/rtv/media/media_files/2025/02/21/GsWlQcKGFx8Q7jhtGCuX.jpg)
Eknath Shinde
Eknath Shinde: మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమిలో విభేదాలు వస్తున్నాయని ఈ మధ్య పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇలాంటి తరుణంలో తాజాగా ఏక్‌నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను తేలిగ్గా తీసుకోవద్దంటూ హెచ్చరించారు. ఈ మధ్య సీఎం దేవేంద్ర ఫడ్నవీస్(CM Devendra Fadnavis) సమావేశాలకు షిండే దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2022లో తాను ప్రభుత్వాన్ని పడగొట్టిని విషయాన్ని కూడా మరోసారి గుర్తుకుచేశారు.
Also Read: అల్లుడితో అత్త శృంగారం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న మామ.. చివరికి ముగ్గురు కలిసి!
షిండే హయాంలో ఆమోదించిన ఓ ప్రాజెక్టును ఇప్పుడు ఫడ్నవీస్ సర్కార్ నిలిపివేసింది. ఈ నేపథ్యంలోనే శివసేన నేత షిండే ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమవుతోంది. '' నేను సాధారణ పార్టీ కార్యకర్తను. బాబాసాహెబ్ అడుగుజాడల్లో నడిచిన మనిషిని. దీన్ని ప్రతీఒక్కరు అర్థం చేసుకోవాలి. 2022లో నన్ను అందరూ తేలిగ్గా తీసుకున్నారు. కానీ అప్పుడే అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టా. అసెంబ్లీలో మొదటి ప్రసంగంలో 200 కంటే ఎక్కువ వస్తాయని ఫఢ్నవీస్‌కు చెప్పా. 232 సీట్లు వచ్చాయి. అందుకే నన్ను తేలిగ్గా తీసుకోవద్దు. ఎవరిని ఉద్దేశించి అంటున్నానో వాళ్లు అర్థం చేసుకుంటారని'' ఏక్‌నాథ్ షిండే అన్నారు.
Also Read: అమెరికా డిపోర్టేషన్.. మహిళలు, చిన్నారులకు సంకెళ్లు వేయలేదన్న కేంద్రం
దేవేంద్ర ఫడ్నవీస్‌కు హైకమాండ్ సీఎంగా బాధ్యతలు
ఇదిలాఉండగా మహారాష్ట్రంలో బీజేపీ-శివసేన(షిండే)-ఎన్సీపీ (అజిత్ పవార్) మహాయుతి కూటమి గెలిచిన సంగతి తెలిసిందే. ఇందులో బీజేపీ 132 స్థానాల్లో గెలవగా.. శివసేన 57, అజిత్ పవార్ నేతృత్వంలో ఎన్సీపీ 41 స్థానాల్లో గెలిచింది. ఆ తర్వాత బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌కు హైకమాండ్ సీఎంగా బాధ్యతలు అప్పగించింది. ఇక ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్‌లు డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చింది. సీఎం పదవి ఇవ్వకపోవడంతో షిండే అసంతృప్తిగా ఉన్నారంటూ అప్పటినుంచే వార్తలు వినిపిస్తున్నాయి. ఈమధ్య మహాయుతి కూటమిలో విభేదాలు వచ్చాయని జోరుగా ప్రచారం నడుస్తోంది. ఇలాంటి తరుణంలో షిండే ఇలా మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది.