/rtv/media/media_files/2026/02/26/flight-2026-02-26-21-01-33.jpg)
Full flight ticket refunds within 48 hours, Says DGCA
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. టికెట్ క్యాన్సిల్, రిఫండ్లకు సంబంధించి నిబంధనలను సవరించింది. కొత్త గైడ్‌లైన్స్ ప్రకారం ప్రయాణికులు టికెట్ బుక్ చేసిన 48 గంటల్లోపు ఎలాంటి ఛార్జీలు లేకుండానే టికెట్‌ను క్యాన్సిల్ చేసుకోవచ్చు. అలాగే మర్పులు కూడా చేసుకోవచ్చు. అయితే ఈ కొత్త రూల్స్ మార్చి 26 నుంచి అమల్లోకి రానున్నాయి.
Also read: వాహనాదారులకు అలెర్ట్.. ఆ తప్పు చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
Full Flight Ticket Refunds Within 48 Hours - DGCA
అయితే లుక్ఇన్ పీరియడ్ సదుపాయానికి పలు షరతులు ఉంటాయి. దేశీయ విమాన ప్రయాణానికి కనీసం ఏడు రోజుల ముందుగా, ఇంటర్నేషనల్ ప్రయాణానికి 15 రోజుల ముందుగా టికెట్లు బుక్ చేసుకున్నవాళ్లకే ఈ రూల్ వర్తించనుంది. ఎయిర్‌లైన్ అధికారిక వైబ్‌సైట్ ద్వారా కాకుండా నేరుగా టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లకే ఈ అవకాశం ఉంటుంది. ఒకవేళ వేరే ఫ్లైట్‌కు టికెట్ మార్చుకుంటే ఛార్జీల వ్యత్యాసాన్ని ప్రయాణికులు చెల్లించాలి.
48 గంటలు దాటాక టికెట్ రద్దు చేసుకుంటే సాధారణ రద్దు ఛార్జీలు ఉంటాయి. అలాగే టికెట్లపై పేరు తప్పుగా పడితే బుక్ చేసిన 24 గంటల్లోపు రిపోర్ట్ చేస్తే ఎలాంటి ఛార్జీలు ఉండవు. టికెట్ల రిఫండ్లు కూడా 14 రోజుల్లోగా వచ్చేస్తాయి. ట్రావెల్ ఏజెంట్ల ద్వారా బుక్ చేసుకున్ టికెట్ల రిఫండ్ బాధ్యత కూడా విమాన సంస్థలదే.
Also Read: కూతురిని చంపి డ్రామా ఆడిన లేడీ డాక్టర్.. పోస్ట్‌మార్టంతో అసలు రంగు బయటపడింది!
Follow Us