/rtv/media/media_files/2025/02/16/ijWlzp3O39Gt8Epjr26R.jpg)
KumbhMela safely Photograph: (KumbhMela safely)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు ఇంకా 10 రోజులు మాత్రమే ఉంది. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళా.. ఫిబ్రవరి 26న ముగియనుంది. సమయం తగ్గుతున్నా కొద్దీ భక్తుల తాకిడి ఎక్కువైతోంది. అంతేకాకుండా ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. వారం రోజుల క్రితం మధ్యప్రదేశ్‌లో కుంభమేళాకు వెళ్తున్న వాహనం రోడ్డు ప్రమాదానికి గురై 10 మంది చనిపోయారు. ఫిబ్రవరి 16న ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో కుంభమేళా వెళ్తున్న భక్తుల తొక్కిసలాట జరిగి 18 మంది చనిపోయారు. ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే రోడ్లో రద్దీ కూడా పెరుగుతుంది. భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుంభమేళాలో అగ్ని ప్రమాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయి.
ఫిబ్రవరి 15వ తేదీ అర్ధరాత్రి 2 గంటలకు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్-మిర్జాపూర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఛత్తీస్‌గఢ్ నుంచి మహా కుంభమేళాకు భక్తులతో వెళ్తున్న బొలెరో ఓ ట్రావెల్ ను బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో పది మంది భక్తులు స్పాట్ లోనే చనిపోయారు. మరో 19 మందికి గాయాలయ్యాయి. ఫిబ్రవరి 16న కూడా కర్ణాటక నుంచి కుంభమేళా వెళ్తున్న ఓ కారు రోడ్డు ప్రమాదానికి గురై యువతి దుర్మరణం చెందింది. ప్రయాగ్ రాజ్‌వెళ్తున్న వాహనాలకు రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. పుణ్యస్నానాలు ఆచారించాలని బయలుదేరిన వారు తిరిగిరాని లోకాలకు వెళ్తున్నారు. అంత దూరం, కోట్ల మందిలో క్షేమంగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించి సేఫ్‌గా ఇంటికి చేరుకోవాలంటే కొన్ని సూచనలు పాటించాలి.
Also Read : వైసీపీ కీలక నేత మృతి.. జగన్ దిగ్భ్రాంతి!
క్షేమంగా కుంభమేళా వెళ్లి తిరిగి రావాలంటే ఇవి ఫాలో అవ్వండి..
- -ప్రైవేట్ వెహికల్స్, టూర్ ట్రావెలర్స్ కాకుండా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్‌లో వెళ్లడానికి ట్రై చేయండి.
- - సొంత వాహనాల్లో ప్రయాగ్‌రాజ్ వెళ్లాల్సివస్తే వెహికల్ కండీషన్ చెక్ చేసుకోండి. నైపుణ్యం ఉన్న డ్రైవర్‌ను పెట్టుకోండి.
- - రైలు రిజర్వేషన్ ఉంటేట్లు చూసుకోండి. ఖర్చు పెట్టగలిగితే విమాన ప్రయాణం బెట్టర్.
- - పిల్లలు, వృద్ధులను మీ వెంట తీసుకెళ్లకండి.
- - ఎక్కువగా ప్రయాగ్‌రాజ్‌లో హిందీ మాట్లాడేవాళ్లే ఉంటారు. హిందీ లేదా ఇంగ్లీష్ వచ్చిన వారిని మీ వెంట తీసుకెళ్లండి.
- - వీలైంత వరకు తక్కువ రోజుల్లోనే కుంభమేళా పర్యటన ప్లాన్ చేసుకోండి.
- - వెళ్లేటప్పుడు లగేజ్ తక్కువగా ఉండేట్లు, అలాగే దారిలో ఇబ్బంది పడకుండా తినడానికి ఫుడ్ తీసుకెళ్లండి.
- గ్యాస్, పేలుడు పదార్థాలు తీసుకెళ్లకండి.
- - పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలు తప్పక పాటించండి, మంచి కండిషన్‌లో ఉన్న వాహనాల్లోనే ప్రయాణించండి.
- - ఘాట్‌లో ఉన్నప్పుడు అక్కడి సిబ్బంది సూచనలు పాటించండి. అనౌస్‌మెంట్ ఫాలో అవ్వండి.
- - మీరు ప్రయాగ్‌రాజ్ బయలుదేరే ముందే రూట్ మ్యాప్ చెక్ చేసుకోండి.
- - కుంభమేళాలో మీరు కలిసి వెళ్లిన గ్రూపుతోనే తప్పిపోకుండా ఉండాలి.
- - బస్సులు, రైళ్లు ఎక్కేటప్పుడు జాగ్రత్తగా.. రద్దీ ప్రాంతాల్లో హడావిడిగా పరిగెత్తడం లాంటివి చేయవద్దు.
- - గుంపుగా ఉన్న చోట వదంతులు నమ్మకండి.
- - వెంట తీసుకెళ్లిన సామాన్లు జాగ్రత్తగా కాపాడుకోండి.
- - రద్దీ ఎక్కువగా ఉండే ఘాట్ కాకుండా త్రివేణి సంగమంలో ఎక్కడైనా పుణ్యస్నానాలు ఆచరించడండి.
- - సుదూర రాష్ట్రాల నుంచి ప్రయాణించే వారు ప్రయాణాల్లో విభిన్న వాతావరణ పరిస్థితులను తట్టుకోవాల్సి ఉంటుంది.
#KumbhMela2025 Important Question is “Where did that NAMAMI GANGE 38,438.05 crore #Budget gone?"#KumbhMela #BudgetSession #UnionBudget pic.twitter.com/x2DtQjKbJq
— Dipankar Kumar Das (@titu_dipankar) February 11, 2025