Trisha as Jayalalitha: సినిమా రంగం నుంచి పెళ్లి వరకు.. త్రిష, జయలలిత మధ్య ఉన్న 6 పోలికలు ఏంటో తెలుసా?

తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టించింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. దివంగత జయలలితకు, నటి త్రిషకు మధ్య ఉన్న పోలికలను ఎత్తిచూపుతూ "చరిత్ర పునరావృతమవుతుందా?" అనే ప్రశ్నతో ఒక వార్త వైరల్ అవుతోంది.

New Update
FotoJet - 2026-05-05T130620.351

Trisha as Jayalalitha

Trisha as Jayalalitha: తమిళనాడు రాజకీయాల్లో(Tamil Nadu Elections 2026) ప్రస్తుతం నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టిస్తున్న తరుణంలో, సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. దివంగత ముఖ్యమంత్రి జయలలితకు, నటి త్రిషకు మధ్య ఉన్న పోలికలను ఎత్తిచూపుతూ ఒక వార్త వైరల్ అవుతోంది. "చరిత్ర పునరావృతమవుతుందా?" అనే ప్రశ్నతో సాగుతున్న ఈ కథనంలోని ప్రధానాంశాలు ఇవే:

Also Read: ‘దళపతి’ టూ ‘సీఎం’ విజయ్.. విక్టరీతో మారిన ‘జన నాయకన్’ టైటిల్..!

6 Similarities Between Trisha And Jayalalitha

ఈ ఇద్దరు ప్రముఖుల జీవితాల్లోని అనేక వ్యక్తిగత, వృత్తిపరమైన అంశాలు ఒకేలా ఉండటం గమనార్హం:

1.సామాజిక నేపథ్యం: ఇద్దరూ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు.

2. విద్య: జయలలిత చెన్నైలోని చర్చి పార్క్ ప్రెజెంటేషన్ కాన్వెంట్‌లో చదువుకున్నారు. త్రిష కూడా అదే పాఠశాల (Church Park) విద్యార్థిని కావడం విశేషం.

3, వృత్తి: ఇద్దరూ సినీ రంగంలో అగ్ర కథానాయికలుగా రాణించారు. జయలలిత తన కాలంలో నంబర్ వన్ హీరోయిన్‌గా దశాబ్దాల పాటు వెలిగారు. త్రిష కూడా దాదాపు రెండు దశాబ్దాలుగా సౌత్ ఇండియన్ సినిమాల్లో అగ్ర కథానాయికగా కొనసాగుతోంది.

4. వ్యక్తిగత జీవితం: ఇద్దరూ వివాహం చేసుకోలేదు (అన్‌మ్యారీడ్) అలాగే పిల్లలు లేరు (చైల్డ్ ఫ్రీ).

5.రాజకీయ గురువులు, అనుబంధాలు

సినిమా రంగం నుండి రాజకీయాల్లోకి వచ్చిన జయలలితకు ఎంజీఆర్ (MGR) తో ఉన్న అనుబంధం జగమెరిగిన సత్యం. ఇప్పుడు విజయ్ (CJV - దళపతి విజయ్) రాజకీయాల్లోకి వచ్చి విజయం సాధించిన నేపథ్యంలో, ఆయనకు సన్నిహితంగా ఉండే త్రిష కూడా జయలలిత తరహాలో రాజకీయాల్లోకి వస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి.

6. పిలుపు : జయలలితను ప్రజలు ఆత్మీయంగా "అమ్మ" అని పిలిచేవారు. అదే క్రమంలో త్రిషను కూడా కొందరు అభిమానులు "మామి" అని సంబోధిస్తుండటం విశేషం.

Also Read: 'గిల్లి' నుంచి 'లియో' వరకు.. విజయ్-త్రిష హిట్ ట్రాక్ రికార్డ్ ఇదే!

కాగా, గతంలో త్రిష నటించిన 'పొన్నియిన్ సెల్వన్' సినిమా విడుదల సమయంలో ఈ ఇద్దరి మధ్య పోలికల చర్చ పీక్‌కు చేరుకుంది. ఆ సినిమాలో త్రిష పోషించిన 'కుందవై' పాత్రలో ఆమె రాజసం చూసి, చాలా మంది "యువ జయలలితను చూస్తున్నట్లు ఉంది" అని కామెంట్స్ చేశారు. ఆ చిత్రంలో త్రిష హెయిర్ స్టైల్, ఆమె నడక, రాజకీయ చతురత ప్రదర్శించే తీరు జయలలితను గుర్తుకు తెచ్చాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. జయలలిత తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఒంటరిగా పోరాడి 'అమ్మ'గా ఎదిగారు. త్రిష కూడా తన వ్యక్తిగత ,వృత్తిపరమైన జీవితంలో ఎదురైన విమర్శలను చాలా ధైర్యంగా ఎదుర్కొని, ఇప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంటోంది.జయలలిత చాలా ముక్కుసూటిగా ఉండేవారు. త్రిష కూడా ఇంటర్వ్యూలలో చాలా తెలివిగా, నిక్కచ్చిగా సమాధానాలు చెబుతుంది.

Also Read: ‘ఫౌజీ’ షూటింగ్ కు వెళ్తుండగా ప్రమాదం.. ఒకరు మృతి!

ప్రస్తుతం విజయ్ పార్టీ టీవీకే (TVK) విజయం సాధించిన నేపథ్యంలో, త్రిష కూడా భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తుందేమో అనే ఊహాగానాలు ఉన్నాయి. ఒకవేళ ఆమె వస్తే, జయలలిత వారసురాలిగా ఆమెకు మంచి ఆదరణ లభిస్తుందని కొందరు అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. జయలలిత ఒక రాజకీయ ధృవతార. త్రిష ఒక గొప్ప నటి. వీరిద్దరి మధ్య ఉన్న పోలికలు కేవలం వారి నేపథ్యం, విద్య వారు వెండితెరపై ప్రదర్శించిన రాజసానికి సంబంధించినవి మాత్రమే. అయితే, త్రిష తన నటనతో జయలలితను గుర్తుకు తెస్తుందనడంలో మాత్రం అతిశయోక్తి లేదు. వైరల్ అవుతున్న ఈ చిత్రంలో త్రిషను తమిళనాడు ముఖ్యమంత్రిగా చూపిస్తూ, ఆమె వెనుక విజయ్ ఫోటోను ఉంచారు. ఇది జయలలిత తన రాజకీయ గురువు ఎంజీఆర్ ఫోటోను తన వెనుక ఉంచుకున్న తీరును తలపిస్తోంది.భవిష్యత్తులో త్రిష కూడా జయలలిత అడుగుజాడల్లో నడిచి అధికార పీఠాన్ని అధిరోహిస్తుందా అనే చర్చకు ఈ ఫోటో ఆజ్యం పోస్తోంది. - tamilanadu governament

Advertisment
తాజా కథనాలు