Delhi: ఢిల్లీ ఎన్నికల పోలింగ్  షురూ..కేజ్రీవాల్ పై హర్యానాలో ఎఫ్ ఐఆర్

దేశ రాజధాని ఢిల్లీలో పోలింగ్ షురూ అయింది. సాయంత్రం ఆరు గంటల వరకూ ఓటింగ్ జరగనుంది. 1. 56 కోట్ల మంది ప్రజలు ఈరోజు ఓటేయనున్నారు. బీజేపీ, ఆప్, కాంగ్రెస్ మధ్య ఇక్కడ పోటీ బలంగా ఉంది. 

author-image
By Manogna alamuru
New Update
Lok Sabha Elections: ముగిసిన లోక్‌సభ ఐదో దశ ఎన్నికలు.. పోలింగ్ శాతం ఎంతంటే

ఢిల్లీ ఎన్నికలకు సర్వం సిద్ధం అయింది. ఉదయం ఏడు గంటకు పోలింగ్ కూడా ప్రారంభం అయింది. సాయంత్రం 6 గంటల వరకు ఇది కొనసాగనుంది. దాని తరువాత 6.30 ని.ల వరకూ ఎగ్జిట్ పోల్స్ ఎవ్వరూ ఇవ్వడానికి వీలు లేదని ఈసీ చెప్పింది. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఢిల్లీ(Delhi)లో 70 అసెంబ్లీ స్థానాలుండగా.. అందులో 58 జనరల్, 12 ఎస్సీ రిజర్వ్ సీట్లు ఉన్నాయి. మొత్తం 1.56 కోట్ల మంది ఓటర్లున్నారు. ఇందులో పురుషులు 83.49 లక్షలు కాగా.. మహిళా ఓటర్లు 71.74 లక్షల మంది ఉన్నారు. ఇందులో 20 నుంచి 29 ఏళ్ల మధ్య ఉన్న యువ ఓటర్లు 25.89 లక్షలు ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో 2.08 లక్షల మంది మొదటిసారిగా ఓటు వేయనున్నారు. అలాగే ఓటు హక్కు వినియోగించుకునే ట్రాన్స్‌జెండర్లు(Transgenders) 1261 మంది ఉన్నారు.  

పోటాపోటీగా ప్రచారం..

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ(AAP), బీజేపీ(BJP), కాంగ్రెస్(Congress) పార్టీలు పోటీపడి ప్రచారాలు నిర్వహించాయి. ఓటర్లను ఆకర్షించేందుకు ఉచిత హమీల వరాల జల్లులు కురిపించాయి. అయితే ఆమ్ ఆద్మీకి 55 సీట్లు వస్తాయని ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ జోస్యం చెప్పారు. ప్రజలు గట్టిగా అనుకుంటే 60కి పైగా సీట్లు వస్తాయని పేర్కొన్నారు. సోమవారం నిర్వహించిన చివరి ఎన్నికల్లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.  న్యూఢిల్లీ, జంగ్‌పురా, కల్కాజీలో ఆప్‌ గెలవదని బీజేపీ చెబుతోందని.. కానీ ఆ స్థానాల్లో ఆప్‌ చారిత్రాత్మక మెజార్టీతో గెలవనుందని అన్నారు. 

కేజ్రీవాల్ మీద కేసు నమోదు...

ఒకవైపు ఎన్నికల పోలింగ్ జరుగుతుంటే..ఆప్ అధినేత కేజ్రీవాల్ కు హర్యానా ప్రభుత్వం షాకిచ్చింది. యమునా జలాలను హర్యానాలో బీజేపీ విషపూరితం చేస్తోందని కేజ్రావాల్ ఆరోపించారు. దీనిపై ఇప్పుడు అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లర్లను  రెచ్చగొట్టడం, ద్వేషాన్ని ప్రోత్సహించడం, తప్పుడు నేరం మోపడం వంటి అభియోగాలతో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేజ్రావాల్ యమునా నది నీటి విషయంలో చేసిన వ్యాఖ్యలు పెద్ద రాజకీయ దుమారాన్నే రేపాయి. దీనిపై హర్యానా కోర్టు కూడా ఇటీవల నోటీసులు జారీ చేసింది. ఈనెల 17న న్యాయస్థానం ముందు హాజరుకావాలని ఆదేశించింది.

Also Read: Sweden: స్వీడన్ లో కాల్పులు..పది మంది మృతి

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Bengaluru: బెంగళూరులో లైంగిక వేధింపులు కామన్..హోంమంత్రి పరమేశ్వర వివాదాస్పద కామెంట్స్!

బెంగళూరు పెద్ద సిటీ. ఇక్కడ మహిళలపై వేధింపులు కామన్. ఈ మాట అన్నది ఎవరో కాదు. సాక్షాత్తు కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర. ఈ చేసిన కామెంట్స్ ఇప్పుడు వివాదాస్పదం అవుతున్నాయి.  తాజాగా జరిగిన ఓ సంఘటనపై ఆయన ఈ విధంగా స్పందించారు.

New Update
ks

KS Home Minister Parameswara

కర్ణాటక హోంమంత్రి పరమేశ్వరపై అక్కడి మహిళలు మండిపడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు. బెంగళూరులోని బీటీఎం లే అవుట్ లో ఒక వ్యక్తి ఇద్దరు యువతులను ఫాలో అయి...అందులో ఒకామెతో అసభ్యంగా ప్రవర్తించి పారిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపైనే హోంమంత్రి పరమేశ్వర స్పందించారు. పైగా బెంగళూరు పెద్ద సిటీ.. అక్కడ మహిళలపై లైంగిక వేధింపులు కామన్ అంటూ కొట్టిపడేశారు. ఇంకే ముందీ..ఈ వ్యాఖ్యలు కాస్తా పెద్ద దుమారాన్ని రేపాయి. హోంమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడ్డం సరి కాదంటూ మహిళలు దుమ్మెత్తి పోస్తున్నారు. 

అబ్బే అదేమీ పెద్ద విషయం కాదు..

అయితే బెంగళూరులో వేధింపులకు గురైన అమ్మాయిలు తమకు జరిగిన దానిపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు. కానీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అమ్మాయిని వేధించిన వాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హోం మంత్రి కూడా చెప్పారు. కమిషనర్ తో తాను ఫోన్ లో మాట్లాడానని..ఇలాంటి ఘటనలు వైరల్ అయినప్పుడు కామన్ గానే ప్రజల దృష్టి వాటిపైకి వెళుతుందని ఆయన అన్నారు. అంతేకానీ అదేమీ పెద్ద పట్టించుకోవాల్సిన విషయం కాదన్నట్టు మాట్లాడారు. చర్యలు తీసుకుంటామని చెప్పి ఊరుకుంటే అయిపోయేది..కానీ పరమేశ్వర అనవసరంగా నోరు పారేసుకున్నారు. ఇప్పుడు అదే ఆయన నెత్తి మీదకు వచ్చింది. అందరితో తిట్లు తినేలా చేసింది. 

 

today-latest-news-in-telugu | home-minister

 

Also Read: Trump Tariffs: ట్రంప్ సుంకాల దెబ్బకు పడిపోయిన చమురు ధరలు..కంగారులో రష్యా

Advertisment
Advertisment
Advertisment