Mahakumbh: కుంభమేళాలో గంటె పట్టిన అదానీ.. ప్రతి రోజు లక్ష మందికి అన్నదానం

మహాకుంభమేళలో గౌతమ్ అదాని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతి రోజు లక్ష మంది భక్తులకు ఉచితంగా మహా ప్రసాదం పంపిణీ చేయడానికి అదానీ గ్రూప్ కంపెనీ, ఇస్కాన్ సంస్థతో కలిసి పని చేస్తోంది. ఆయన భార్య ప్రీతి అదానీతో కలిసి మంగళవారం భక్తులకు భోజనం వడ్డించారు.

author-image
By K Mohan
New Update
goutham adhani

goutham adhani Photograph: (goutham adhani)

Mahakumbh: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ దగ్గర మహాకుంభమేళ జరగుతున్న విషయం తెలిసిందే. 12ఏళ్లకు ఓసారి వచ్చే ఈ కుంభమేళ 45 రోజులపాటు నిర్వహిస్తారు. సాధువులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పుణ్యస్థానాలు ఆచరిస్తారు. భారతీయ కుబేరుడు గౌతమ్ అదానీ కుంభమేళకు వచ్చిన భక్తులకు ఉచిత మహాప్రసాదాన్ని పంపిణీ చేపట్టారు. ప్రతి రోజు లక్ష మంది భక్తులకు అన్నదానం చేయడానికి అదానీ గ్రూప్ ఇస్కాన్ సంస్థతో టైఅప్ అయ్యింది. ఈ ప్రత్యేక కార్యక్రమం కోసం ఇస్కాన్ సంస్థ భారీ ఏర్పాట్లు చేసింది.

అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ మంగళవారం ఇస్కాన్ టెంపుల్ క్యాంపులో భక్తులకు స్వయంగా భోజనం వడ్డంచారు. ఆయన భార్య ప్రీతి అదానీతో కలిసి ఆహారాన్ని పంపిణీ చేశారు. కుంభమేళాలో మహాప్రసాద్ సేవా కార్యక్రమం కింద ప్రతిరోజూ దాదాపు లక్ష మందికి భోజనాన్ని అందించడానికి అదానీ గ్రూప్ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ఇస్కాన్)తో పని చేస్తోంది. ఈక్రమంలో అదానీ స్వయంగా గంటె పట్టి భోజనం తయారు చేశారు.

ఇది కూడా చదవండి : ఐఐటీ బాబాను బహిష్కరించిన సొంత అఖాడా.. అసలు కారణం ఏంటంటే!

అదానీ బంద్వాలో హనుమాన్ ఆలయాన్ని కూడా దర్శించనున్నారు. ఈ భోజనంలో రోటీలు, పప్పు, అన్నం, కూరగాయలు, మిఠాయిలు తదితర భోజనాలను భక్తులకు అందిస్తున్నారు. డిఎస్‌ఎ గ్రౌండ్ సమీపంలో పెద్ద వంటగదిని ఏర్పాటు చేసి, ప్రతిరోజూ లక్ష మందికి పైగా భోజనం తయారు చేస్తున్నారు. వికలాంగులు, వృద్ధులు, చిన్న పిల్లల కోసం అదానీ గ్రూప్ బ్యాటరీతో నడిచే వాహనాల ఏర్పాటు చేసింది. 

ఇది కూడా చదవండి :మహా కుంభమేళాలో 12 లక్షల తాత్కాలిక ఉద్యోగాలు..!

ఇస్కాన్, గీతా ప్రెస్‌ల సహకారంతో అదానీ గ్రూప్ భక్తుల కోసం వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటోంది. దీనిలో భాగంగా కోటి ఆరతులను పంపిణీ చేస్తూ మహాకుంభ స్ఫూర్తిని నిలబెట్టే ప్రయత్నం జరుగుతోంది. గౌతమ్ అదానీ ఇటీవల ఇస్కాన్ గురు ప్రసాద్ స్వామిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా స్వామీజీతో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సేవే నిజమైన దేశభక్తి రూపం. సేవే ధ్యానం, సేవే ప్రార్థన, సేవే భగవంతుడు అంటూ పేర్కొన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు