Delhi: మహిళలు రాజ్యమేలిన వేళ...ఢిల్లీలో నాలుగోసారి మహిళా సీఎం

దేశంలో ఎక్కడా లేని ప్రత్యేకత ఢిల్లీకి ఉంది. ఇక్కడ సీఎంలుగా పురుషులు పని చేసిన కాలం కంటే మహిళలే ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ రేఖాగుప్తా మహిళా సీఎం కావడం రికార్డ్ అనే చెప్పాలి.  వెస్ట్ బెంగాల్ తర్వాత ఎక్కవ కాలం మహిళా పాలనలో ఉన్న ఢిల్లీనే.

New Update
delhi

Women CM's In Delhi

మహిళలు అత్యధికంగా ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రం ఒక్క ఢిల్లీనే. ఇక్కడ ఇంతకు ముందు సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్, అతిశీ లు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ బీజేపీ నుంచి రేఖా గుప్తా సీఎం అవుతున్నారు. దేశంలో పశ్చిమ బెంగాల్ లో తప్ప మిగతా ఎక్కడా మహిళా సీఎంలు ఉన్న దాఖలాలు లేవు. కేవలం ఆ ఒక్క చోట మాత్రమే దీదీ మమతా చాలా ఏళ్ళుగా ముఖ్యమంత్రిగా ఉంటూ వస్తున్నారు. దాని తరువాత మహిళా సీఎంలకు పెట్టింది పేరు ఒక్క ఢిల్లీనే. ఈ కేంద్ర పాలిత ప్రాంతాన్ని మహిళలు చాలా ఏళ్ళే పరిపాలించారు. ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి షీలా దీక్షిత్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా పేరు గాంచారు. దాదాపు 15 ఏళ్ళు ఆమె ఢిల్లీకి ముఖ్యమంత్రిగా ఉన్నారు. 

హ్యాట్రిక్ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్..

షీలా దీక్షిత్ కంటే ముందు సుష్మా స్వరాజ్ రెండు నెలల పాటూ ఢిల్లీకి సీఎంగా ఉన్నారు. ఆమె తరువాత వచ్చిన షీలా దీక్షిత్ 1998లో ఢిల్లీలో తమ తిరుగులేని ఆధిపత్యాన్ని స్థాపించారు. ఆమె దెబ్బకు చాలా మంది పెద్ద నాయకులు సైతం ఓడిపోగా 15 సంవత్సరాలు తిరుగులేని ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1998లో షీలా దీక్షిత్ నాయకత్వంలో కాంగ్రెస్ కు ఢిల్లీలో తిరుగులేకుండా పోయింది. దీక్షిత్ నాయకత్వంలో రాజధాని మెట్రో సేవలను ప్రవేశపెట్టడం, ఫ్లైఓవర్ల నిర్మాణంతోపాటు CNGని ప్రోత్సహించడం వంటి ప్రధాన నిర్ణయాలతో సహా అద్భుతమైన మార్పులను చూసింది.

ఈమె తర్వాత కేజ్రీవాల్ సీఎం అయ్యారు. అయితే ఆయన పదేళ్లు పాలించి అవినీతి ఆరోపణలతో జైలు కెళ్ళొచ్చాక రాజీనామా చేశారు. దీని తర్వాత అదే పార్టీ నుంచి అతిశీ ముఖ్యమంత్రి అయ్యారు. కేజ్రీవాల్ జైలు నుంచి పరిపాలన చేసినప్పుడు కూడా అన్ని కార్యక్రమాలు అతిశీనే చూసుకున్నారు. ఆమె ద్వారానే మొత్తం పనులు అన్నీ అయ్యాయి. కేజ్రీవాల్ లేని పమయంలో పార్టీని, ఢిల్లీని ముందుకు నడిపించడంలో అతిశీ ముఖ్యపాత్ర పోషించారు. 

ఇప్పుడు బీజేపీ కూడా ఢిల్లీకి మహిళనే సీఎంగా నిర్ణయించింది. ఇప్పటివరకు బీజేపీ పాలనలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో పురుషులే ముఖ్యమంత్రులుగా ఉన్నారు. అందుకే ఒకచోట మహిళా సీఎం ఉంటే బావుంటుందని ఆ పార్టీ అధిష్టానం భావించింది. దానికోసమే స్ట్రాటజిక్ గా రేఖా గుప్తాను ముఖ్యమంత్రిగా నిర్ణయించింది. మొదటి సారి ఎమ్ఎల్ఏ అయిన వెంటనే రేఖా సీఎంగా అవడం మరో విశేషం. రేపు ఢిల్లీ రామ్ లీలా మైదాన్ లో ఈమె ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేఖా గుప్తా 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి అప్ అభ్యర్థిపై 29వేల ఓట్ల ఆధిక్యతతో గెలిచింది. ప్రస్తుతం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏకైక మహిళా ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా నిలిచారు. ఈమె 1997లో ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం అధ్యక్షురాలి కూడా ఎన్నికైయ్యారు. రేఖా గుప్తా 2007, 2012లో ఢిల్లీ కౌన్సిలర్‌గా గెలిచారు.

Also Read: Rekha Gupta: ఫస్ట్ టైం MLAకే CM పదవి.. స్టూడెంట్ లీడర్ నుంచి ఢిల్లీ సీఎం పీఠం

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Kerala: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

సంస్థలో ఆశించిన మేర పని చేయని ఉద్యోగుల పట్ల ఓ సంస్థ అమానవీయంగా ప్రవర్తించిన ఘటన కేరళలో చోటు చేసుకుంది.శునకాల మాదిరిగా మోకాళ్ల పై నడవాలని,నేల పై ఉంచిన కరెన్సీ నాణేలను నాలుకతో తీయాలని ఆదేశించిందట.

New Update
kerala emp

kerala emp

సంస్థలో ఆశించిన మేర పని చేయని ఉద్యోగుల పట్ల ఓ సంస్థ అమానవీయంగా ప్రవర్తించిన ఘటన కేరళలో చోటు చేసుకుంది.శునకాల మాదిరిగా మోకాళ్ల పై నడవాలని,నేల పై ఉంచిన కరెన్సీ నాణేలను నాలుకతో తీయాలని ఆదేశించిందట. దీనికి సంబంధించిన వీడియోలు స్థానిక మీడియాలో ప్రసారం కావడంతో స్పందించిన కార్మిక శాఖ పూర్తిస్థాయి విచారణకు ఆదేశించింది.

Also Read: Iran: చరిత్రలో రికార్డ్ స్థాయికి పడిపోయిన ఇరాన్ కరెన్సీ విలువ.. డాలర్‌కు 10 లక్షల రియాల్స్‌..

ఓ సంస్థలో పని చేస్తున్న వ్యక్తి మెడకు బెల్టు కట్టి ఉండగా...అతడిని మరో వ్యక్తి మోకాళ్ల పై కుక్కలా నడిపించుకుంటూ వెళ్తున్నాడు. మరికొందరు నాలుకతో నాణేలు తీస్తున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు స్థానిక మీడియాలో ప్రసారమయ్యాయి. ఈ విషయమై కొందరు ఉద్యోగులు మీడియాతో మాట్లాడుతూ...నిర్దేశించిన టార్గెట్‌ ను పూర్తి చేయని ఉద్యోగుల పై తమ సంస్థ ఈ విధమైన వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు.

Also Read: Local Body Elections : ఆ పదిస్థానాలకు ఎన్నికలు...మరో ఎన్నికలకు సై అంటోన్న రెండు పార్టీలు

పోలీసుల సమాచారం ప్రకారం..కలూరులోని ఓ ప్రైవేటు మార్కెటింగ్‌ సంస్థతో సంబంధం ఉన్నట్లు తెలిసిందన్నారు.ఘటన మాత్రం పెరుంబవూర్‌ బ్రాంచీలో జరిగినట్లు తెలుస్తోందన్నారు. అయితే యజమాని మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చినట్లు తెలిసింది.దీని పై ఉద్యోగులు ఇప్పటి వరకు ఎవరికీ ఫిర్యాదు చేయలేదని సమాచారం.

ఈ అమానవీయ ఘటన పై కేరళ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ దృశ్యాలు షాక్‌ కు గురి చేశాయని ఆ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి శివన్‌ కుట్టి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమని ఆయన వెల్లడించారు. ఈ ఘటన పైపూర్తి స్థాయి నివేదికను అందించాలని జిల్లా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. 

Also Read: TDP vs Jana Sena : పిఠాపురంలో రచ్చరచ్చ..రెండోరోజు నాగబాబుకు తప్పని నిరసన సెగ

Also Read: Tariffs Effect: ట్రంప్ సుంకాల దెబ్బ.. భారీగా పడిపోతున్న చమురు ధరలు

 kerala | employees | tortured | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment