Prayag Kumbh Mela : పార్లమెంట్ ను కుదిపేసిన కుంభమేళా తొక్కిసలాట
ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళా తొక్కిసలాట ఘటన పార్లమెంట్‌ను కుదిపేసింది. తొక్కిసలాట ఘటనపై లోక్‌సభలో విపక్ష నేతలు పట్టుబట్టడంతో సభలో గందరగోళం నెలకొంది. సోమవారం ఉదయం బడ్జెట్ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాక తొక్కిసలాటపై ప్రభుత్వాన్ని నిలదీశాయి.