/rtv/media/media_files/2025/03/22/gFtN5PWsPWU62cFcXGvr.jpg)
Bullets Explosion At Kochi Camp Photograph: (Bullets Explosion At Kochi Camp)
ఓ పోలీస్ ఆఫీసర్ చేసిన తెలివి తక్కువ పని ప్రాణాల మీదకు వచ్చింది. పెద్ద అగ్ని ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడ్డారు. మార్చి 10న త్రిపుణితురలోని కొచ్చి సిటీ పోలీసులకు చెందిన ఆర్మ్‌డ్ రిజర్వ్ క్యాంపు కిచెన్‌లో బుల్లెట్లు వాటంతట అవే పేలాయి. వాటిల్లో గన్‌పౌడర్ ఉండటంతో పేలుడు సంభవించింది. గ్యాస్ సిలిండర్లు ఉన్న ఆ కిచెన్‌లో మంటలు వ్యాపించకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈక్రమంలో అసలు కిచెన్‌లో బుల్లెట్లు ఎలా పేలాయని ఉన్నత అధికారులు దర్యాప్తు చేశారు. ఇన్వెస్టికేషన్‌లో వారికి షాకింగ్ విషయాలు తెలిశాయి.
Also read: Father murdered son: భార్య మీద అనుమానంతో 3ఏళ్ల కొడుకు గొంతు కోసిన టెక్నిషియన్
పోలీసు అధికారులు, ప్రముఖుల అంత్యక్రియల కోసం బుల్లెట్లుతో కాల్పులు జరుగుతారనే విషయం తెలిసిందే. అయితే వాటిలో గన్‌పౌడర్ ఉంటుంది. కాస్త తుప్పు పట్టిన వాటిని వినియోగించేందుకు ఎండలో ఉంచుతారు. ఎస్‌ఐ ఓ పోలీస్ ఆఫీసర్ అంత్యక్రియల కోసం ఖాళీ బుల్లెట్లను సిద్ధం చేసిన్నాడు. అయితే కాస్త తుప్పుపట్టిన వాటిని ఎండలో ఉంచడానికి బదులుగా స్టౌవ్‌పై పెన్నం పెట్టి వేడి చేశాడు. వేడికి గన్ పౌడర్ పేలుడు సంభవించినట్లు తేలింది. గ్యాస్ సిలిండర్లు ఉన్న ఆ కిచెన్‌లో మంటలు పెద్దగా వ్యాపించకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అన్నారు.
Also read: Viral news: భర్తతో గొడవపడి అది కొరికేసిన భార్య.. చేతిలో పట్టుకొని హస్పిటల్‌కు పరుగులు