J&K: జమ్మూ–కాశ్మీర్‌‌లో మోదీ పర్యటన..జడ్‌ మోడ్‌ టన్నెల్ ఓపెనింగ్

ఈనెల 13న ప్రధాని మోదీ జమ్మూ–కాశ్మీర్‌‌లో పర్యటించనున్నారు. అక్కడ సోన్‌మార్గ్‌లో నిర్మించిన జడ్‌మోడ్ టన్నెల్‌ను ఆయన ప్రారంభించనున్నారు. దీని కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాని మోదీ ట్వీట్ చేశారు. 

New Update
omar

జమ్మూకశ్మీర్‌లోని సోన్‌మార్గ్‌ ప్రాంతంలో రూ.2,700 కోట్లతో జడ్‌ మోడ్‌ టన్నెల్‌ ను నిర్మించారు . సోన్‌మార్గ్ దారి అంతా కొండలు, మంచుతో నిండిపోయి ఉంటుంది. ఈ కారణంగా ఇక్కడ ఎప్పుడూ కొండచరియలు, మంచు కారణంగా రాకపోకలకు సమస్యగా మారుతున్నాయి. వీటి బారి నుంచి తప్పించుకోవడానికి ఇక్కడ 12 కిలోమీటర్ల రహదారిని సొరంగ మార్గంలో నిర్మించారు. ఇది సముద్రమట్టానికి 8,650 అడుగుల ఎత్తులో ఉంది. ఇది శ్రీనగర్‌- సోన్‌మార్గ్‌ల మధ్య ప్రయాణాన్నికూడా సులభతరం చేస్తుంది. ఈ టన్నెల్ ఇప్పుడు పూర్తయింది. దీన్ని ప్రారంభించడానికే ఇప్పుడు ప్రధాని మోదీ జమ్మూ–కాశ్మీర్ వెళ్ళనున్నారు. ఈ నెల 13 న ఆయన దీన్ని ప్రారంభించనున్నారు. 

Also read: వారానికి 90 గంటల పని వివాదం.. అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన ఆనంద్ మహీంద్రా

టన్నెల్ ఫోటోలు, వీడియోలు..

ఈ టన్నెల్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను జమ్మూ–కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా  తన ఎక్స్‌లో షేర్ చేశారు. సోన్‌మార్గ్‌ టన్నెల్‌ పర్యటకులకు ఆహ్లాదాన్ని ఇస్తుంది. అంతేకాకుండా శ్రీనగర్‌ నుంచి కార్గిల్‌/ లేహ్‌కు మధ్య ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది అంటూ అందులో రాశారు. దీనికి ప్రధాని మోదీ రియాక్ట్ అయ్యారు. టన్నెల్‌ను ప్రారంభించడానికి తానెంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాని చెప్పారు. 

Also Read: విజృంభిస్తున్న క్యాన్సర్ కేసులు.. ఆస్పత్రుల్లో పెరుగుతున్న బాధితులు

Advertisment
Advertisment
Advertisment