Maharashtra Train Accident: ఘోర రైలు ప్రమాదం.. 12 మంది మృతి

మహారాష్ట్రలో జల్‌గావ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పరండా రైల్వేస్టేషన్‌ సమీపంలో పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు వస్తున్నాయని ఒకరు చైన్ లాగారు. దీంతో పలువరు ప్రయాణికులు భయంతో పక్కనున్న ట్రాక్‌పై దూకారు. వాళ్లని మరో రైలు ఢీకొనడంతో 12 మంది మృతి చెందారు.

New Update
Train Accident in Maharashtra

Train Accident in Maharashtra

Maharashtra Train Accident: మహారాష్ట్రలో జల్‌గావ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు వస్తున్నాయని ఒకరు చైన్ లాగారు. దీంతో పలువరు ప్రయాణికులు భయంతో పక్కనున్న ట్రాక్‌పై దూకారు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న మరో రైలు ఢీకొని పదుల సంఖ్యలో మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. జలగావ్‌ జిల్లాలోని పరుండా రైల్వేస్టేషన్‌ సమీపంలో.. పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌ వెళ్తోంది. అయితే మార్గమధ్యంలో రైల్లో మంటలు అంటుకున్నాయనే వదంతులు వచ్చాయి. 

Also Read: యూపీఎస్సీ సివిల్స్‌ 2025 నోటిఫికేషన్‌ రిలీజ్.. అప్లికేషన్, అర్హత వివరాలివే!

రైలు ప్రమాదం ఎలా జరిగిందంటే..?

దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఓ వ్యక్తి ట్రైన్ చైన్ లాగాడు. దీంతో కొందరు ఆ రైలు నుంచి పక్కన ఉన్న మరో ట్రాక్‌పై దూకారు. అదే సమాయనికి మరో బెంగళూరు ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ వాళ్లని ఢీకొంది. దీంతో 12 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరో 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం మేరకు అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతునన్నాయి.  

Also Read: అమెరికా నుంచి అక్రమ వలసదారులు ఔట్.. సాధ్యమవ్వడం కష్టమే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు