![jeeth adani](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/media_files/2025/02/08/fcEIXWNrv6x0zcaN4hxr.jpg)
jeeth adani
ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ చిన్న కుమారుడు జీత్ అదానీ , దివా జైమిన్ షా వివాహం కొద్దిరోజుల క్రితం ఎంతో వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాహ వేడుకలో గౌతమ్ అదానీ భావోద్వేగ ప్రసంగం చేసి అందర్ని ఆకర్షించారు. జీత్ అదానీ-ప్రీతి అదానీ మధ్య ఉన్న ప్రత్యేక బంధాన్ని గురించి ఆయన వివరించారు.
జీత్ -దివా వివాహ బంధంలోకి అడుగు పెట్టారు.ఇవి కేవలం మాకు ఆనంద క్షణాలు మాత్రమే కాదు. ఎంతో మంది పేదల జీవితాలను మార్చే కార్యక్రమాలకు నాంది పలుకుతోంది.వీరిద్దరూ జీవితాంతం దాతృత్వం, బాధ్యతలను పంచుకుంటూ గడపాలి అంటూ ఆకాంక్షించారు. ఈ సందర్బంగా ఆయన తన సతీమణి ప్రీతి అదానీ గురించి ప్రస్తావిస్తూ ఆమెను కొనియాడారు.
Also Read: BIG BREAKING: తెలంగాణలో మళ్లీ కులగణన.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం
ఆమె పంచిన ప్రేమ, త్యాగాల...
ఒక మహిళ బిడ్డకు జన్మనివ్వడం మాత్రమే కాకుండా..తన బిడ్డ కలల కోసం ఆమె ఏకంగా తన జీవితాన్ని అంకితం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. జీత్ అదానీ వెనుక ఉన్న నిజమైన శక్తి అతడి తల్లి ప్రీతి అదానీ.ఆమె ప్రేమే అతడిని మార్గ నిర్దేశం చేస్తూ ముందుకు నడిపించింది. నువ్వు జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నావు.మీరు వేసిన ప్రతి అడుగు ఆమె పంచిన ప్రేమ, త్యాగాల ఫలితమే అనే విషయాన్ని గుర్తు పెట్టుకో...ఆమె మీకు బలం. క్లిష్ట పరిస్థితుల్లో '' అమ్మ మీ వెంట'' ఉంటుందని గౌతమ్ అదానీ అన్నారు.
కాగా...గుజరాత్ కు చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి జైమిన్ షా కుమార్తె దివాతో..జీత్ అదానీ వివాహం ఫిబ్రవరి 7న జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుక సందర్భంగా అదానీ కుటుంబం మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏటా 500 మంది దివ్యాంగ సోదరీమణులకు వివాహం నిమిత్తం ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని లక్ష్యం పెట్టుకుంది.
ఈ ప్రయత్నం ద్వారా దివ్యాంగులైన ఆడబిడ్డలు వారి కుటుంబాలు, గౌరవంతో ముందుకు సాగుతాయనే నమ్మకం కలుగుతోందంటూ గౌతమ్ అదానీ తన పోస్టులో ఇటీవల హర్షం వ్యక్తం చేశారు.
Also Read: Supreme Court: ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం.. ఎన్నికల హామీలపై కీలక ఆదేశాలు!
Also Read: Lavanya: షాకింగ్ న్యూస్.. పోలీస్ బాస్‌తో లావణ్య రాసలీలలు.. వీడియో వైరల్!