Donkey Route: అమెరికా వెళ్తామా.. పైకి పోతామా..? అసలేంటీ డాంకీ రూట్ స్టోరీ

అమెరికా వెళ్లే దొడ్డిదారినే గాడిద మార్గం అంటారు. ఏజెంట్లకు డబ్బు ఇస్తే పనామా, మెక్సికో అడవుల మీదుగా అమెరికాకు తీసుకెళ్తారు. కానీ ఇలా వెళ్లడం పెద్ద సవాలే. దట్టమైన అడవిలో ప్రాణాంతకమై జంతువులు, అమెరికా పోలీసుల కంటపడకుండా ప్రయాణించాల్సి ఉంటుంది.

author-image
By K Mohan
New Update
donkey rouate

donkey rouate Photograph: (donkey rouate)

Donkey Route: గోల్పురా అనేది హర్యానాలో ఓ చిన్న గ్రామం. అక్కడి వారికి అమెరికా వెళ్లాలనేది ఓ పెద్ద కల. ఆ గ్రామానికి చెందిన 150 మంది అమెరికా వెళ్లారు. వారిలో దాదాపు 80 గాడిద మార్గంలో అక్కడికి చేరుకున్నారు. ఆ ఊరిలో గాడిద మార్గం గురించి తరుచూ మాట్లాడుకుంటారు. అమెరికాకు వెళ్లే దొడ్డిదారే గాడిద మార్గం. ఇలా అమెరికా వెళ్లేవాళ్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణం చేయాల్సిందే. అమెరికా, భారత్ మధ్య సముద్రం మీదుగా 8,313 మైళ్లు దూరం. ఇంత దూరం దొడ్డి మార్గంలో ఎలా ప్రయాణిస్తారు? గాడిత మార్గం అంటే ఏంటి? అది ఎందుకంత ప్రమాదమో చూద్దాం..

Also Read :  TDPలో మంగ్లి చిచ్చు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ పై దుమ్మెత్తి పోస్తున్న కేడర్!

అమెరికా వెళ్లాలంటే టూరింగ్ వీసా లేదా స్టూడెంట్ వీసా మీద వెళ్లాలి. లేకుంటే అక్కడ ఏదైనా కంపెనీలో జాబ్ వస్తే వాళ్లే మనకు వీసా అరేంజ్ చేస్తారు. కానీ ఇవి ఏవీ అంత సులభం కాదు. ఖర్చుతో కూడుకున్నది. 15 లక్షలు ఇస్తే దొడ్డిదారిన అమెరికాకు చేర్చుతారు. అదే డాంకీ రూట్. దీనికి ఏజెంట్లు, పక్కా ప్లానింగ్, ప్రాణాలకు తెగించిన ప్రయాణం ఉంటుంది. అందులో సినిమా రేంజ్‌లో ట్విస్టులు ఉంటాయి.

గాడిద మార్గానికి దారి..

ఫస్ట్ అమెరికా చేర్చడానికి ఏజెంట్‌తో మాట్లాడుకున్న డబ్బులు కడితే ఏజెంట్లు ఇండియా నుంచి మెక్సికోకి తీసుకెళతారు. పనామా అడవుల్లో వదులుతారు. అక్కడి నుంచే మొదలవుతుంది అసలు కథ. అడుగడుగునా గండాలే. భయంకరమైన దట్టమైన అడువుల్లో కొండలు దాటి వెళ్లాలి. కొంతదూరం పడవలో తర్వాత కాలినడకన ప్రయాణించాల్సి ఉంటుంది. అడుగడుగునా ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉన్న అడవి. పర్వతాలు, చిత్తడి నేలలు, ప్రమాదకరమైన జంతువులు, దారి దోపీడీలు, అమెరికా పోలీసులు ప్రతీది ఓ పరీక్షే. తినడానికి తిండి ఉండదు, లగేజ్ బ్యాగ్‌లో బిస్కెట్లు, కొన్ని పప్పులు, బట్టలు తీసుకెళ్లాలి. ఒక్కడో ఒకచోట ఆగి తిని మళ్లీ నడక ప్రారంభించాలి. ఇలా పనామా తర్వాత మరో మూడు దేశాలు దాటాలి. నికరాగ్వా, గ్వాటెమాల మరియు చివరకు మెక్సికో. మెక్సికోకి చేరుకోగానే అక్కడ తాత్కాలికం శిబిరంలో 20 రోజుల ఉండాలి.

Also Read :  తాడేపల్లి వైసీపీ ఆఫీస్ సమీపంలో అగ్ని ప్రమాదం

తర్వాత అమెరికా చేరుకోవడానికి అడవి బాట పట్టాలి. పోలీసులను తప్పించుకుంటూ, దట్టమైన అడవులు, కాలువల గుండా, అమెరికా ఫారెస్ట్ అధికారులు, సైన్యం కంటపడకుండా దాక్కుంటూ అమెరికా చేరుకోవాలి. ఇదే గాడిద మార్గం. పలకడానికి చిన్న పదమైనా ప్రయాణం పెద్ద సవాలే.. అయితే ఈ మార్గంలో అమెరికా చేరుకోవాలంటే దేనికైనా తెగించాలి. ఎందుకంటే దారి మధ్యలోనే చనిపోవచ్చు. పోలీసులకు దొరికిపోవచ్చు, వన్యమృగాలకు బలికావచ్చు.. ఇంత రిస్క్ ఉంటుంది గాడిద మార్గంలో.. చాలామంది దొరికిపోయి జైళ్లు శిక్ష అనుభవిస్తున్న వాళ్లు ఉన్నారు. అడవిలో కొండలపై నుంచి జారిపడి ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. చాకచక్యంగా అమెరికా వెళ్లిన వారు ఇప్పుడు తిరిగి ఇండియాకు పంపిచేస్తున్నారు. ఇది డాంకీ రూట్ స్టోరీ.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు