Delimitation : డీలిమిటేషన్ పై ముసాయిదా బిల్లు : 850 స్థానాలకు పెంచేందుకు కేంద్రం అడుగులు

డీలిమిటేషన్ పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లోక్ సభ సీట్లను పెంచేందుకు కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న 543 లోక్ సభ సీట్లను 850కు పెంచాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం ఎంపీలకు జారీ చేసింది.

New Update
FotoJet (64)

Draft Bill on Delimitation

డీలిమిటేషన్(delimitation act) పై  కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లోక్ సభ సీట్లను పెంచేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 543 లోక్ సభ సీట్లు ఉండగా వాటిని 850కు పెంచాలని కేంద్రం నిర్ణయించింది.  దీనికి సంబంధించిన ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం ఎంపీలకు జారీ చేసింది. ఈ సందర్భంగా ఏప్రిల్ 16 నుంచి 18వ తేదీ వరకు మూడు రోజులు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఉంటాయని, ఈ సమావేశాల్లో .. లోక్ సభ సీట్ల పెంపు.. డీలిమిటేషన్ కు సంబంధించిన అంశాలపై చర్చ ఉంటుందని ముసాయిదాలో కేంద్రం స్పష్టం చేసింది. కాగా, డీ లిమిటేషన్‌ కోసం 131వ  రాజ్యాంగ సవరణకు కేంద్రం సిద్ధమైంది. అందుకు సంబంధించి ఆర్టికల్ 55, 81 కింద సవరణ సర్క్యులర్ జారీ చేసింది. కాగా లోక్‌సభలో పెరగనున్న 850 సీట్లలో.. 35 సీట్లు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉండనున్నట్లు కేంద్రం వివరించింది.

Also Read :  బీహార్ కొత్త ముఖ్యమంత్రి ఇతనే.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన BJP

Draft Bill On Delimitation

కాగా,  మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లు(2026 delimitation) లపై అత్యవసరంగా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి చర్చించాల్సిన అవసరం ఏముందని కాంగ్రెస్ పార్టీతోపాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఓ వైపు తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కేవలం రాజకీయ లబ్ధికోసమే కీలకమైన మహిళా రిజర్వేషన్.. డీలిమిటేషన్ బిల్లులను తెరపైకి తీసుకువస్తుందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.

డీలిమిటేషన్(delimitation war) విషయంలో దక్షిణాది రాష్ర్టాలకు(delimitation and southern states) తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయా రాష్ర్టాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో డీలిమిటేషన్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. నియోజకవర్గాల పునర్విభజనతో తెలంగాణ, ఏపీ, కర్నాటక, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాలు తీవ్రంగా నష్ట పోతాయని,  అందువల్ల జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన కాకుండా.. ఆయా రాష్ట్రాల GST, వృద్ధి రేటు, ఆదాయ వనరుల ఆధారంగా సీట్లు పెంచాల్సిన అవసరం ఉందని డిమాండ్‌ చేస్తున్నాయి.

అయితే కేంద్రం ఈ వాదనను పట్టించుకోవడం లేదు. అధికార బీజేపీ మాత్రం  ప్రస్తుతం ఉన్న సీట్ల ఆధారంగా చేసుకుని 50 శాతం అదనంగా ఇవ్వాలనే ప్రాథమిక ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అలా చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గిపోయే ప్రమాదం ఉంది. కేంద్రానికి పన్నుల రూపంలో డబ్బులు దక్షిణాది రాష్ట్రాల నుంచి వెళుతుంటే.. ఉత్తరాధి రాష్ట్రాలు పెత్తనం చేస్తున్నాయని.. ఇది అన్యాయం అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(cm-revanthreddy), తమిళనాడు సీఎం స్టాలిన్‌(CM Stalin) తో పాటు, కేరళ, కర్నాటక రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.  ఈ వివాదం ఇలా కొనసాగుతుండగా కేంద్రం హడావిడిగా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లోనే ముసాయిదా ప్రతిపాదనను తీసుకురావటం విమర్శలకు తావిస్తోంది.

Also Read :  ఢిల్లీ, నోయిడాలో కార్మికుల ఆందోళనలు.. కొత్త కార్మిక చట్టం ఏం చెబుతుందంటే?

Advertisment
తాజా కథనాలు