/rtv/media/media_files/2026/03/28/dmk-to-contest-164-of-234-seats-in-tamil-nadu-assembly-polls-2026-03-28-17-03-05.jpg)
DMK to contest 164 of 234 seats in Tamil Nadu Assembly polls
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న వేళ అధికార, విపక్ష పార్టీలు గట్టిగా ప్రచారం చేస్తున్నాయి. ప్రజలను ఆకట్టుకునేందుకు ఆకర్షణీయమైన హామీలు ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా అధికార పార్టీ డీఎంకే తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. మొత్తం 234 స్థానాలకు గాను 164 స్థానాల నుంచి బరిలోగి దిగనుంది. ఇక మిగతా 70 స్థానాలు మిత్రపక్ష పార్టీలకు కేటాయించింది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపణీపై సీఎం స్టాలిన్ శనివారం మాట్లాడారు.
Also Read: పెళ్లయిన వ్యక్తితో యువతి సహజీవనం.. కోర్టు సంచలన తీర్పు!
అసెంబ్లీ ఎన్నికల్లో 164 స్థానాల్లో డీఎంకే పోటీ చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్‌కు 28 సీట్లు, DMDKకు 10, VCKకు 8, సీపీఐ, సీపీఎం పార్టీలకు చెరో 5 స్థానాలు, AIDMKకు 4, మిగతా సీట్లు ఇతర చిన్న పార్టీలకు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఇక సీఎం స్టాలిన్ ఎప్పటిలాగే కొలత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఆయన కొడుకు, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ చెపాక్-ట్రిప్లికేన్ నుంచి పోటీ చేయనున్నారు.
Also Read: అసెంబ్లీ ఎన్నికల్లో ఖుష్బూ భర్త పోటీ.. ఎక్కడి నుంచి అంటే?
ఇటీవల మాజీ సీఎం ఓ పన్నీర్‌సెల్వం డీఎంకే పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయనకు కూడా మొదటి జాబితాలో చోటు దక్కింది. బోడినాయకనూరు స్థానం నుంచి ఆయన బరిలోకి దిగనున్నారు. మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ.. కోయంబత్తూర్ సౌత్ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ఇదిలాఉండగా తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23న జరగనున్నాయి. మే 4 ఓట్ల లెక్కింపు ఉండనుంది.
Follow Us