Earthquake:  కోల్‌కతాలో భూకంపం.. పరుగులు తీసిన జనం... వీడియోలు వైరల్!

పశ్చిమ బెంగాల్ రాజధాని  కోల్‌కతాలో భూకంపం సంభవించింది. మధ్యాహ్నం సుమారు 1:22 గంటల సమయంలో రిక్టార్ స్కేలుపై 5.0 తీవ్రతతో  నమోదైంది. భూకంపం భయంతో ప్రజలు  ఇళ్ళు, కార్యాలయాలు,  పాఠశాలల నుండి బయటకు పరుగులు తీశారు.  

New Update
west

పశ్చిమ బెంగాల్ రాజధాని  కోల్‌కతాలో భూకంపం సంభవించింది. మధ్యాహ్నం సుమారు 1:22 గంటల సమయంలో రిక్టార్ స్కేలుపై 5.0 తీవ్రతతో  నమోదైంది. భూకంపం భయంతో ప్రజలు  ఇళ్ళు, కార్యాలయాలు,  పాఠశాలల నుండి బయటకు పరుగులు తీశారు.  చాలా మంది అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌ల నుండి బయటకు పరుగులు తీసి బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడారు. కోల్‌కతాతో పాటుగా సమీప ప్రాంతాల్లో కూడా భూకంపం  సంభవించినట్లుగా తెలుస్తోంది. బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలో  భూకంప కేంద్రం ఉన్నట్లు సమాచారం. కాగా ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం ఏం జరగలేదు. సోషల్ మీడియా వేదికగా అనేకమంది తమ అనుభవాలను పంచుకున్నారు.

భూకంపం సంభవించడం ఇది రెండోసారి

ఈ నెలలో కోల్‌కతాలో భూకంపం సంభవించడం ఇది రెండోసారి కావడం గమనార్హం. అంతకుముందు ఫిబ్రవరి 3వ తేదీన కూడా నగరంలో స్వల్ప భూకంపం చోటుచేసుకుంది. అప్పట్లో మయన్మార్ కేంద్రంగా వచ్చిన ఆ ప్రకంపనలు పశ్చిమ బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో కనిపించాయి. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ ప్రకారం, తాజా భూకంపం భూమి లోపల 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. దీని ప్రభావం కేవలం పశ్చిమ బెంగాల్‌లోనే కాకుండా పొరుగు రాష్ట్రాల్లో,  బంగ్లాదేశ్‌లోని పలు ప్రాంతాల్లో కూడా కనిపించింది. మయన్మార్‌లోని అక్యబ్ నగరానికి తూర్పున సుమారు 70 మైళ్ల దూరంలో ఈ ప్రకంపనలు మొదలైనట్లు డేటా పేర్కొంటోంది

భూకంపం వంటి విపత్తులు సంభవించినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రకంపనలు వస్తున్న సమయంలో కంగారు పడకుండా గట్టి టేబుల్ లేదా డెస్క్ కింద ఆశ్రయం పొంది, వణుకు తగ్గే వరకు అక్కడే ఉండాలి. ఒకవేళ బయట ఉంటే భవనాలు, చెట్లు, విద్యుత్ తీగలకు దూరంగా ఖాళీ ప్రదేశాల్లోకి వెళ్లాలి. వాహనాల్లో ఉన్నవారు వంతెనలు, ఫ్లైఓవర్లకు దూరంగా సురక్షిత ప్రాంతంలో వాహనాన్ని నిలిపివేసి లోపలే ఉండటం శ్రేయస్కరం. భూకంపం తగ్గిన తర్వాత కూడా గ్యాస్ లీకేజీలు, విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌ల పట్ల జాగ్రత్త వహించాలని, దెబ్బతిన్న భవనాల్లోకి వెళ్లకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు