Encounter: మరోసారి దండకారణ్యంలో కాల్పుల మోత.. 22 మంది మావోయిస్టులు మృతి

తాజాగా మరోసారి కాల్పుల మోతతో దండకారణ్యం దద్దరిల్లింది. గురవారం ఉదయం బీజాపుర్-దంతెవాడ జిల్లాల సరిహద్దులో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 22 మంది మావోయిస్టులు మృతి మృతి చెందారు.

New Update
Encounter in Chhattisgarh’s Bijapur leaves two Naxals, one cop dead

Encounter in Chhattisgarh’s Bijapur leaves two Naxals, one cop dead

గత కొంతకాలంగా ఛత్తీస్‌గడ్‌లో మావోయిస్టులు, కేంద్ర భద్రతా బలగాల మధ్య తరచుగా కాల్పులు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి కాల్పుల మోతతో దండకారణ్యం దద్దరిల్లింది. గురవారం ఉదయం బీజాపుర్-దంతెవాడ జిల్లాల సరిహద్దులో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. బీజాపూర్‌ -దంతెవాడ జిల్లాల సరిహద్దులో దట్టమైన అటవీ ప్రాంతలో భద్రతా బలగాలు సెర్చ్‌ ఆపరేషన్ చేపట్టాయి. 
ఈ క్రమంలోనే మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా.. మరో జవాన్‌ కూడా ప్రాణాలు కోల్పోయారు. అనంతరం బలగాలు మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఘటనాస్థలంలో పేలుడు పదార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టులకు భారీ నష్టం జరిగినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. 
బీజాపూర్‌ జిల్లాలోని గంగలూరు ప్రాంతంలో పెద్దఎత్తున మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో భద్రతా బలగాలను అక్కడికి పంపించినట్లు జిల్లా ఎస్పీ జితేంద్ర యాదవ్ అన్నారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. భద్రతా సిబ్బంది వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు వివరిస్తామని చెప్పారు. ఇదిలాఉండగా నారాయణపూర్‌ జిల్లాలో ఐఈడీ పేలడంతో భద్రతా సిబ్బందిలో ఒకరు తీవ్రంగా గాయాలపాలయ్యారు. ఇదిలాఉండగా 2026 మార్చి నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మావోయిస్టులపై భద్రతా బలగాలు తరుచుగా కాల్పులకు పాల్పడుతున్నాయి. ఇప్పటికే వందలాది మంది మావోయిస్టులు ఈ కాల్పుల్లో మృతి చెందారు.  

Also Read: సూర్యాపేటలో దారుణం..యువతిపై రేప్.. వీడియో తీసిన మరో యువతి

naxalite | maoist | chattisgarh | telugu-news | national news in Telugu

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Moon: 2040 నాటికి చంద్రుడిపైకి భారత వ్యోమగామి

చంద్రునిపై సొంత వ్యోమగామనిని దింపేందుకు భారత్ సిద్ధమవుతోంది 2040 నాటికి జాబిల్లిపై భారత వ్యోమగామి అడుగుపెడతాడని ఆశిస్తున్నామని కేంద్ర మంత్రి డా.జితేంద్ర సింగ్‌ వెల్లడించారు. భారత్‌కు సొంతగా అంతరిక్ష కేంద్రం 2035 నాటికి ఉంటుందన్నారు.

New Update
 Indian Astronaut to land On Moon By 2040

Indian Astronaut to land On Moon By 2040

చంద్రయాన్ 3 విజయం సాధించిన తర్వాత అంతరిక్ష రంగంలో భారత్‌ దూసుకుపోతోంది. ఇప్పుడు ఏకంగా చంద్రునిపై సొంత వ్యోమగామనిని దింపేందుకు సిద్ధమవుతోంది. అయితే 2040 నాటికి జాబిల్లిపై భారత వ్యోమగామి అడుగు పెడతాడని ఆశిస్తున్నామని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డా.జితేంద్ర సింగ్‌ వెల్లడించారు. ఓ జాతీయ మీడియా ఏర్పాటు చేసిన రైజింగ్‌ భారత్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే భారత్‌కు సొంతగా అంతరిక్ష కేంద్రం 'భారత్‌ స్పేస్ స్టేషన్' 2035 నాటికి ఉంటుందని చెప్పారు.  

Also Read: గురుకులాల్లో కోడింగ్‌ శిక్షణ.. ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు !

ఇదిలాఉండగా చంద్రయాన్ 3 మిషన్‌లో ప్రజ్ఞాన్ రోవర్‌ను చంద్రుడి దక్షిణ ధ్రవంపై ల్యాండింగ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇలా చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశగా భారత్ నిలిచింది. అంతేకాదు చంద్రుని దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న మొదటి దేశంగా సరికొత్త రికార్డు సృష్టించింది. మళ్లీ ఇప్పుడు చంద్రయాన్‌ 4 పై ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈసారి చంద్రుడి ఉపరితల నమూనాలను భూమిపైకి తీసుకొచ్చేందుకు ఇస్రో రంగం సిద్ధం చేస్తోంది. 2027లో చంద్రయాన్ 4 ప్రయోగాన్ని చేపట్టనుంది.  

Also Read: అమెరికా ఆహారం బంద్‌..11 దేశాలకు కష్టం!

ఇందులో ఎల్‌వీఎం 3 రాకెట్‌ను రెండుసార్లు ప్రయోగిస్తారు. చంద్రయాన్‌ 4 మిషన్‌కు సంబంధించిన ఐదు భిన్న భాగాలను నింగిలోకి పంపించి వాటిని కక్ష్యలోనే బిగిస్తారు. అయితే చంద్రుడి పైకి భారత వ్యోమగామిని పంపించేవరకు చంద్రయాన్ ప్రయోగాలు జరుగుతూనే ఉంటాయని ఇస్రో ఇప్పటికే స్పష్టం చేసింది. మరోవైపు భారత తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌ను వచ్చే ఏడాది చేపట్టనున్నారు. 

Also Read: పసిబిడ్డల ఉసురు తీస్తున్న అక్రమ సంబంధాలు.. ఈ ఏడాది ఎంతమందిని చంపేశారంటే!

chandrayan-3 | isro | space-station | indian-space-station

Advertisment
Advertisment
Advertisment