిర్మాణానికి, కార్మిక శక్తి నిర్ణయాలకు చోదక శక్తిగా మారినట్లు వెల్లడించింది.  

Advertisment
తాజా కథనాలు