Maha Kumbh Mela: మహాకుంభమేళాకు..73 దేశాల నుంచి దౌత్యవేత్తలు!

యూపీలోని ప్రయాగ్‌ రాజ్‌ లో జరుగుతున్న మహాకుంభమేళాకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు.ఈ క్రమంలోనే 73 దేశాలకు చెందిన దౌత్యవేత్తలు ప్రయాగ్‌ రాజ్‌ కు రానున్నట్లు అధికారులు తెలిపారు.

New Update
Mahakumbh Mela

Mahakumbh Mela

Kumbh Mela: యూపీలోని ప్రయాగ్‌ రాజ్‌ లో జరుగుతున్న మహాకుంభమేళాకు భారీగా భక్తులు తరలి వస్తున్న సంగతి తెలిసిందే. వైభవంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమానికి విదేశాల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు. ఈ క్రమంలోనే 73 దేశాలకు చెందిన దౌత్యవేత్తలు ప్రయాగ్‌ రాజ్‌ కు రానున్నట్లు అధికారులు తెలిపారు.

Also Read: Telangana: రేపటి నుంచి వారి ఖాతాల్లో డబ్బులు.. డిప్యూటీ సీఎం భట్టి అదిరిపోయే శుభవార్త!

రష్యా,ఉక్రెయిన్‌ సహా అమెరికా, జపాన్‌, జర్మనీ,నెదర్లాండ్‌, కామెరూన్‌, కెనడా, స్విట్జర్లాండ్‌, స్వీడన్‌, పోలాండ్‌, బొలీవీయా ఇలా 73 దేశాల దౌత్యవేత్తలు తొలిసారి ఇక్కడికి రానున్నారు. ఫిబ్రవరి 1న త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తారని అధికారులు తెలిపారు.

Also Read: YS Sharmila: విజయసాయి రాజకీయ సన్యాయం వెనుక సీక్రెట్ ఇదే.. సంచలన సీక్రెట్స్ చెప్పిన షర్మిల!

ఈ మేరకు ఉత్తరప్రదేశ్‌ ప్రధాన కార్యదర్శికి విదేశాంగ మంత్రిత్వశాఖ లేఖ రాసింది. ప్రయాగ్‌రాజ్‌కు చేరుకున్న అనంతరం దౌత్యవేత్తలు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు.అనంతరం అక్షయావత్‌,బడేహనూమాన్‌ ఆలయాన్నిసందర్శిస్తారు. కాగా..ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మికవేడుక మహా కుంభమేళాతో ప్రయాగ్‌రాజ్‌ కళకళలాడుతోంది.

జనవరి 13న మొదలైన కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు మొత్తంగా 45 రోజుల పాటు జరగనుంది.విదేశాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో పోటేత్తారు.ఇప్పటి వరకు 10 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఇటీవల ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

ఈ కార్యక్రమం 12 లక్షల తాత్కాలిక ఉద్యోగాలు సృష్టించింది. తాత్కాలిక  వైద్య శిబిరాలతో 1.5 లక్షల మంది నర్సులు,పారామెడిక్స్‌ ఇతర వైద్య సిబ్బందికి అవకాశాలు లభించాయి. 

Also Read: Chenab Rail Bridge: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనపై వందేభారత్ రైలు పరుగులు, వీడియో వైరల్

Also Read: Delhi Elections: 'యమునా నది శుభ్రం, వారికోసం సంక్షేమ బోర్డు'.. బీజేపీ మూడో మేనిఫెస్టో విడదల

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Mohan Bhagwat: 'పాకిస్తాన్ తప్పు చేసింది'.. ఉగ్రదాడిపై RSS చీఫ్ సంచలన వ్యాఖ్యలు

జమ్మూకశ్మీర్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై ఆర్ఎస్ఎస్‌ చీఫ్‌.. మోహన్ భగవత్ స్పందించారు. తప్పు చేసిన వాళ్లని శిక్షించాలాని భగవద్గీత చెబుతోందని అన్నారు. పాకిస్థాన్ తప్పు చేసింది కాబట్టి తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందేనని పేర్కొన్నారు.

New Update
Mohan Bhagwat

Mohan Bhagwat

జమ్మూకశ్మీర్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై ఆర్ఎస్ఎస్‌ చీఫ్‌.. మోహన్ భగవత్ స్పందించారు. శనివారం ఢిల్లీలో నిర్వహించిన  ఓ పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. '' పొరుగు దేశాలతో తమకు గొడవలు, యుద్ధం అవసరం లేదు. శాశ్వత శాంతి కోసమే ఇన్నాళ్లు మౌనంగా ఉన్నాం. కానీ వాళ్లు ఉగ్రదాడులు చేస్తూ అమాయకులను బలి తీసుకుంటున్నారు. ఇప్పుడు దాడులతో సంబంధం లేదని చెబుతున్నారు. తప్పు చేసిన వాళ్లని శిక్షించాలాని భగవద్గీత చెబుతోంది. పాకిస్థాన్ తప్పు చేసింది. కాబట్టి తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే. 

Also Read: భారత్-పాకిస్థాన్ యుద్ధం డేట్‌ ఫిక్స్‌..! పాక్ మాజీ హైకమిషనర్‌ సంచలన కామెంట్స్‌

ఆరోజు రాముడు కూడా.. రావణాసురుడిని రాజ్య ప్రజల సంక్షేమం కోసం మాత్రమే చంపారు. కానీ అది హింస కాదు. ఎవరైనా మాత్రం తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటే అది తప్పు అని చెప్పి.. సరైన మార్గంలో నడిపించడమే రాజు బాధ్యత. ఇప్పుడు రాజు తాను చేయాల్సిన పని చేసుకుంటూ పోతాడని'' మోహన్ భగవత్ అన్నారు.   

Also Read: వామ్మో.. ఆ రాష్ట్రంలో 5వేల మంది పాకిస్థానీయులు..

అలాగే ఈ దాడి దేశ ప్రజలను ఎంతో వేదనకు గురిచేసిందని.. ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదని అన్నారు. తిరిగి చెల్లించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. మనకు బలం లేకపోతో వేరే మార్గాన్ని ఎంచుకునే వాళ్లమని.. ఇప్పుడు మనం బలవంతులం కాబట్టి తప్పకుంటా మన బలమేంటో చూపించాలని మోహన్ భగవత్ అన్నారు. 

Also Read: అంతా మారిపోయింది.. వాళ్లు రాజకీయాల్లోకి రావాలి: రాహుల్‌ గాంధీ

Also Read: మీకు దండం పెడతా.. పిల్లలకు గుండె ఆపరేషన్లు ఉన్నాయి.. పాకిస్థానీ తండ్రి ఆవేదన!

 mohan-bhagwat | attack in Pahalgam 

Advertisment
Advertisment
Advertisment